అసెంబ్లీ 14వ తేదీకి వాయిదా
⇒ 13న ఉభయ సభలు జరగవు... బడ్జెట్‌పై బీఏసీలో నిర్ణయం
⇒ భూమా మృతికి 14న శాసనసభ, మండలిలో సంతాప తీర్మానం
సాక్షి, అమరావతి: నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మృతితో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 13వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. భూమా మృతి కారణంగా 13వ తేదీన ఉభయ సభలు జరగవని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు.
14వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశమవుతాయని, భూమా మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుందని, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని నిర్ణయిస్తారని వెల్లడించారు. 13వ తేదీన ఉదయం జరగాల్సిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశం కూడా రద్దయింది.