bibi patil
-
హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్
మెదక్: బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మరుసటి రోజే అనూహ్యంగా జహీరాబాద్ ఎంపీ టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అంతే కాకుండా పార్టీ క్యాడర్‌తో మమేకమై ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్త, బీజేపీ నేత పైడి ఎల్లారెడ్డిని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మాజీ ఎంపీ దివంగత ఎం.బాగారెడ్డి కుమారుడు ఎం.జైపాల్‌రెడ్డిని ఫోన్‌ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. జైపాల్‌రెడ్డి టికెట్‌ను గట్టిగా ఆశించారు. అతను చివరి వరకు పోటీలో ఉన్నా అనూహ్యంగా బీబీ పాటిల్‌కు టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీబీ పాటిల్ తనతో ఉన్న క్యాడర్‌ను బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పాటిల్ 2014 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు పెద్దగా తెలియని వ్యక్తి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినా ఈయన మహారాష్ట్రలో నిర్మాణ రంగంతో పాటు వివిధ వ్యాపారాలు చేసుకునేవారు. అప్పట్లో పాటిల్ బీజేపీ టికెట్‌ను ఆశించినా దక్కలేదు. తర్వాత పలు కారణాల వల్ల బీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీలో చేరి జహీరాబాద్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. 1.44లక్షల మెజార్టీతో గెలిచి తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టారు. అనంతరం పార్లమెంట్ పరిధిలోని తన పార్టీ ఎమ్మెల్యేలతో కొంత గ్యాప్ పెరిగింది. అయినా రాష్ట్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలుండడం వల్ల 2019 ఎన్నికల్లోనూ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి అంచువరకు వెళ్లి 6,229 మెజార్టీతో బయట పడ్డారు. ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఆయన పలుమార్లు అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తపరిచారు. అధికారిక కార్యక్రమాల్లో, సీఎం, మంత్రుల సభల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి తన పార్లమెంట్ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు. ఇవి చదవండి: బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీ ఎంపీ.. -
ముందుగా కదిలితేనే
ఏళ్లు గడుస్తున్నా.. ఇందూరుకు మాత్రం కొత్తరైళ్లు రావడం లేదు. ఎన్నో బడ్జెట్లు దాటిపోయినై.. కానీ మన జిల్లాలో రైలు కూత పెట్టడం లేదు. పెద్దపల్లి-నిజామాబా ద్ రైల్వేలైన్ కథ.. ఒక్కటి చాలు మన జిల్లాకు రైల్వేశాఖ చేస్తున్న న్యాయం గురించి చెప్పొచ్చు. కొత్త రాష్ట్రంలోనైనా కొత్త రైళ్లు రావాలని జిల్లాజనం కోరుతున్నారు. రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు ప్రాధాన్యం - లేదంటే.. మళ్లీ నిధుల్లో కోతే -మొక్కుబడిగా స్పందిస్తే లాభం లేదు - ఈసారైనా రైల్వేలైన్లు పూర్తవ్వాలె.. - కొత్త రాష్ట్రంలో ‘కూత’ పెట్టాలె.. - ఎంపీలు కవిత, బీబీపాటిల్‌పై జిల్లావాసుల ఆశలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్త రాష్ట్రంలోనైనా రైలుకూత వినిపించాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు. ఎన్నోఏళ్లుగా కలగానే మిగిలిన రైల్వేలైన్లు పూర్తికావాలని ఆశిస్తున్నారు. కేంద్రంలో కూడా నరేంద్రమోడీ సారథ్యంలో కొత్తసర్కారు కొలువుతీరింది. కనుక ఈసారి రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు వరాలు కురవాలంటే మన ఎంపీలు ఇప్పటి నుంచే ఆ దిశగా దృష్టిసారించాలి. గతంలో సకాలంలో స్పందించక పోవడం.. మొక్కుబడిగా ప్రతిపాదనలు పంపడంతో జిల్లా చాలా నష్టపోయింది. రైల్వేబడ్జెట్లలో అంతంత మాత్రమే నిధులు మంజూరయ్యాయి. వచ్చేనెల 7నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జూలై 8న మోడీ సర్కారు రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వచ్చేనెల 9న ఆర్థిక సర్వే, 10న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు ఈ బడ్జెట్ చాలా కీలకం కానుంది. ప్రధానంగా రైల్వేబడ్జెట్‌పై ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు ఆ శాఖ మంత్రి సందానందగౌడ ప్రకటించారు. గతంలో అనేకమార్లు రైల్వేబడ్జెట్‌లు ప్రవేశపెట్టినా జిల్లాకు నిధుల కేటాయింపు తక్కువే. ఇంకా పూర్తికావల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. కేంద్రంపై ఒత్తిడి తేవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా కేంద్రం రైల్వేబడ్జెట్ ప్రవేశపెడుతున్నందున్న మన ఎంపీలు జిల్లా అవసరాలపై దృష్టి సారించాల్సి ఉంది. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్‌లతో పాటు ఢిల్లీలోని మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి కేంద్రంపై ఇప్పటి నుంచే ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైల్వేబడ్జెట్ విషయంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా మన వాటాకు కోతలు పడే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు ఇలాంటి అనుభవమే జిల్లాకు ఎదురైంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిధుల కోతకు ఈసారైనా తెరపడి.. నిధుల మోత మోగాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా ఎంపీల ప్రతిపాదనలు ఉండాలని సూచిస్తున్నారు. ప్రతిసారీ ప్రతిపాదనలు బుట్టదాఖలే..! రైల్వే బడ్జెట్ ప్రవేశపట్టిన ప్రతీసారి ఆశతో ఎదురుచూసే జిల్లావాసులకు నిరాశే మిగులుతోంది. ఇంతకు ముందున్న జిల్లా ఎంపీలు మధుయాష్కీ, సురేశ్ శెట్కార్ పలు ప్రతిపాదనలను చేసినా అవి బుట్టదాఖలయ్యాయి. 2013-14 బడ్జెట్లో వీరు చేసిన ప్రతిపాదనల్లో ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్‌సిగ్నల్ లభించినప్పటికీ ఆ బడ్జెట్లో తగినన్ని నిధులను మాత్రం కేటాయించలేదు. ఆ రైల్వేలైన్ ప్రతిపాదనల వరకే పరిమితమైంది. బోధన్-బీదర్ లైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్లైన్లను పూర్తిగా మరిచిపోయి.. జిల్లావాసులను నిరాశకు గురి చేశారు. సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెంచి, ఆదర్శ స్టేషన్ల అభివద్ధికి పైసా కూడా విదిల్చలేదు. నిజామాబాద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా ప్రకటించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆధునికీకరించిన దాఖలాలు లేవు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు ప్రతీసారి మొండిచెయ్యే చూపుతున్నారు. పాతలైన్ల పూర్తి.. కొత్త రైళ్లపై దృష్టి 2013-14 రైల్వే బడ్జెట్ జిల్లాకు కొంత మోదం.. మరికొంత ఖేదం మిగల్చగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లా ఊసే లేదు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైను మోర్తాడ్ వరకే వచ్చింది. ఈ పనులు 2014 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు మోక్షం కలగడం లేదు. 2013-14 బడ్జెట్లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులతోనే సరిపుచ్చారు. నిజామాబాద్-ముంబయి వరకు వేసిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికీ ఆశాజనకంగా లేవు. జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అభివద్ధికి ప్రధానమైన ఈ కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తుదిరూపు తీసుకు రావాల్సిన అవసరం ఉంది. బోధన్-మిర్జాపల్లి ప్యాసింజర్ మూడు బోగీలతోనే ముక్కి.. ముక్కి.. నడుస్తోంది. దీని బోగీల సంఖ్య పెంచాలని చాలాకాలంగా జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, రైల్వేఓవర్ బ్రిడ్జీలు, ఫుట్ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం, రైల్వే అభివృద్ధి కోసం తక్షణమే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా ఎంపీలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొత్తగా ఎంపికైన పార్లమెంట్ సభ్యులు కవిత, బీబీపాటిల్‌లు తాజా ప్రతిపాదనలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. వచ్చేనెలలోనే రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలంటున్నారు. -
కేసీఆర్ అన్నా.. ఇదేం కిరికిరి
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: 60 ఏళ్ల కల సిద్ధించింది. అమరుల త్యాగాలు ఫలించాయి. ఆత్మగౌరవ పోరాటం సంపూర్ణమైంది. మన పాలన ముంగిట్లో మనం ఉన్న వేళ పడుతున్న తప్పటడుగులు మెతుకుసీమ ప్రజలను కలవరపరుస్తోంది. తెలంగాణ భాష, యాస మీద విధ్వంసం జరుగుతోందని బాధపడ్డ కేసీఆర్ అసలు తెలుగు భాషే రాని, తెలంగాణ యాస తెలియని మరాఠీ వ్యాపారిని పట్టుకొచ్చి పార్లమెంటు టికెట్ ఇవ్వడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఉద్యమం ఎగసిన వేళ ముందుండి నడిచిన యువకులు కొందరైతే.. ఆర్థికంగా ఉద్యమానికి అండగా నిలిచినవాళ్లు మరి కొందరు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ర్టంలో మన పాలన అనుకున్న వీళ్లందరినీ పక్కనపెట్టి జహీరాబాద్ పార్లమెంటు నుంచి బీబీ పాటిల్‌కు టీఆర్ఎస్ అవకాశం ఇవ్వడం నిజామాబాద్, మెదక్ జిల్లాల తెలంగాణవాదులను విస్మయానికి గురిచేసింది. కర్ణాటక సరిహద్దు గ్రామంలో పుట్టిన ఆయన ఎప్పడో మహారాష్ట్రలో స్థిరపడ్డారు. పాటిల్ మాతృ భాష కన్నడం. విద్యాభ్యాసం కర్ణాటక రాష్ట్రం డగ్లూరు నుంచి మొదలైంది. బీబీ పాటిల్‌కు తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు, ఉద్యమ స్వరూపం, నేపధ్యం ఏమిటో తెలియదు. అమర వీరుల బలిదానాలు, ప్రజలు త్యాగాల ఫలితంగా రాష్ట్రం సాధించుకున్న తరువాత ఆయన ఇక్కడికి దిగుమతి అయ్యారు. జహీరాబాద్ పీఠం మీద కన్నేశారు. ఇటీవల జోగిపేటలో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో‘జె తెలంగాణ’ అనే రణ నినాదాన్ని పలకడానికి అష్ట కష్టాలు పడ్డారు. అలాంటి వ్యక్తి నాయకునిగా నిలబెట్టడంపై అటు నిజామాబాద్, ఇటు మెదక్ ప్రజలు ఆందోళనతో ఉన్నారు. వ్యాపారం చేసి సంపాదించిన రూ. వేల కోట్ల డబ్బు బలంతోనే కేసీఆర్‌ను మెప్పించారనే విమర్శలూ వస్తున్నాయి. మా భాష తెలియని నాయకుణ్ణి తెచ్చి నిలబెట్టారు.. మా మనోభావాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మాటే రాని(భాష రాని) మనిషిని తీసుకొచ్చి మాకు మోపు చేయడం కంటే కేసీఆర్ సారొచ్చి జహీరాబాద్ నుంచి పోటీ చేసినా మేం జోలెపట్టి ఓట్లడిగి గెలిపించుకునేటోళ్లం’ అని నారాయణఖేడ్‌కు చెందిన మిహ ళా గ్రూపు సభ్యురాలు అనీశ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ నుంచి కేసీఆర్... మెదక్ పార్లమెంటు నుంచి కేసీఆర్, జహీరాబాద్ పార్లమెంటు నుంచి బీబీ పాటిల్ పేర్లను టీఆర్ఎస్ ఖరారు చేసింది.ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం వారి పేర్లను ప్రకటించింది. బీబీ పాటిల్ సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీకి, మెదక్ పార్లమెంటుకు నామినేషన్లు వేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నంగనూరు మండలం కోనాయిపల్లికి చేరుకుంటారు. అక్కడ శ్రీవెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 10.30 గంటలకు సంగారెడ్డికి చేరుకుని మెదక్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత 12.20 గంటలకు గజ్వేల్ చేరుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పిస్తారు, అక్కడి నుంచి నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. -
డబ్బు మూటలకే టికెట్లు!
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: అరవై ఏళ్ల స్వప్నం ఫలించింది. ఆత్మ బలిదానాల కోరిక పరిపూర్ణమైంది. అయినా అదే రాగం మళ్లీ పునరావృతమవుతోంది. ఉద్యమం అంటే తెలియని పెద్ద దొరలు డబ్బు మూటలు పట్టుకొని వచ్చి టికెట్లు ఎగిరేసుకుపోతుంటే..! మా పాలన మాకేనని తెలంగాణ ఉద్యమంలో మండిన గోళాలు ఇప్పుడు గోస పడుతున్నాయి. కరివేపాకు మయ్యామా అని కన్నీళ్లు పెడుతున్నాయి. ఈ తంతు ఇది ఏ రాజకీయ పార్టీలోనో కాదు. త్యాగాలతో పురుడు పోసుకుని.. ఆత్మ బలిదానాల మీద ఎదిగిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో నెలకొంది. రాజకీయ రంగు పులుముకున్న తరువాత కొనసాగుతున్న తీరు ఇది. ఉద్యమకారులను కరివేపాకుల్లా చేసి డబ్బున్న దొరలకే రాచబాటలు వేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది. అందుకు మెతుకుసీమే వేదికైంది. నాణేనికి ఒక వైపు.. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగోళ సత్యనారాయణ, మరో వైపు బడా పారిశ్రామికవేత్త బీబీ పాటిల్ గురించే జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. జర్నలిస్టుగా ఎదిగి... తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఆస్తులను, ఆప్తులను పొగొట్టుకున్న సత్యనారాయణ ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు. జిల్లాలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు ఎవరంటే సత్యనారాయణ పేరు చెప్పేవారు. ఉద్యమ నిర్మాణంలోనే ఆయన సగం జీవితం కరిగిపోయింది. గంటలు.. రోజులు.. నెలల తరబడి పార్టీ కోసం పని చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షునిగా క్యాడర్ నిర్మాణం చేశారు. తీరా టికెట్ల పంపకాలు వచ్చే వరకు సత్యనారాయణ కరివేపాకు అయిపోయారు. చింతా ప్రభాకర్‌కు సంగారెడ్డి నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వటం స్వాగతించే అంశమే అయినా అదే టికెట్ కోసం పోటీ పడిన సత్యనారాయణ పట్ల ఆ పార్టీ వ్యవరిస్తున్న తీరు మీద విమర్శలు వస్తున్నాయి. ‘ఆస్తులను, ఆప్తులను పొగొట్టుకొని పార్టీ కోసం పని చేశాను. నా మేథస్సునంతా ఉద్యమ నిర్మాణానికే దారపోశాను. ఇప్పుడు ఒంటరిని చేశారు. టికెట్ ఇవ్వమని అడిగితే ఎంత డబ్బు ఇవ్వగలవని అడిగారు.. డబ్బు లేదంటే పార్టీకి పనికి రావని మొఖం మీదే చెప్పారు. ఎదురు తిరగలేను, ఆత్మాభిమానం చంపుకోలేను, ఒక అస్థిపంజరాన్ని అయిపోయాను. కేసీఆర్ గురించి నాకు బాగా తెలుసు.. ఓ కుక్కను చంపాలనుకుంటే ముందుగా దానిని పిచ్చి కుక్కగా చిత్రీకరిస్తారు, అందుకు నేను కూడా ఏమీ మినహాయింపు కాదు’అని సత్యనారాయణ తన మిత్రుల వద్ద గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇక బీబీ పాటిల్ విషయానికి వస్తే.. నిజంగా ఈ పేరు అటు నిజామాబాద్ జిల్లా ప్రజలు, ఇటు మెదక్ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా వినని పేరు. పూర్తి పేరు భీంరావు బసంత్‌రావు పాటిల్. నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని సిరిపూర్ గ్రామం. ఎప్పుడో రాష్ట్రం విడిచిపెట్టిపోయి మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డారు. పెద్ద వ్యాపార వేత్త. రూ. వందల కోట్లకు అధిపతి. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటుసంస్థలకు సంబంధించి పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులను నిర్వహిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. పూణెలో ఇంటర్నెట్ కేంద్రాలను సైతం నిర్వహిస్తున్నట్లు, ఆయా కేంద్రాలలో సుమారు 2వేల మందికి పైగా పని చేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో రాజకీయల్లో చక్రం తిప్పగల సమర్థుడు. నిజం చెప్పాలంటే ఆయనకు తెలంగాణ ఉద్యమానికి ఏ సంబంధం లేదు. కానీ జహీరాబాద్ ఎంపీ సీటు ఖాళీగా ఉందని తెలియడంతో తన బంధవుల ద్వారా గులాబీ దళపతికి వర్తమానం పంపారు. నెల రోజుల కిందట జహీరాబాద్ వచ్చి ఓ మెడికల్ క్యాంపు పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ పెద్దలతో మాట ముచ్చట అయిపోయింది. ముహూర్తం కుదిరింది. వచ్చే నెల ఒకటో తారీఖున ఆయన టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని జహీరాబాద్ నుంచి పోటీకి నిలబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఈ తంతును చూసి కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు.