BIF India
-
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు టెలికం రంగంలోకి దొడ్డిదారిన ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలను బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) ఖండించింది. టెక్ కంపెనీలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. సొంత అవసరాలకు ఉపయోగించుకునే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లకు (సీఎన్‌పీఎన్) కావాల్సిన స్పెక్ట్రం కోసం కూడా వేలంలో పాల్గొనాలన్న వాదనలు పూర్తిగా అసంబద్ధమైనవని వ్యాఖ్యానించింది. రెండు వేర్వేరు రకాల సర్వీసులు, పబ్లిక్..ప్రైవేట్ నెట్‌వర్క్‌లను నిర్వహించే కంపెనీలకు ఒకే తరహాలో సమాన వ్యాపార అవకాశాలు కల్పించాలంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీఐఎఫ్ పేర్కొంది. టెక్ కంపెనీలు తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు మాత్రమే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు సర్వీసులు అందించేందుకు కాదని స్పష్టం చేసింది. సీఎన్‌పీఎన్‌లకు స్పెక్ట్రం ఇచ్చేందుకు ప్రతిపాదించిన నాలుగు విధానాల్లోనూ టెల్కోల ప్రమేయం ఉంటుందని బీఐఎఫ్ తెలిపింది. వాస్తవానికి ఒక విధానంలో ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే టెల్కోల వైపే ఎక్కువ మొగ్గు కూడా ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో టెల్కోలకు దీటుగా తమకే సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని బీఐఎఫ్ పేర్కొంది. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లకు స్పెక్ట్రంను కేటాయించడం సరికాదంటూ టెల్కోల సమాఖ్య సీవోఏఐ ఆక్షేపించిన నేపథ్యంలో బీఐఎఫ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాప్టివ్ నెట్‌వర్క్‌ల కోసం స్పెక్ట్రం కేటాయించడమంటే టెక్ కంపెనీలకు దొడ్డిదారిన టెలికంలోకి ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుందంటూ సీవోఏఐ ఆరోపించింది. -
PM WANI: ‘ఊరూరా పబ్లిక్ వైఫై.. గేమ్ ఛేంజర్’
ఊరూరా పబ్లిక్ వైపై అందించడం కోసం గత సంవత్సరం డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం పీఎం వాణి స్కీమ్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. దేశంలో లక్షలాది వైఫై హాట్స్పాట్లను సృష్టించేందుకు పీఎం వాణి ఎంతగానో ఉపయోగపడనుంది. చౌకగా కోట్లాది మందికి బ్రాడ్సేవలు అందుబాటులోకి వస్తుంది. ఈ పథకంతో ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. తాజాగా ట్రాయ్ చైర్మన్ పి.డి. వాఘేలా బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం శుక్రవారం నిర్వహించిన వర్చ్యువల్ సమావేశంలో పీఎం వాణీ పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎం వాణి స్కీమ్‌తో అందరికి ఇంటర్నెట్ రావడమే కాకుండా భారత్ వృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పథకంతో భవిష్యత్తులో గ్రామాల్లో సమూలమార్పులు రానున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఇంటర్నెట్ వాడకం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. డిజిటల్ ఇండియావైపు పరుగులు తీస్తోన్న మన దేశానికి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు. ప్రస్తుతం భారత్ 750 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 500 మిలియన్ల వరకు కనెక్షన్లు ఉండవచ్చు. ఇంటర్నెట్తో సామాజిక ఆర్థిక రంగాల్లో దేశ ముఖచిత్రం మారిపోవడం కాయమని తెలిపారు. పీఎం వాణీ వేగవంతం సూచనలు చేసిన బీఐఎఫ్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ఈ సమావేశంలో రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నెక్ట్స్ జనరేషన్ వైఫై టెక్నాలజీ పేరుతో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. పీఎం వాణీ పథకం కాస్త వేగంగా ముందడుగు వేయడానికి ప్రస్తుతం ఉన్న అంతరాలను తొలగించాలని ఈ పత్రంలో తెలిపారు. అంతేకాకుండా పథకంపై విసృత స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొంది. పథకం కోసం చిన్న పారిశ్రామికవేత్తలకు పిడిఓ / పిడిఒఎ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం సులభంగా బ్యాంకు రుణాలు, యుఎస్ఓఎఫ్ (యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) నుంచి నిధులు సమకూర్చాలని సూచించింది. రోమింగ్‌ను మరింత సులభతరం చేయడం కోసం తగిన మార్పులు చేయాలని పేర్కొంది చదవండి: Joker Virus: బీ అలర్ట్..! ఈ యాప్‌లు డిలీట్ చేసి ‘జోకర్’ని తరిమేయండి -
గమన్ ఇన్ఫ్రా 9 ప్రాజెక్టుల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ : గమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆరువేల కోట్ల రూపాయల విలువచేసే 9 ప్రాజెక్ట్ కంపెనీలను బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్స్ పీటీఈకు విక్రయించనున్నది. ఈ మేరకు కంపెనీ అనుబంధ సంస్థ గమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ (జీఐపీఎల్) ఒక ఒప్పందాన్ని బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్ పీటీఈతో కుదుర్చుకుంది. ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో ఆరు రోడ్డు ప్రాజెక్టులు కాగా మూడు విద్యుత్ ప్రాజెక్టులని గమన్ ఇన్ఫ్రా బీఎస్ఈకి నివేదించింది. భారత ఇన్ఫ్రా రంగంలో ఒకేసారి ఇంత భారీ స్థాయిలో ఆస్తులు విక్రయించడం ఇదే మొదటిసారి. రెండేళ్లు పూర్తియిన ప్రాజెక్టుల్లో వంద శాతం ఈక్విటీని విక్రయించుకోవడానికి హైవే డెవలర్స్‌కు కేంద్రం అనుమతించిన రెండు రోజుల్లోనే ఈ లావాదేవీ చోటు చేసుకోవడం విశేషం. విక్రయించనున ప్రాజెక్టుల్లో ఆంధ్రా ఎక్స్‌ప్రెస్‌వే, రాజమండ్రి ఎక్స్‌ప్రెస్‌వే ఉన్నాయి., అంతేకాకుండా వైజాగ్ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50 శాతం వాటా విక్రయానికి జీఐపీఎల్ బోర్డ్ ఆమోదం తెలిపింది.