మరీ .. పే...ద్ద లారీ!
సాధారణంగా పది నుంచి 24 టైర్లతో నడిచే లారీలనే మనం చూస్తుంటాం. అంతకంటే ఎక్కువ టైర్లు, పొడవు ఉంటే వింతగా చూస్తాం. అటువంటిదే 106 టైర్లతో విశాఖపట్నం వెళుతున్న భారీ వాహనం మంగళవారం ఉదయం తుని మండలం జగన్నాధగిరి వద్ద ఆగింది. ఇంజి¯ŒSకు పది టైర్లు, లోడు దిగువన ఉన్న ట్రాలీకి 12 వరుసల్లో ఎనిమిదేసి చొప్పన 96 టైర్లు, మొత్తంగా 106 టైర్లు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే ట్రా¯Œ్సఫార్మర్తో నవంబరు 28న గుజరాత్లో ఈ వాహనం బయలుదేరిందని సిబ్బంది తెలిపారు. ఈ నెల ఆరోతేదీకి విశాఖపట్నం చేరుకుంటామని, రోజూ 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తామని డ్రైవర్ చెప్పాడు. రోజూ వాహనం బయలుదేరే ముందు సాంకేతిక నిపుణులు ట్రా¯Œ్సఫార్మర్ ఒక పక్కకు ఒరిగిందా అన్న అంశంతోపాటు టైర్లలో గాలి తగ్గి వ్యత్యాసం వంటివి పరిశీలిస్తారన్నారు. ఈ వాహనం నిర్వహణ నిమిత్తం ఎనిమిది సిబ్బంది లారీలో ప్రయాణిస్తున్నారు.
– తుని రూరల్