big thief
-
గుంటూరులో గజదొంగ!
పేరుమోసిన గజదొంగ గుంటూరు నగరంలో రెక్కీ నిర్వహించాడన్న సమాచారంతో జిల్లా పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఆ దొంగ ఉత్తర భారత్‌కు చెందిన ప్రమాదకర నేరస్తుడని ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు రావడంతో అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా గుంటూరుతోపాటు, పట్టణాల్లోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు రహస్యంగా తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాక్షి, గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరులో గజదొంగ సంచరించా డంటూ వచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీసు యంత్రాంతం ఒక్కసారిగా ఉలికి పాటుకు గురైంది. అత్యంత ప్రమాదకరమైన ఈ దొంగ ముందస్తుగా రెక్కీ నిర్వహించి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో కొద్దిరోజుల క్రితం ఉత్తర భారతదేశానికి చెందిన వాడిగా భావిస్తున్న గజదొంగ కదలికలు గుంటూరు నగరంలో కనిపిం చాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు చేపట్టింది. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాలతోపాటు, గుంటూరు నగరంలో కూడా హోటళ్లు, లాడ్జీల్లో రహస్యంగా తనిఖీలు చేపట్టి, ఆయా గదుల్లో ఉన్న వారి వివరాలను తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీలు, లాడ్జీ ల్లోని రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పదంగా గుర్తించిన వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదంతా రహస్యంగా కొనసాగిస్తుండటంతో విషయాలు బయటకు పొక్కడం లేదు. నగర పరిధిలోని సీసీ కెమెరాల పుటేజీలను కూడా పోలీసు కంట్రోల్ రూము ద్వారా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో జిల్లాలోని కౌంటర్ ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ గజదొంగ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఒక రోజంతా గుంటూరు నగరంలో, ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జీలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని తెలిసింది. అయితే అతను ఏ పేరు, చిరునామా ఇచ్చాడనే విషయాలను పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద ప్రాంతాల్లో వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. తెలంగాణలో భారీ చోరీ మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో బంగారు దుకాణంలో అంతరాష్ట్ర దొంగలు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు జిల్లా ఎస్పీలను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నైట్ బీట్లను పటిష్టం చేయడంతోపాటు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ దొంగ రోజంతా నగరంలో ఉండటంతోపాటు, జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో కూడా సంచరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా నేరాలు, దొంగతనాలకు పాల్పడే ముఠా కన్ను జిల్లాపై పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కొనసాగించాలంటూ ఎస్పీలు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
ఘరానా దొంగ అరెస్టు
12 తులాల బంగారం, 1.5 కిలోల వెండి రికవరీ నిందితుడిపై 27 కేసులు వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్‌కువూర్ శామీర్‌పేట్: ఓ ఘరానా దొంగను అరెస్టు చేసిన పోలీసులు 12 తులాల బంగారంతో పాటు కిలోన్నర వెండిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్‌పేట్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్‌బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కువూర్ కేసు వివరాలు వెల్లడించారు. నెల రోజులుగా రాత్రి సమయాల్లో శామీర్‌పేట్, మేడ్చల్ వుండలాల పరిధిలోని అలియూబాద్, లాల్గడివులక్పేట్, వుజీద్పూర్, పూడూర్, జ్ఞానపూర్, గిర్మాపూర్ తదితర గ్రావూల్లో పలు చోరీలు జరిగాయి. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం వివరాలు సేకరించింది. లాల్గడివులక్పేట్లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటన దొరికిన వేలిముద్రల ఆధారంగా నేరస్తుడిని పట్టుకునేందుకు సీసీఎస్ బాలానగర్ పోలీసుల సహాయుం తీసుకున్నారు. ఈమేరకు చోరీలకు పాల్పడుతున్న బింగి వూధవరావును ఈనెల 24న అల్వాల్‌లో అదుపులోనికి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. ఇటీవల జరిగిన మేడ్చల్, శామీర్‌పేట్ వుండలాల్లో జరిగిన చోరీలు తానే చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి మొత్తం ఆరు కేసులకు సంబంధించి 123.1 గ్రావుుల (12.31 తులాలు)బంగారం, 1557 గ్రావుులు(1.5కిలోల వెండి నగలు) స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంలో నష్టంతో.. నిజావూబాద్ జిల్లా బాన్సువాడ వుండలం కొత్తబాద్కు చెందిన బింగి వూధవరావు అలియూస్ వూరుతీ అలియూస్ వూధవగొండా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. కూకట్‌పల్లిలోని రావూలయుం గుడి దగ్గర నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు చనిపోయారు. గతంలో వ్యాపారం చేసిన వూధవరావు.. అందులో నష్టం రావడంతో సంతోష్కువూర్ అనే వ్యక్తితో కలిసి చోరీలు మొదలు పెట్టాడు. 1999లో మొదటిసారి చోరీచేసి జైలుకు వెళ్లి వచ్చాడు. 2013లో శామీర్‌పేట్ ఠాణా పరిధిలో చోరీ కేసులో ఊచలు లెక్కపెట్టాడు. అదే ఏడాది సీసీఎస్ వుల్కాజిగిరి పోలీసులు వూధ వరావుపై పలు కేసులు నమోదు చేశారు. అనంతరం 2015లో ఓ కేసులో జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఏప్రిల్ 19న జైలు నుంచి విడుదల అరుున వూధవరావు నెలరోజుల్లో వరుస చోరీలు చేశారు. శామీర్‌పేట్ వుండలంలోని లాల్గడివులక్పేట్, అలియూబాద్, వుజీద్పూర్తో పాటు మేడ్చల్ ఠాణా పరిధిలోని పూడూర్, జ్ఞానాపూర్, గిర్మాపూర్ లో చోరీలు చేశాడు. ఇళ్లలో ఎవరూ లేనిది చూసి తన పంజా విసిరాడు. నిందితుడు వూధవరావుపై 27 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సీసీఎస్ పేట్‌బషీరాబాద్ సీఐ వెంకటేశ్వర్, ఎస్ఐ శంకర్‌తో పాటు వారికి సహకరించిన శామీర్‌పేట్ సీఐసత్తయ్యు, ఎస్ఐతో పాటు సిబ్బందిని ఏసీపీ అశోక్‌కుమార్ అభినందించారు. సమావేశంలో సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్, శామీర్‌పేట్ సీఐ సత్తయ్యు, ఎస్ఐలు శంకర్, చంద్రశేఖర్‌రెడ్డి, రవి ఉన్నారు. -
పోలీసుల అదుపులో ఘరానా దొంగ
విజయవాడ: హైటెక్ కారులో వచ్చి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఒక ఘరానా దొంగను విజయవాడ సోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారంలో నష్టం రావడం వల్లే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు నడింపల్లి వినాయక్ కుమార్ తెలిపాడు. వినాయక్ నుంచి రెండు కార్లు, 20 లక్షల రూపాయల నగదు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.