ఘరానా దొంగ అరెస్టు
12 తులాల బంగారం, 1.5 కిలోల వెండి రికవరీ
నిందితుడిపై 27 కేసులు
వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్‌కువూర్
శామీర్‌పేట్: ఓ ఘరానా దొంగను అరెస్టు చేసిన పోలీసులు 12 తులాల బంగారంతో పాటు కిలోన్నర వెండిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్‌పేట్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్‌బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కువూర్ కేసు వివరాలు వెల్లడించారు. నెల రోజులుగా రాత్రి సమయాల్లో శామీర్‌పేట్, మేడ్చల్ వుండలాల పరిధిలోని అలియూబాద్, లాల్‌గడివులక్‌పేట్, వుజీద్‌పూర్, పూడూర్, జ్ఞానపూర్, గిర్మాపూర్ తదితర గ్రావూల్లో పలు చోరీలు జరిగాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం వివరాలు సేకరించింది. లాల్‌గడివులక్‌పేట్‌లోని ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటన దొరికిన వేలిముద్రల ఆధారంగా నేరస్తుడిని పట్టుకునేందుకు సీసీఎస్ బాలానగర్ పోలీసుల సహాయుం తీసుకున్నారు. ఈమేరకు చోరీలకు పాల్పడుతున్న బింగి వూధవరావును ఈనెల 24న అల్వాల్‌లో అదుపులోనికి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. ఇటీవల జరిగిన మేడ్చల్, శామీర్‌పేట్ వుండలాల్లో జరిగిన చోరీలు తానే చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి మొత్తం ఆరు కేసులకు సంబంధించి 123.1 గ్రావుుల (12.31 తులాలు)బంగారం, 1557 గ్రావుులు(1.5కిలోల వెండి నగలు) స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారంలో నష్టంతో..
నిజావూబాద్ జిల్లా బాన్సువాడ వుండలం కొత్తబాద్‌కు చెందిన బింగి వూధవరావు అలియూస్ వూరుతీ అలియూస్ వూధవగొండా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. కూకట్‌పల్లిలోని రావూలయుం గుడి దగ్గర నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు చనిపోయారు. గతంలో వ్యాపారం చేసిన వూధవరావు.. అందులో నష్టం రావడంతో సంతోష్‌కువూర్ అనే వ్యక్తితో కలిసి చోరీలు మొదలు పెట్టాడు. 1999లో మొదటిసారి చోరీచేసి జైలుకు వెళ్లి వచ్చాడు. 2013లో శామీర్‌పేట్ ఠాణా పరిధిలో చోరీ కేసులో ఊచలు లెక్కపెట్టాడు. అదే ఏడాది సీసీఎస్ వుల్కాజిగిరి పోలీసులు వూధ వరావుపై పలు కేసులు నమోదు చేశారు. అనంతరం 2015లో ఓ కేసులో జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
గత ఏప్రిల్ 19న జైలు నుంచి విడుదల అరుున వూధవరావు నెలరోజుల్లో వరుస చోరీలు చేశారు. శామీర్‌పేట్ వుండలంలోని లాల్‌గడివులక్‌పేట్, అలియూబాద్, వుజీద్‌పూర్‌తో పాటు మేడ్చల్ ఠాణా పరిధిలోని పూడూర్, జ్ఞానాపూర్, గిర్మాపూర్ లో చోరీలు చేశాడు. ఇళ్లలో ఎవరూ లేనిది చూసి తన పంజా విసిరాడు. నిందితుడు వూధవరావుపై 27 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సీసీఎస్ పేట్‌బషీరాబాద్ సీఐ వెంకటేశ్వర్, ఎస్‌ఐ శంకర్‌తో పాటు వారికి సహకరించిన శామీర్‌పేట్ సీఐసత్తయ్యు, ఎస్‌ఐతో పాటు సిబ్బందిని ఏసీపీ అశోక్‌కుమార్ అభినందించారు. సమావేశంలో సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్, శామీర్‌పేట్ సీఐ సత్తయ్యు, ఎస్‌ఐలు శంకర్, చంద్రశేఖర్‌రెడ్డి, రవి ఉన్నారు.