bike rallies
-
సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజల జేజేలు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా విజయోత్సవాలు జరుపుకొంటున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ముగ్ధులైన ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రతి నగరం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఊరిలో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలతో సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరగిన బైక్ ర్యాలీల్లో రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో హోం మంత్రి తానేటి వనిత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 3 వేల బైక్‌లతో 25 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ట్రాక్టర్ తోలుతూ ర్యాలీలో పాల్గొన్నారు. కడప నగరంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మాసీమ బాబు, అఫ్జల్ఖాన్, ఏపీ సోషల్వెల్ఫేర్ బోర్డు ఛైర్మెన్ పులి సునీల్ కుమార్ ర్యాలీని నిర్వహించారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలంలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి కూడలి నుంచి సామవాయి మార్గం, అన్నమయ్య మార్గం మీదుగా ర్యాలీ విజయవంతంగా సాగింది. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పాల్గొన్నారు. అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమే ష్ బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ నుంచి లక్ష్మీపురం వరకు 16 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెనమలూరులో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కె.రక్షణనిధి ఆధ్వర్యంలో, విజయవాడ నగరంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. -
ప్రజా గోస బీజేపీ భరోసా.. ప్రజల మద్దతు కోరుతూ మిస్డ్‌కాల్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ పేరిట నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని గురువారం సిద్దిపేటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభిస్తారు. అనంతరం వేములవాడలో నిర్వహించే బైక్‌ర్యాలీ లోనూ సంజయ్ పాల్గొంటారు. తొలివిడతలో రాష్ట్రంలోని 6 ఎంపీ స్థానాల్లోని, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలను సమాంతరంగా మొదలుపెడతారు. ఈ ర్యాలీలకు తాండూరులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేటలో పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్‌రావు, జుక్కల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.వివేక్ వెంకటస్వామి, బోధన్‌లో బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్, నర్సంపేటలో పార్టీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, వేములవాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నేతృత్వం వహిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, బైక్ ర్యాలీ ఇంచార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ సర్కార్ అప్రజాస్వామిక, నియంత, కుటుంబపాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ 6359199199 మొబైల్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్న వారు ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. ఫసల్ బీమా, డబుల్ బెడ్రూమ్లు, నిరుద్యోగం, ఇతర అంశాలపై ఇబ్బందులను తెలుసుకుని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరో 7 నియోజకవర్గాల్లో... త్వరలోనే మరో 7 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ప్రారంభమవుతాయని ప్రేమేందర్‌రెడ్డి చెప్పారు. దేవరకద్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఆదిలాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్, వైరాలో ఎంపీ సోయం బాపూరావు, మేడ్చల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, దేవరకొండలో జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, ఇబ్రహీంపట్నంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుర్తిలో బాబూమోహన్ పాల్గొనను న్నారు. ‘100 టీఎంసీలు ఎత్తిపోయనోడివి లక్ష కోట్లకు పైగా డబ్బులు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు? వరద లతో 1,200 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి’ అని ఆయన సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
బైక్ ర్యాలీలకు బీజేపీ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బైక్‌ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఆరునెలల్లోగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. పర్యటనలు, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా వీటిని ఖరారు చేశారు. ఈ నెల 21న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈ ర్యాలీలను ప్రారంభించనున్నారు. ఆయన కూడా ర్యాలీలో పాల్గొననున్నారు. మొదటివిడతగా ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రెండేసి అసెంబ్లీ స్థానాల్లో 15 రోజులపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత కొన్నిరోజులు విరామం ఇచ్చి రెండోవిడత బైక్‌ర్యాలీలు చేపట్టనున్నారు. మొత్తంగా నాలుగు దశల్లో యావత్ రాష్ట్రం చుట్టివచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఆగస్ట్ 2 నుంచి సంజయ్ ఆధ్వర్యంలో ‘ప్రజా సంగ్రామయాత్ర–3’, ఆ తర్వాత పాదయాత్ర–4ను కొనసాగిస్తూనే, బైక్ ర్యాలీలను కొనసాగించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు ఈ ర్యాలీలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు సాగిన 2 విడతల పాదయాత్రలో చోటు లభించని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందుగా ఈ ర్యాలీలను నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని గ్రామాలను సందర్శించేలా... ఈ బైక్ ర్యాలీల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలను సందర్శించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఒక్కో బైక్‌ర్యాలీకి ఒక సీనియర్ నేత నాయకత్వం వహిస్తారు. ఆ నేతతోపాటు ఇతర ప్రాంతానికి చెందిన మరోనేత, సంబంధిత నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్న నాయకుడు లేదా గతంలో పోటీచేసిన అభ్యర్థి, ఇతర నేతలు, కార్యకర్తలు కలిసి కనీసం వందమంది బైక్‌లతో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు . -
నూజివీడు టీడీపీలో రగులుతున్న అసమ్మతి
బాబు ఏకపక్ష నిర్ణయంపై తమ్ముళ్ల కినుక ముద్దరబోయినకు టికెట్‌పై ఆగ్రహం తమ ప్రభావం తగ్గుతుందని ఒక వర్గంలో భయాందోళనలు మంచిచేసుకొనే పనిలో ముద్దరబోయిన పశ్చిమకృష్ణా/నూజివీడు, న్యూస్‌లైన్ : నూజివీడులో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీటు కేటాయింపు విషయంలో చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఆ పార్టీ జిల్లా, స్థానిక నాయకత్వాలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వొద్దని కోరినా అధినేత ఆయనకే కట్టబెట్టడంపై ఆ పార్టీశ్రేణులు భగ్గుమంటున్నాయి. ముత్తంశెట్టి కృష్ణారావు వర్గీయులు ఆగిరిపల్లిలో శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి బాబు తీరును దుయ్యబట్టారు. పునరాలోచన చేయకుంటే తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ముద్దరబోయిన పార్టీలోనే చేరలేదని, పచ్చ జెండాలు కట్టుకొని బైక్ ర్యాలీలు చేసినంత మాత్రాన టీడీపీ నాయకుడు ఎలా అవుతాడని, నిన్నటి వరకు పార్టీలోని ఒక బలమైన వర్గం వాదిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి బాబులు మచిలీపట్నానికి చెందిన బచ్చుల అర్జునుడుకు సీటు ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారు. బచ్చుల ఆర్జునుడు నూజివీడు నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలో ముద్దరబోయినకు టికెట్ ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. గ్రూపుల గోల.. వ్యూహాత్మకంగా వ్యవహరించి టికెట్ సాధించిన ముద్దరబోయినకు టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టికెట్ చేజారిపోతుందనుకుంటున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర నేత యనమల రామకృష్ణుడు ద్వారా మంత్రాగం నడిపారు. కనకవర్షం కురిపించైనా నూజివీడులో గెలుస్తానని బాబుకు హామీ ఇచ్చి ముద్దరబోయిన టికెట్ తెచ్చుకున్నారని సమాచారం. ప్రాదేశిక ఎన్నికల్లో నూజివీడులో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించడం కోసం ముద్దరబోయిన ఒక మండల పార్టీ నాయకుడి ద్వారా రూ.3.50 కోట్లు ఖర్చు చేసినట్లు భోగట్టా. ప్రస్తుతం ఆ నాయకుడికి నూజివీడు పట్టణ, మిగిలిన మండలాల నేతలకు పొసగకపోవడంతో ముద్దరబోయిన నాయకత్వాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపుల్ని ఎలా మర్చిపోదాం..! ముద్దరబోయిన నాయకత్వాన్ని టీడీపీలోని బలమైన ఒక సామాజికవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తమ సామాజికవర్గాన్ని ముద్దరబోయిన వేధింపులకు గురిచేశారన్నది ఆ వర్గం వాదన. ఈక్రమంలోనే ఆది నుంచి ఆయనకు సీటు ఇవ్వొద్దని గట్టిగా పట్టుబట్టారు. అనూహ్యరితీలో ముద్దరబోయినకు సీటు దక్కడంపై ఆ సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ముద్దరబోయిన నూజివీడులో కూడా గెలిచి పాత పద్ధతినే అవలంబిస్తే తమ వర్గం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ సమాజికవర్గ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఏకపక్షంగా సీటు ఖరారు చేసిన నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. నూజివీడు పట్టణ నాయకులు మొదటి నుంచి ముద్దరబోయిన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో ఇప్పుడు ముందుగా పట్టణ నాయకులను మంచిచేసుకొనేందుకు ముద్దరబోయిన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చాట్రాయి మండలంలోని తమ బంధువు ద్వారా ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల నాయకులతో సర్దుబాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకత్వ లేమి.. నూజివీడులో టీడీపీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. మాజీ ఎమ్మెల్యే కోటగిరి హనుమంతరావు మృతి దరిమిలా ఆపార్టీకి సమర్థ నేత కరువయ్యారు. 2009 ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలో చేరి అనూహ్య విజయాన్ని సాధించిన చిన్నం రామకోటయ్య ఏడాదిన్నర కిందటే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఒక సామాజిక వర్గం వేధింపులే రామకోటయ్య పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి కారణమని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి గల నేత లేకపోవడంతో వలస నాయకులకు టికెట్ కట్టబెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నాయకురు ఒకరు ‘న్యూస్‌లైన్’ వద్ద వాపోయారు.