Billionaire Census
-
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..!
ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తులు అంటే జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్‌గేట్స్ అని చెప్తాం. ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఏవంటే జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్‌గేట్స్ కుటుంబాలు మాత్రం కావు. తాజాగా ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం..గత సంవత్సరంలో ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల సంపద ఏకంగా 22 శాతానికి పైగా పెరిగింది. ప్రపంచంలోని టాప్ 25 బిలియనీర్ కుటుంబాలు గత ఏడాది సుమారు 312 బిలియన్ డాలర్లను పొందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! అత్యంత సంపన్న కుటుంబాల్లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సంస్థను నిర్వహిస్తోన్న వాల్టన్ కుటుంబం తొలి స్థానాన్ని సాధించింది. వాల్టన్ కుటుంబం వరుసగా నాలుగు సార్లు అత్యంత సంపన్న కుటుంబ జాబితాలో చోటు దక్కింది. రెండో స్థానంలో ఫ్రాంక్ మార్స్ కుటుంబం, మూడో స్థానంలో కోచ్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు, నాలుగో స్థానంలో ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల తయారీ కంపెనీ హీర్మేస్ కుటుంబం, ఐదో స్థానంలో సౌదీకి చెందిన అల్సౌద్ రాజ కుటుంబాలు నిలిచాయి. అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ముఖేశ్ అంబానీ కుటుంబం ఆరో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన టాప్-10 కుటుంబాలు క్రమసంఖ్య కుటుంబం కంపెనీ కుటుంబఆస్తుల విలువ 1. వాల్టన్ వాల్‌మార్ట్ కంపెనీ 238.2 బిలియన్ డాలర్లు 2. ఫ్రాంక్ మార్స్ మార్స్ చాక్లెట్ కంపెనీ 141.9 బిలియన్ డాలర్లు 3. కోచ్ కోచ్ ఇండస్ట్రీస్ 124.4 బిలియన్ డాలర్లు 4. హీర్మేస్ హీర్మెస్ లగ్జరీ ఉత్పత్తులు 111.6 బిలియన్ డాలర్లు 5. అల్ సౌద్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్లు 6. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 93.7 బిలియన్ డాలర్లు 7. వెర్టైమర్ చానెల్ లగ్జరీ ఉత్పతులు 61.8 బిలియన్ డాలర్లు 8. జాన్సన్ ఫిడెలిటి ఇన్వెస్ట్మెంట్స్ 61.2 బిలియన్ డాలర్లు 9. థామ్సన్ థామ్సన్ రైయిటర్స్, మీడియా 61.1 బిలియన్ డాలర్లు 10. బోహ్రింగర్, వాన్ బాంబాచ్ బోహ్రింగర్ ఇంగెల్హీమ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ 59.2 బిలియన్ డాలర్లు చదవండి: స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతాని ఢీ కొట్టిన దమ్ము దమానీదే -
World Top 100 Billionaires: బిలియనీర్ల క్లబ్లో మరో భారతీయుడు
సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో వ్యాపారం పుంజుకుంటోంది. మన వ్యాపారవేత్తలు వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. ప్రపంచ కుబేరుల సరసన నిలుస్తున్నారు. తాజాగా ఇండియా నుంచి మరోకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వంద మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. 97వ స్థానం ఇండియల్ బిగ్‌బుల్‌గా పేరొందిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గురులాంటి వ్యక్తి రాధకిషన్ దమానీ. ఏన్నె ఏళ్లుగా ఆయన స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. డీమార్ట్ నుంచే రాధాకిషన్ దమానీకి అత్యధిక సంపద తెచ్చిపెట్టిన వ్యాపారంలో ప్రథమ స్థానంలో నిలిచింది డీమార్ట్. దమానీ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న డిమార్ట్ షేర్ల విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డీమార్ట్‌లో రాధాకిషన్ దమానీకి 65.20 శాతం వాటా కలిగిని ఉన్నారు. డీమార్ట్ షేర్ వాల్యూ జనవరి 1న రూ.2,789 ఉండగా ఆగస్టు 17న ఏకంగా ఒక షేరు విలువ రూ.3,649కి చేరుకుంది. కేవలం ఎనిమిది నెలల్లో షేరు విలువ 31 శాతం పెరిగింది. దీంతో డీమార్ట్ ద్వారా దమానీ ఖాతాలో 1.54 లక్షల కోట్ల సంపద చేరింది. మిగిలినవి దమానీ సంపదలో డీమార్ట్ తర్వాత సుందర్ ఫైనాన్స్ నుంచి రూ.634 కోట్లు, ట్రెంట్గ్రూపు ద్వారా రూ.488 కోట్లు, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ నుంచి రూ.230 కోట్లు, మెట్రో పోలిస్ హెల్త్‌కేర్ ద్వారా రూ. 229 కోట్ల సంపదను ఆయన కలిగి ఉన్నారు. చదవండి: ఏడుగురు మహిళలు..రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్ -
కుబేరుల ఖిల్లా... భారత్!
సింగపూర్/న్యూఢిల్లీ: అధిక బిలియనీర్లు ఉన్న ఆరో దేశంగా భారత్ ఈ ఏడాదీ తన స్థానాన్ని నిలుపుకుంది. అయితే 2013తో పోల్చితే బిలియనీర్ల సంఖ్య 103 నుంచి 100కు తగ్గింది. వెల్త్-ఎక్స్, యూబీఎస్ బిలియనీర్ సెన్సస్ 2014 ఈ వివరాలను వెల్లడించింది. ముఖ్యాంశాలు... ఈ ఏడాది భారత్‌లో కుబేరుల సంఖ్య 100కు తగ్గింది. ఈ వంద మంది సంపద కూడా 17, 500 కోట్ల డాలర్లకు చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య రికార్డ్ స్థాయికి, 2,325కు చేరింది. స్విట్జర్లాండ్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్ తదితర దేశాల కన్నా భారత్‌లోనే బిలియనీర్ల సంఖ్య అధికం.28 మంది బిలియనీర్లతో ముంబై ప్రపంచంలోనే అగ్రశ్రేణి 20 బిలియనీర్ సిటీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ షయంలో 103 మంది బిలియనీర్లతో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది. ఇక అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. 571 మంది బిలియనీర్లతో అమెరికా ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(190 మంది బిలియనీర్లు), యునై టెడ్ కింగ్డం(130)లు నిలిచాయి.