binami holders
-
అగ్రిగోల్డ్ కేసు: తాజాగా వెలుగులోకి సంచలనాత్మక అంశాలు
సాక్షి, హైదరాబాద్: అనేక రాష్ట్రాల్లో బినామీ పేర్ల మీద భూములు, ఇతరత్రా ఆస్తులు కూడబెట్టిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో అనేక సంచలనాత్మక అం శాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రిగోల్డ్ పెద్దలు అనేక సంస్థల పేరిట వేల ఎకరాలు కొనుగోలు చేసి వాటిని మూడోకంటికి తెలియకుండా అమ్మకం సాగిస్తున్నారన్న అంశాన్ని ప్రస్తుతం సీఐడీ అధికారులు వెలుగులోకి తీసుకువచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా బినామీ కంపెనీల ఆస్తులను జప్తు చేయకుండా ఉండేందుకు గతంలో దర్యాప్తు అధికారులుగా వ్యవహరించిన వారితోపాటు సీనియర్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు దర్యాప్తులో బయటపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి సైతం నివేదిక చేరినట్టు తెలుస్తోంది. 76 ఎకరాలు అటాచ్ చేయకుండా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో 76 ఎకరాల అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను అటాచ్ చేయకుండా ఉం డటంతోపాటు మరో 156 ఎకరాల బదలాయింపు పై అగ్రిగోల్డ్ నిందితులు, మ«ధ్యవర్తులు, సీఐడీ అధికారుల మధ్య రూ.3 కోట్ల డీల్ కుదిరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సీఐడీలోని కీలక అధికారులకు కోటి రూపాయలు అడ్వాన్స్‌గా ముట్టినట్టుగా తాజా దర్యాప్తులో బయటపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మిగిలిన రూ.2 కోట్ల వ్యవహారంలో మధ్యవర్తులు, అగ్రిగోల్డ్ పెద్దల నడుమ తేడాలు రావడంతో సంబంధిత అధికారులకు ఆ డబ్బు చేరలేదన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీస్ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతో అంతర్గత విచారణ జరుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు అధికారుల మార్పు ఇందుకే..! తాజా పరిణామాలతో అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు అధికారుల మార్పిడికి కారణం ఏమిటో తెలిసిందని అంటున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చే యాల్సింది పోయి, కొంతమంది అధికారులు ము డుపులకు కక్కుర్తి పడి నిందితులతో చేతులు కలిపినట్టు ఆరోపణలు వచ్చాయని, ఈ కారణంగానే దర్యాప్తు అధికారులను మార్చి తాజాగా కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. అగ్రిగోల్డ్ పెద్దలే రింగ్ లీడర్లు! బినామీ ఆస్తులను మూడో కంటికి తెలియకుండా చేతులు మార్చిన వ్యవహారంలో అగ్రిగోల్డ్ పెద్దలే రింగ్ లీడర్లుగా ఉన్నారని సీఐడీ గుర్తించింది. బినామీ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సీఐడీ అధికారులు నిందితులను ఇటీవల విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. బినామీ ఆస్తుల అమ్మకానికి.. కంపెనీలకు ఎలాంటి సంబంధం లేని మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో పాటు మాజీ పోలీస్ కానిస్టేబుల్‌ను మధ్యవర్తులుగా పెట్టుకున్నట్టు సీఐడీ గుర్తించింది. ఆయా భూములు అమ్మేందుకు సంబంధిత బినామీ కంపెనీల డైరెక్టర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈ క్రమంలో 2016లో 76 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు మాజీ కానిస్టేబుల్‌కు సంబంధిత బ్రోకర్ అమ్మేశాడు. ఈ వ్యవహారంపై విచారణ సాగించాల్సిన, ఆ భూములను అటాచ్ చేయాల్సిన అప్పటి సీఐడీ అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు తాజా విచారణలో బయటపడింది. అగ్రిగోల్డ్ పెద్దలు జైలు నుంచే సంబంధిత కంపెనీల డైరెక్టర్ల ద్వారా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో మంతనాలు సాగించి 76 ఎకరాల భూమిని అమ్మించినట్టు గుర్తించారు. ఇలాంటి లావాదేవీలు బయటకురాకుండా చేయడంతో పాటు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను అప్పటి అధికారులు తొక్కిపెట్టినట్టు ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. -
ఎమ్మార్వొ నాగరాజు బినామీలపై ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : కీసర నాగరాజు అవినితీ కేసులో బినామీలపై ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బొల్లారంకు చెందిన నంద గోపాల్ అనే వ్యక్తి బినామీగా ఉన్నట్లు తేలింది. దీంతో ఇంకా అతని ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఇక అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పట్టుబడగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) -
అక్రమార్జనలో రారాజు
సాక్షి, విశాఖ క్రైం : మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు. బంగారమే బంగారం శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్‌లో గల బ్యాంకు ఆఫ్ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్స్న్ దరి పాపాహోం సమీపంలో గల ఆర్.ఆర్.రెసిడెన్సీలోని ప్లాట్ నెంబర్ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017లో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
శశికళ జైలు జీవితం ఏడాది పూర్తి..
ఇప్పటికే అనేక చిక్కుల్లో పీకల్లోతుల్లో మునిగి ఉన్న చిన్నమ్మ మెడకు బినామీ ఉచ్చుబిగుసుకుంటోంది. నకిలీ సంస్థలు, అక్రమంగా విదేశీ మారకద్రవ్యాల వ్యవహారం బైటపడింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ బంధువులకు సంబంధించిన రూ.380 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ జప్తు చేసిన సంగతి బుధవారం వెలుగుచూసింది. జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కదలడంతో విషయంబైటపడింది. ఐటీ అధికారి ఒకరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ బంధువులు, మిత్రులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఐటీ శాఖ భారీ ఎత్తున ఆకస్మికదాడులు నిర్వహించింది. జయ, శశికళ పేర్లతో అనేక బినామీ సంస్థలు పనిచేస్తున్నట్లు అధికారుల దాడులతో వెలుగుచూసింది. వీటిల్లో అనేక సంస్థలను చెన్నై టీనగర్‌లోని ఒక అపార్టుమెంటును చిరునామాగా చూపి ప్రారంభించారు. పైగా వీటిల్లో కొన్ని కంపెనీలు పేరుకు మాత్రమే పరిమితమై ఆస్తులను కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాలకు మాత్రమే పాల్పడ్డారు. ఇతర వ్యాపార లావాదేవీలు, ఐటీ రిటరŠన్స్ చేసిన దాఖలు లేవు. నల్లధనం లెక్కలు చూపేందుకే ఇలాంటి సంస్థలను స్థాపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు ఆస్తులను, బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు గతంలోనే జప్తు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు కొనసాగింపుగా చెన్నై ఎంఏఆర్సీ నగర్‌లోని ఆది ఎంటర్‌ప్రైజెస్‌కు సొంతమైన రూ.380 కోట్ల విలువైన 4.3 ఎకరాల ఫిర్హెవెన్ ఎస్టేట్‌ను ఇటీవల జప్తు చేశారు. ప్రస్తుత మార్కెట్ «ధర కాకుండా 2015లో ఆ ఎస్టేట్ కొనుగోలు విలువనే అధికారులు జప్తులో లెక్క చూపారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా పడిపోయి ఉన్న సమయంలోనే ఇంతపెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయడంపై అధికారులు విస్తుపోయారు. గుజరాత్‌కు చెందిన సునీల్ కెట్పాలియా, మనీష్ బార్మర్ అనే వ్యక్తుల నుంచి ఆ ఎస్టేట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. గత ఏడాది ఐటీ దాడుల తరువాత నుంచి ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఇదే ఎస్టేట్‌కు సంబంధించి రూ.70 కోట్లు జప్తు చేసి ఉన్నారు. ఆది సంస్థ పెద్ద ఎత్తున వ్యాపారం ఏమీ చేయకుండానే కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహించింది. మారిషస్ దేశంలోని పసిట్టోలోస్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ నుంచి రూ.250 కోట్లు విదేశీమారక ద్రవ్యంగా ఆది సంస్థకు ముట్టింది. ఈ నిధులను వెచ్చించే ఆది సంస్థ చెన్నైలో ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసింది. అలాగే సునీల్ కెట్పాలియా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఎడిసన్ ఎనర్జీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఆది సంస్థలో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. ఎడిసన్ ఎనర్జి సంస్థలో మరో డైరెక్టర్‌గా వ్యక్తి అన్నాడీఎంకేలోని ఒక ప్రముఖ నేత సన్నిహితుడిని పరోక్షంగా శశికళను ఉద్దేశించి ఐటీ అధికారులు తెలిపారు. సునీల్, మనీష్ కలిసి 2015లో పెరంబూరు బేరక్స్ రోడ్డులో లాండ్‌మార్క్స్ గ్రూపునకు చెందిన ఒక భారీ అపార్టుమెంటు నిర్మాణాన్ని చేపట్టారు. ఇలా మనీష్ సుమారు 12 బినామీ సంస్థలను నిర్వహించి భారీ ఎత్తున నల్లధనం కూడగట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే సునీల్ కెట్పాలియాకు ఎందరో అన్నాడీఎంకే నేతలు, మాజీ మంత్రులతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అంతేగాక అన్నాడీఎంకే నేతలకు అనేక పనులు చేసిపెట్టే బ్రోకర్‌గా కూడా సునీల్ పనిచేసినట్లు తెలుసుకున్నారు. 2011లో అన్నాడీఎంకే అధికారంలోకి వరకు సదరు సునీల్ చిన్నపాటి వడ్డీ వ్యాపారం, శశికళ బినామీ కంపెనీల్లో ఉద్యోగిగా ఉండేవాడు. ఈవిధంగా ఏర్పడిన పరిచయాలతో తానే ఒక బినామీ సంస్థ యజమానిగా ఎదిగినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. శశికళ బంధువులు, బినామీలను గుర్తిస్తూ ఆస్తుల జప్తునకు పూనుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. జైలు జీవితం ఏడాది పూర్తి: ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న శశికళ బుధవారంతో ఏడాది జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన తుదితీర్పు వెలువడగా 15వ తేదీన శిక్ష ఖైదీగా ఆమె బెంగళూరు జైల్లోకి వెళ్లారు. చిన్నమ్మతోపాటు ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకరన్ సైతం అదే రోజున జైలు జీవితాన్ని ప్రారంభించారు. జయలలిత తొలి వర్ధంతి గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన మౌనవ్రతాన్ని ప్రారంభించిన శశికళ మంగళవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా విరమించినట్లు తెలుస్తోంది. -
పట్టాదారులకు నోటీసులు
గోపవరం : బినామీ పేర్లతో పట్టాలు పొంది ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిన సంబంధిత వ్యక్తులకు ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి సమీపంలో 1988 సర్వే నెంబరులో స్థానిక టీడీపీ నాయకుడు 1996లో బినామీ పేర్లతో 13 ఎకరాలు పట్టాలు పొందాడు. అప్పటి నుంచి ఆ భూములను వ్యవసాయానికి ఉపయోగించలేదు. గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు లీజుకు ఇస్తూ లక్షల రూపాయలు లబ్ధిపొందుతూ వస్తున్నారు. ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వడంపై సీపీఐ వరుస ఆందోళనకు దిగడంతో రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. బినామీ పేర్లతో కేటాయించిన భూమిని పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి నివేదికలు తయారు చేశారు. ఈ మేరకు రాజంపేట ఆర్డీఓ ప్రభాకర్పిళ్లైకు కూడా నివేదిక కాపీలను పంపించారు. పట్టాలు పొందిన 9 మందికి నోటీసులు అందచేశారు. నోటీసులు అందుకున్న రెండు వారాల్లోపు సంబంధిత అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకున్న కెఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (పవర్‌గ్రిడ్) సంస్థకు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు నోటీసు అందుకున్న పవర్‌గ్రిడ్ సీనియర్ మేనేజర్ రాజీవ్‌గాంధీని సాక్షి వివరణ కోరగా గతంలో ఓ విద్యుత్తు సంస్థ లీజుకు తీసుకోవడంతో తిరిగి తాము ఈ భూమిని లీజుకు తీసుకోవడం జరిగిందన్నారు. ఒరిజినల్ పట్టా భూములా లేక డీకేటీ భూములా అనేది పరిశీలించలేదన్నారు.