Birth ruff
-
మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
సాక్షి, తాడేపల్లి: పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారాయన. ఇదిలా ఉంటే.. తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే గుమ్మనూరు తాజాగా టీడీపీలో చేరడం గమనార్హం. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా గుమ్మనూరు చేరికను మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జయరాం ఇచ్చే డబ్బు కు ఆశ పడి చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యమని, రాబోయే ఎన్నికల్లో గుమ్మనూరుకు సహకరించేది లేదంటూ గుంతకల్లు టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. ఊరేదైనా మారని తీరు -
సీఎం కిరణ్‌ను బర్తరఫ్ చేయాలి: పొన్నం
బహిష్కరణకు గురైన ఎంపీలతో సమావేశమైన సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే పార్టీ, సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్లో గొడవ సృష్టించడానికే సీమాంధ్ర ఎంపీలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. గురువారం కేంద్రప్రభుత్వం లోక్‌సభలో టి. బిల్లు ప్రవేశపెట్టింది. ఆ నేపథ్యంలో పలువురు ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో సభను స్పీకర్ మీరాకుమార్ సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు మళ్లి గొడవ చేసే అవకాశాలు ఉన్నాయని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్లో చోటు చేసుకున్న పరిణామాల అనంతరం సీమాంధ్రకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు సీఎం కిరణ్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసిన సంగతి తెలిసిందే.