Birthday Greetings
-
తమిళనాడు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
-
సీఎం వైఎస్ జగన్ కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
-
కోలకళ్ల కేరళ కుట్టి బర్త్‌డే : ఫస్ట్‌లుక్ సందడి
HBD Anupama Parameswaran: ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో దూసుకుపోయిన అమ్మోరు కత్తి. నటను ప్రాధాన్యమున్న ప్రాతలను ఎంచుకున్న అనుపమ తాజాగా మోస్ట్ రొమాంటిక్‌గా మారిపోయి కుర్రకారు గుండెల్లో గుబులురేపుతోంది. ఫిబ్రవరి 18న పుట్టిన కోలకళ్ల కేరళ కుట్టికి హ్యాపీ బర్త్‌డే అంటూ సెలబ్రిటీస్ విషెస్ అందిస్తున్నారు. బటర్ ఫ్లై మూవీ ఫస్ట్‌లుక్‌ను నెట్టింట సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) కేరళ త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న పుట్టింది అనుపమ పరమేశ్వరన్. ఉన్నత చదువు కున్నప్పటికీ సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది. మలయాళంలో టీవిషోలు, సెలబ్రెటీ ఛాట్ షోలు, రియాల్టిషోలు చేసిన అనుపమ తొలిసారిగా మలయాళ సినిమా ప్రేమమ్ సినిమాలో నివిన్ పౌలీతో కలిసి వెండితెరకు పరిచయమైంది. 2015లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్‌గా సక్సెస్ అయింది. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్నఈ అమ్మడికి తరువాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రేమమ్, అ..ఆ.., శతమానం భవతి తొలి మూడు సినిమాలు సూపర్ హిట్. మాతృభాష మలయాళమైనా తొలి తెలుగు సినిమా అ ఆలో స్వంతంగా తెలుగులో ఆమె చెప్పిన డైలాగులు ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో ప్రత్యేకతను చాటుకుంది. గ్లామర్ షోకి దూరంగా సెలెక్టివ్ ప్రాతలతో అభిమానులను సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అదే జోరును కంటిన్యూ చేయలేపోయింది. రాక్షసుడు, హలో గురు ప్రేమ కోసమే లాంటి సినిమాలు ఒకే అనిపించాయి. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం మూవీ కూడా పెద్దగా కలిసి రాలేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఈ ఆరేళ్ళలోనే దాదాపు 10 సినిమాల్లో నటించే అవకాశం మిస్ చేసుకుందట. ఇతర సినిమాలతోబిజీగా ఉండటం, రెమ్యూనరేషన్, ప్రాధాన్యత లేని కేరెక్టర్స్ఇలా పలు కారణాల రీత్యా కొన్ని ప్రాజెక్టులకు కూడా వదులుకుంది. తాజాగా ట్రెండ్ మార్చి లిప్‌లాక్ సీన్లతో రొమాంటిక్ బ్యూటీగా లైమ్ లైట్లోకి రావాలని ప్రయత్నిస్తోంది. తాజా చిత్రం రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా థియేటర్లను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎన్నడూ లేని విధంగా కెరీర్లో ‘బోల్డెస్ట్’ రోల్ చేసినా కీలకమైన పాత్రలో మెప్పించింది. అయితే ఇన్నాళ్లూ రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనుపమ కరియర్లో బెస్ట్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను కన్విన్స్ చేసింది. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. కార్తికేయ 2తో పాటు 18పేజెస్ సినిమాల్లో నటిస్తోంది. 18 పేజెస్ ఈ ఏడాది ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన హిట్ మూవీ ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కార్తికేయ 2 ఆగస్టులో రిలీజ్‌కానుంది. అలాగే అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బటర్ ఫ్లై’ మూవీ ఫస్ట్‌లుక్‌ను పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
Happy Birthday విక్టరీ వెంకటేష్: చిరు స్పెషల్ విషెస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ వెర్సటైల్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు నేడు ( డిసెంబరు 13) ఈ సందర్బంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. అటు ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ పెద్దలు వెంకీని అభినందనల్లో ముంచుత్తుతున్నారు. (వెంకీ మామకు బర్త్‌డే శుభాకాంక్షలు, మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా!) Happy birthday to my fav @VenkyMama sir!! It’s a joy working with you. You are so much fun!🤗 Wishing you great health and happiness! Loads of love! pic.twitter.com/slUKNvT08G — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 13, 2021 ముఖ్యంగా దగ్గుబాటి వారి మరో వారసుడు టాలీవుడ్ భల్లాల దేవ రానా ఒక మోషర్ పోస్టర్‌ను ట్విట్ర్లో పోస్ట్ చేశారు. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్ , హీరోయిన్ ఖుష్బూ, ఇతర నటీనటులతోపాటు, మ్యూజిక్ డైరెక్టర్స్, డీఎస్పీ, తమన్ తదితరులు బర్త్‌డే విషెస తెలుపుతూ ట్విట్ చేశారు. నులి వెచ్చని నీ స్నేహంతో నాముఖంపై చిరునవ్వును ఉంచుతున్న మిత్రమా..థ్యాంక్స్.మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్!! అంటూ చిరు ట్వీట్ చేశారు. అలాగే రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లోని వెంకటేష్ ఫస్ట్‌లుక్ కూడా సందడి చేస్తోంది. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌లో బాబాయ్ అబ్బాయిలు వెంకీ, రానా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. Victory #Venkatesh look from @NetflixIndia's Web Series #RanaNaidu Happy Birthday @VenkyMama #HappyBirthdayVictoryVenkatesh pic.twitter.com/mfxSUY5PxE — Suresh Kondi (@V6_Suresh) December 13, 2021 My brother & dear friend @VenkyMama Thank you for always radiating warmth & always managing to put a smile on my face! Have a Wonderful birthday!! Many Many Happy Returns!! pic.twitter.com/OWd6epcIyk — Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2021 Many More Happy returns of the day #Venkymama @venkymama #HBDVenkymama Stay Blessed in every area of your life, may god rule and rein over your life every deep desire come true this year in Film industry, May this Special Year ahead be filled with joy, Happiness, Health & Wealth. pic.twitter.com/4ogRrVCBiA — Victory Casting (@CastingVictory) December 13, 2021 Wishing a SUPER DUPER HAPPY MUSICAL BDAY to Dearest VICTORY VENKATESH sirr ! ❤️🎶😍🤗 @VenkyMama ❤️ Love Ur Energy always sir..Very Inspiring🤗 Keep Rocking wit ur Versatile Movies & Evergreen Blockbusters dear Sir ! Its always amazing to work with U🎶🙏🏻#HBDVictoryVenkatesh pic.twitter.com/y2LQXHlbiB — DEVI SRI PRASAD (@ThisIsDSP) December 13, 2021 Wishing My Favourite ⭐️ Person ❤️a lovely human to be around with Always with heart energy and overflowing ideas 🎧✨ the Victorious @VenkyMama gaaru a very happiest birthday ♥️ #HBDVictoryVenkatesh 🏆 pic.twitter.com/nQUO5rJh6d — thaman S (@MusicThaman) December 13, 2021 -
రిషబ్ పంత్‌కు శుభాకాంక్షల వెల్లువ..
Happy Birth Day Rishabh Pant: నేడు(అక్టోబర్ 4) 24వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా డాషింగ్ ప్లేయర్ రిషభ్ పంత్‌కు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్-2021లో భాగంగా ప్రస్తుతం యూఏఈలో ఉన్న పంత్.. తన ఐపీఎల్ జట్టుతో పాటు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, ఐపీఎల్ సహచరులతో పాటు టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐ, ఐసీసీ పంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పంత్ మున్ముందు క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. Happy birthday to @BCCI's Rishabh Pant 🎉 What is your favourite moment from the wicketkeeper-batter? 🧤 pic.twitter.com/6BblHgtaCv — ICC (@ICC) October 4, 2021 ఈ సీజన్ ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారధ్య బాధ్యతలను చేపట్టిన పంత్.. జట్టును సమర్ధవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో డీసీ.. ఇప్పవరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. పంత్ సేన నేడు టేబుల్ టాపర్ సీఎస్కేతో తలపడనుంది. ఇదిలా ఉంటే, 2017లో టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పంత్.. మెల్లగా అన్నీ ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సహచర ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు గాయం కావడంతో అతను ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ సారధిగా కూడా నియమించబడ్డాడు. Audacious batsman 💪 Solid wicketkeeper 👌 Livewire on the field ⚡️ Here's wishing @RishabhPant17 a very happy birthday. 👏 🎂 #TeamIndia Let's relive his stroke-filled ton against England 🎥 🔽 — BCCI (@BCCI) October 4, 2021 కాగా, పంత్ ఈ స్థాయికి చేరుకునేందుకు అందరు సాధారణ క్రికెటర్లలానే ఎన్నో కష్టాలు పడ్డాడు. కెరీర్ ఆరంభం రోజుల్లో తన స్వస్థలం(ఉత్తరాఖండ్) నుంచి ఢిల్లీకి రోజు ప్రయాణించే వాడు. కొన్ని సందర్భాల్లో ఇంటి వెళ్లలేని పరిస్థితుల్లో ఢిల్లీలోని గురుద్వారాలో నిద్రించాడు. 2016 అండర్-19 ప్రపంచకప్ నుంచి అతని దశ తిరిగింది. ఆ టోర్నీలో నేపాల్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, నమీబియాపై సెంచరీ ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. 2016-17 రంజీ సీజన్లో పంత్ కెరీర్ కీలకమలుపు తిరిగింది. ఆ సీజన్లో అతను మహారాష్ట్రపై ట్రిపుల్ హండ్రెడ్, ఝార్ఖండ్‌పై 48 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. Birthday + Matchday = Double the fun for #RP17 🤩 We hope you have a 'Pantastic' birthday and get to top it off with a win 💙🤞🏼#YehHaiNayiDilli #IPL2021 #DCvCSK #HappyBirthdayRishabhPant pic.twitter.com/WYSvgTE43G — Delhi Capitals (@DelhiCapitals) October 3, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రెండు ఐపీఎల్ రికార్డులపై కన్నేసిన చెన్నై ఓపెనర్.. -
ఆ క్విజ్ కోసం నమో యాప్ ఉండాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నమో యాప్’ ద్వారా తన పుట్టిన రోజు శుభకాంక్షలు తెలపాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. దీంతో నమో యాప్ ద్వారా ప్రధానికి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా ఓ ప్రకటన వెలువరించింది. నమో యాప్ ద్వారానే ‘నో నమో (Know Namo)’ క్విజ్ నిర్వహిస్తున్నట్లు తాజాగా ట్వీట్ చేసింది. ఇందులో గెలిచిన వారికి ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ ఉన్న పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇవాళ ప్రారంభించే ఈ క్వీజ్ పోటీలో ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని వెల్లడించింది. ‘ప్రధాని నరేంద్ర మోదీ గురించి తమకు ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకోవాలంటే ఈ ‘నమోయాప్’లో ఈ రోజు నిర్వహించే ‘ది నో నమో’ క్వీజ్‌లో పాల్గొనాలని.. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ http://nm4.in/dnldapp లింక్‌ను ట్విటర్లో పంచుకుంది. (చదవండి: కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ విషెస్) ప్రధానికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్పాలనుకునే కార్యకర్తలు, ప్రజలు తమ సందేశాలను వీడియో రూపంలో ఈ యాప్‌లో అప్లోడ్ చేయాల్సిందిగా బీజేపీ కోరింది. నమో యాప్ వినియోగదారులంతా ప్రధాని జీవితం ఆధారంగా తొలిసారిగా 360 డిగ్రీల వీడియోను ఎగ్జిబిషన్‌ను చూడొచ్చని కూడా పార్టీ తెలిపింది. గ్లింప్సెస్ ఆప్ నమో ఇన్స్పైరింగ్ లైఫ్ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ప్రధాని మోదీ స్వస్థలం గుజరాత్‌లోని వాడ్నగర్ నుంచి భారత ప్రధానిగా ఎదిగిన ఆయన జీవిత చరిత్రను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ వారం రోజుల పాటు(సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు) ‘సేవా సప్తా’ కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్యాడ్లు, వీల్చైర్ల పంపిణీతో పాటు పలు సామాజిక సేవలను చేపట్టనుంది. -
దోహలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
దోహా : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఖతార్ రాజధాని దోహలో దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా శశికిరణ్ మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 400 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజానేత జగన్మోహన్ రెడ్డికి ఖతార్‌లో ఉన్న తెలుగు వారి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని, వారి ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధిస్తున్నామన్నారు. కె. శివప్రసాద్ మాట్లాడుతూ.. ఖతార్‌లో ఏర్పడే నూతన కమిటీ సభ్యులు తమ శక్తి కొలది పార్టీ అభ్యున్నతికి పని చేస్తూ ఖతార్‌లో ఉన్న తెలుగు వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఖతార్ తెలుగుకళాసమితి వ్యవస్ధాపకులు కె. శివప్రసాద్, జాఫర్ హుస్సేన్, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్. సాంబశివ రావు, పారిశ్రామకవేత్త సామాజిక సేవకులు ఆర్. సూర్యప్రకాష్ రావు, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు, వర్ధనపు ప్రకాష్, ఎస్. షాహాబుద్దీన్, ఎన్. నాగేశ్వరరావు, ఎన్. జయరాజు, మట్ట రాజు, ఎం. సందేష్ కుమార్, ఎం.బి. ప్రశాంత్, జి. చంటి, బి. గిరిధర్, తదితరులు పాల్గొన్నారు. -
వాజ్ పేయికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ పర్యటన నుంచి ఢిల్లీ తిరిగొచ్చిన మోదీ.. విమానాశ్రయం నుంచి నేరుగా వాజ్‌పేయి నివాసానికి వెళ్లారు. ఈ రోజు వాజ్ పేయి 91వ జన్మదినం. వాజ్ పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వాజ్ పేయి నివాసంలో కాసేపు గడిపారు. అనంతరం మోదీ తన నివాసానికి బయల్దేరి వెళ్లారు. పాకిస్తాన్ పర్యటనలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్.. వాజ్ పేయితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారని మోదీ ట్వీట్ చేశారు. పాక్ ప్రధాని తన తరపున వాజ్ పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాల్సిందిగా కోరారని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయు ఆరోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండునూరేళ్లు జీవించాలని రాష్ట్రపతి ట్వీట్టర్ సందేశంలో ఆకాంక్షించారు. వాజ్ పేయికి బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా వాజ్‌పేయి మంచానికే పరిమితమయ్యారు. -
88వ పడిలోకి అద్వానీ... మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ శనివారం 88వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారణాసి పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ, ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్వానీ ఇంటి బయటకు వచ్చి మరీ మోదీకి స్వాగతం పలికారు. ఆ సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు ఇతర బీజేపీ నేతలు కూడా అక్కడ ఉన్నారు. అంతకు ముందు అద్వానీకి మోదీ ట్విట్టర్లోనూ శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీజీ మంచి ఆరోగ్యంతో చిరకాలం జీవించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఎంతో మేధస్సు, ప్రావీణ్యం గల గొప్ప నేతగా అద్వానీని అభివర్ణించారు. తామంతా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. మరోవైపు స్వచ్ఛ్ భారత్‌లో పాలు పంచుకున్న దక్షిణాది అగ్ర నటుడు కమల్ హాసన్‌ను అభినందిస్తూ మోదీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. హిమపాతానికి ఇద్దరు సైనికుల మృతి శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఆకస్మికంగా సంభవించిన హిమపాతానికి ఇద్దరు ఆర్మీ జవాన్లు, ఓ పౌరుడు బలయ్యారు. మరో జవాను గాయపడ్డారు. ఉత్తర కాశ్మీర్‌కు చెందిన కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) సమీపంలో శనివారం ఉదయం భారీ ఎత్తున హిమపాతం సంభవించింది. నాస్తాచున్పాస్ దక్షిణ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్మీ బృందం ఈ హిమపాతంలో చిక్కుకుపోయింది. అకస్మాత్తుగా ముంచెత్తిన హిమపాతానికి గురై ఆర్మీ బృందంలోని ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి, మరో జవాను, ఓ పోర్టరు మరణించారు.