
HBD Anupama Parameswaran: ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో దూసుకుపోయిన అమ్మోరు కత్తి. నటను ప్రాధాన్యమున్న ప్రాతలను ఎంచుకున్న అనుపమ తాజాగా మోస్ట్ రొమాంటిక్‌గా మారిపోయి కుర్రకారు గుండెల్లో గుబులురేపుతోంది. ఫిబ్రవరి 18న పుట్టిన కోలకళ్ల కేరళ కుట్టికి హ్యాపీ బర్త్‌డే అంటూ సెలబ్రిటీస్ విషెస్ అందిస్తున్నారు. బటర్ ఫ్లై మూవీ ఫస్ట్‌లుక్‌ను నెట్టింట సందడి చేస్తోంది.
కేరళ త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న పుట్టింది అనుపమ పరమేశ్వరన్. ఉన్నత చదువు కున్నప్పటికీ సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది. మలయాళంలో టీవిషోలు, సెలబ్రెటీ ఛాట్ షోలు, రియాల్టిషోలు చేసిన అనుపమ తొలిసారిగా మలయాళ సినిమా ప్రేమమ్ సినిమాలో నివిన్ పౌలీతో కలిసి వెండితెరకు పరిచయమైంది. 2015లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్‌గా సక్సెస్ అయింది. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకున్నఈ అమ్మడికి తరువాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
ప్రేమమ్, అ..ఆ.., శతమానం భవతి తొలి మూడు సినిమాలు సూపర్ హిట్. మాతృభాష మలయాళమైనా తొలి తెలుగు సినిమా అ ఆలో స్వంతంగా తెలుగులో ఆమె చెప్పిన డైలాగులు ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తెలుగు, మలయాళ, తమిళ సినిమాలలో ప్రత్యేకతను చాటుకుంది. గ్లామర్ షోకి దూరంగా సెలెక్టివ్ ప్రాతలతో అభిమానులను సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అదే జోరును కంటిన్యూ చేయలేపోయింది. రాక్షసుడు, హలో గురు ప్రేమ కోసమే లాంటి సినిమాలు ఒకే అనిపించాయి. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం మూవీ కూడా పెద్దగా కలిసి రాలేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఈ ఆరేళ్ళలోనే దాదాపు 10 సినిమాల్లో నటించే అవకాశం మిస్ చేసుకుందట. ఇతర సినిమాలతోబిజీగా ఉండటం, రెమ్యూనరేషన్, ప్రాధాన్యత లేని కేరెక్టర్స్‌ఇలా పలు కారణాల రీత్యా కొన్ని ప్రాజెక్టులకు కూడా వదులుకుంది. తాజాగా ట్రెండ్ మార్చి లిప్‌లాక్ సీన్లతో రొమాంటిక్ బ్యూటీగా లైమ్ లైట్‌లోకి రావాలని ప్రయత్నిస్తోంది.
తాజా చిత్రం రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకగా థియేటర్లను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎన్నడూ లేని విధంగా కెరీర్‌లో ‘బోల్డెస్ట్’ రోల్ చేసినా కీలకమైన పాత్రలో మెప్పించింది. అయితే ఇన్నాళ్లూ రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనుపమ కరియర్‌లో బెస్ట్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను కన్విన్స్ చేసింది. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. కార్తికేయ 2తో పాటు 18పేజెస్ సినిమాల్లో నటిస్తోంది. 18 పేజెస్ ఈ ఏడాది ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన హిట్ మూవీ ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కార్తికేయ 2 ఆగస్టులో రిలీజ్‌కానుంది. అలాగే అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బటర్ ఫ్లై’ మూవీ ఫస్ట్‌లుక్‌ను పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment