Biryani restaurant
-
తినాలంటే జైలుకి పోవాల్సిందే (ఫోటోలు)
-
హైదరాబాద్‌లో దమ్ బిర్యానీ మాత్రమే కాదు.. ఈ వెరైటీలు తెలుసా?
ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది..అసలు ఎప్పుడు తొలిసారిగా తయారు చేశారనే దానిపై ఎన్నెన్నో వాదనలున్నాయి. పర్షియా నుంచి మొఘల్స్ మన దేశానికి తీసుకువచ్చారనేది ఓ వాదన. తొలిసారిగా బిర్యానీ రుచులను 16వ శతాబ్దంలో మాత్రమే చవిచూశారని..ఆ తరువాత లోకల్ ఫ్లేవర్స్ కూడా జోడించి ప్రాంతాలను బట్టి ఇప్పుడున్న బిర్యానీలు తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బిర్యానీ పుట్టుక క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ దీనిని తీసుకువచ్చాడనేది మరో ప్రచారమూ ఉంది. ఎవరి వాదనలు ఎలాగున్నా.. బిర్యానీ ఇప్పుడు స్థానికీకరించబడిందన్నది మాత్రం నిజం. హైదరాబాద్ దమ్ బిర్యానీ.. కశ్మీరీ డ్రైఫ్రూట్స్ బిర్యానీ, నవాబుల కిచెన్ల నుంచి నేరుగా వచ్చిన లక్నోవీ బిర్యానీ.. సింధీ, మొగలాయి, మలబార్ అన్నీ విభిన్నం. సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ..ఆ మాటే చాలు ఆహారాభిమానులకు నోటిలో లాలాజలం ఊరటానికి! బాస్మతి బియ్యం, మాంసం లేదంటే కూరగాయలు.. కాదంటే పన్నీర్...మరో వెరైటీ..ఇలా బిర్యానీ గురించి చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. నగర ఆహారంలో ఎంతగానో మమేకమై.. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన హైదరాబాదీ గురించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ బిర్యానీ ఇలా ఉంటే..నగరంలో మరెన్నో వెరైటీల బిర్యానీలు సైతం లభిస్తున్నాయి. అందులో కొన్ని మలబార్ బిర్యానీ, మొఘలాయ్, కలకత్తా, లక్కోవి, సింధీ పేరిట తయారు చేస్తున్న వెరైటీ బిర్యానీలు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ అయ్యాయి. చదవండి: (నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’) ►నగరంలో దమ్ బిర్యానీ కాకుండా ఇంకెన్నో రకాల బిర్యానీలూ కూడా లభ్యమవుతున్నాయి. ►భిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయాలు, కొత్తకొత్త అభిరుచులకు తగ్గట్టుగా ప్రస్తుతం నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్స్‌ల్లో దేశ వ్యాప్తంగా లభించే వివిధ రకాల బిర్యానీలు అంటుబాటులో ఉన్నాయి. హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ నిజాం నవాబుల కిచెన్‌లో రూపుదిద్దుకున్నదనే నమ్మకం. ఇప్పటికీ మన నగరంలో ఉంది. మన హైదరాబాదీ బిర్యానీ ప్రధానంగా రెండు రకాలలో లభ్యమవుతుంది. ఒకటి పక్కీ బిర్యానీ అయితే మరోటి కచ్చీ బిర్యానీ. పక్కీ బిర్యానీ అంటే..బాస్మతి బియ్యం వేరేగా వండటంతో పాటుగా మాంసం కూడా ప్రత్యేకంగా వండి ఆ తర్వాత రెండింటినీ లేయరింగ్గా చేసి వండటం. కచ్చీ బిర్యానీ అంటే మాంసం, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్..ఇలా అన్ని పదార్థాలు కలిపి, మైదాతో సీల్ చేసిన పాత్రలో ఉడికించి వండుతారు. నగరంలో ఎక్కువగా లభించేది ఈ బిర్యానీయే. మొఘలాయ్ బిర్యానీ అత్యంత రుచికరమైన బిర్యానీలలో ఇది ఒకటి. టోలిచౌకి ప్రాంతంలోని కొన్ని రెస్టారెంట్లు ఈ బిర్యానీ అందిస్తున్నాయి. మొఘల్ కిచెన్ నుంచి వచ్చిన అద్భుతమైన రుచులలో ఇది కూడా ఒకటి. పెరుగు, బాదం పేస్ట్, నెయ్యి, డ్రైఫ్రూట్స్, మాంసం లాంటి ముడి పదార్థాలతో ఇది తయారవుతుంది. మనహైదరాబాదీ బిర్యానీకి దగ్గర చుట్టం ఇది. ఆఫ్ఘనీ .. ఆఫ్ఘనీ బిర్యానీ కూడా నగరంలో లభిస్తుంది. అయితే పాతబస్తీలోని మొఘల్‌పురాలో ఒకటి రెండు చోట్ల ఇది రెగ్యులర్‌గా లభిస్తుంది. ఇందులో మసాలాలు తక్కువగా వినియోగిస్తారు. డ్రైఫ్రూట్స్‌తో పాటు జైఫల్, జావాత్రి, నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తారు. మలబార్ కేరళలోని మలబార్ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిర్యానీ సైతం దమ్ శైలిలోనే వండుతారు. స్వీట్ అండ్స్పైసీ బిర్యానీ ఇది. దీనిలోనూ పలు రకాలున్నాయి. అంటే ప్రాంతాన్ని బట్టిఫ్లేవర్లు కూడా మారుతుంటాయి. ఈ బిర్యానీ పంజాగుట్ట ప్రాంతంలోని పలు రెస్టారెంట్లలో ప్రత్యేకంగా అందిస్తున్నారు. సింధీ గుజరాతీలకు ప్రీతిపాత్రమైన బిర్యానీ ఇది. సింధ్ ప్రాంతపు రుచులను ఇది చవిచూపిస్తుంది. దీనిలో పచ్చిమిర్చి, రోస్టెడ్స్పైస్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, డ్రైఫ్రూట్స్, పులిసిన పెరుగు వంటివి విరివిగా వాడతారు. సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులోని సింధీ రెస్టారెంట్లో లభిస్తుంది. లక్నోవీ మన హైదరాబాద్ బిర్యానీకి దగ్గర చుట్టం ఈ లక్నోవీ బిర్యానీ. ఇది కూడా నిజామ్ల (అవధ్ ప్రాంతీయులు) కిచెన్‌లో రూపుదిద్దుకున్నదనే నమ్మకం. కాకపోతే మన హైదరాబాద్ బిర్యానీ అంత స్పైసీగా మాత్రం ఇది ఉండదు. దమ్పుక్త్ శైలిలో ఇది రూపుదిద్దుకుంటుంది. మీరాలంమండిలోని హోటల్స్‌లో ఈ బిర్యానీని ఆఫర్ చేస్తున్నారు. కలకత్తా బిర్యానీ.. ఈ లక్నోవీ బిర్యానీకి సబ్‌వేరియంట్ కలకత్తా బిర్యానీ. అదెలా అంటే, బ్రిటీషర్లను కలుసుకోవడానికి కలకత్తా వెళ్లిన అవధ్ నవాబు వాజీద్ అలీ షా ఫుడ్ పరంగా అమిత జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎక్కడకు వెళ్లినా తన వంట వారిని వెంటపెట్టుకుని వెళ్లే అతను కలకత్తాకు కూడా అలాగే వెళ్లారట. అక్కడ చేసిన ప్రయోగాలకు ప్రతిరూపం కలకత్తా బిర్యానీ అన్నది ఓ వాదన. అయితే బెంగాలీల ఇతర వంటకాల్లాగానే కాస్త తియ్యదనం ఈ బిర్యానీలో ఉంటుంది. ఎల్లో రైస్, యోగర్ట్ బేస్డ్మీట్, బాయిల్డ్‌ఎగ్, బంగాళా దుంపలతో ఈ బిర్యానీ రూపుదిద్దుకుంటుంది. బెంగాలీ స్నేహితుల ఇళ్లలో మాత్రమే కాదు.. నగరంలో కొన్ని రెస్టారెంట్లలో జరిగే ఫుడ్ఫెస్టివల్స్ సమయంలో ఈ రుచులను ఆస్వాదించొచ్చు. ప్రత్యేంగా పాతబస్తీలోని ఘాన్సీబజార్‌లోని పలు బెంగాలీ హోటల్స్ అందుబాటులో ఉంది. -
ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని..
సాక్షి, చెన్నై : ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని హోటల్ ధ్వంసం చేయడంతో పాటు యజమానిని కత్తితో పొడిచి పరారైన బృందం కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరువారూర్ జిల్లా ముత్తు పేట సమీపంలో ఉదయమార్తాండపురం ఈసీఆర్ రోడ్డులో హోటల్ నడుపుతూ వస్తున్న షబీర్ అహ్మద్ (36). ఆదివారం ఇతని దుకాణానికి మద్యం మత్తులో వచ్చిన ఇద్దరు నగదు ఇవ్వకుండా, మా అధికారి బిర్యానీ కొనుక్కొని రమ్మన్నారు అని తెలిపారు. ఇందుకు యజమానీ షబ్బీర్ అహ్మద్ నాకు ఆ అధికారి ఎవరో తెలియదని బదులిచ్చాడు. నగదు ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లాలని స్పష్టం చేశాడు. దీంతో ఆవేశానికి గురైన ఇద్దరు అగంతకులు మళ్లీ వస్తాం.. కొద్దిసేపు చూడు అంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాత ఇనుప కమ్మి, రోకలి కట్ట, పట్టా కత్తులతో ఏడుగురు వచ్చి తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం కార్యదర్శి వినోద్ ఆధ్వర్యంలో హోటల్ యజమానిపై దాడి చేశారు. గొంతులో కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో స్పృహతప్పి పడిన అతనిపై రాయితో దాడి చేశారు. ఆ తర్వాత హోటల్ని ధ్వంసం చేసి అక్కడున్న నగదును తీసుకొని పరారయ్యారు. తీవ్ర గాయాలైన షబీర్ అహ్మద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముత్తుపేట పోలీసులు కేసు నమోదు చేసి.. కార్యదర్శి వినోద్, దిలీపన్, దినేష్, పుగలేంది, ముఖేష్ కుమార్ వీరితో సహా ఏడుగురి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే.. -
అప్పు తీర్చమన్నందుకు.. ప్రాణం తీశాడు
కోల్‌కతా : పాత బాకీ తీర్చమన్నాడన్న కోపంతో బిర్యానీ బండి యాజమానిపై తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ సంఘటన ఆదివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరగణ జిల్లాలోని భట్పారా పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భట్పారా పారిశ్రామిక వాడకు చెందిన సంజయ్ మండల్(40) తోపుడు బండిపై బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫిరోజ్(26) అతని స్నేహితులు అక్కడికి వచ్చారు. తమకు బిర్యానీ పార్శిల్ కట్టాల్సిందిగా సంజయ్‌ని కోరారు. దీంతో సంజయ్ మండల్ ముందుగా డబ్బులు ఇస్తేనే బిర్యానీ ఇస్తానన్నాడు. ఆగ్రహించిన ఫిరోజ్ బిర్యానీ అధిక ధరలకు విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ సంజయ్‌తో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దది చేయడం ఇష్టంలేని సంజయ్ వారిని పాత బాకీ 190 ఇవ్వాలన్నాడు. పాత బాకీ అడగటంతో కోపగించిన ఫిరోజ్ వెంట తెచ్చుకున్న తుపాకీతో సంజయ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో సంజయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపినపుడు ఫిరోజ్ వెంట ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
బిర్యానీవాలా.. ఆగయా
సిటీజనులకు సరికొత్త బిర్యానీ రుచులు అందించేందుకు మరో రెస్టారెంట్ వచ్చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.3లో ఏర్పాటు చేసిన బిర్యానీవాలా అండ్ కంపెనీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్‌ను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం ప్రారంభించారు. నిర్వాహకులు రెజా అస్తేరియన్, మంజూర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. – జూబ్లీహిల్స్ -
హైదరాబాద్‌లో రాశిఖన్నా సందడి
-
నిందితుడితో పోలీస్ దోస్తీ..!
కస్టడీ నిబంధనలకు నీళ్లు రెస్టారెంట్‌కు తీసుకెళ్లి బిర్యానీ ఆరగింపు చంచల్‌గూడ: విచారణ నిమిత్తం ఓ నిందితుడిని నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి ఆదేశించింది. జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు అతగాడికి రాచమర్యాదలు చేసిన విచిత్ర వైనం ఇది. కస్టడీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన పోలీసులు నిందితుడితో చెట్టాపట్టాలేసుకొని ఓ రెస్టారెంట్లో బిర్యానీ ఆరగించారు. ఈ దృశ్యాన్ని సాక్షి చిత్రీకరించింది.పూర్తి వివరాలు... బేగంపేటలోని అమెరికన్ దౌత్యకార్యాలయంలో విధులు నిర్వహించే తాత్కాలిక ఉద్యోగి కొండేరు శశిధర్ అమెరికాకు వె ళ్లాలనుకునే వారికి వీసాలిప్పిస్తానంటూ సుమారు 30 మంది దరఖాస్తుదారులను మోసం చేసి రూ.3 లక్షలకుపైగా దండుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతన్ని మరింతలోతుగా విచారించేందుకు సీసీఎస్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో నాంపల్లి కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి శశిధర్ తీసుకోవాలని ఆదేశించింది. దీంతో సీసీఎస్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న శశిధర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. సీసీఎస్ పోలీసుల రాచమర్యాదలు... పోలీసులు అతన్ని సీసీఎస్‌కు తరలించేందుకు ఏపీ 9పీ 5502 టాటాసుమోలో బయలు దేరారు. అయితే ఇక్కడే నిందితుడితో పోలీసులు కుమ్మక్కయ్యారు. నిందితుడి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల వద్దకు వచ్చారు. వీరందరూ కలిసి నల్గొండ చౌరస్తాలోని సోహెల్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ నిందితుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి, పోలీసులు సైతం బిర్యానీ తిన్నారు. హోటల్ నుంచి మధ్యాహ్నం 3.30కి బయటికి వచ్చారు. కస్టడీలోకి తీసుకున్న నిందితుడికి కుటుంబ సభ్యులతో కలపడం నేరం. అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ హోటళ్లకు తీసుకుపోవడమూ నేరమే. అదను చూసి నేరస్తుడు పారిపోతే పరిస్థితి ఏమిటి..? నిందితుడిని కస్టడీలోకి తీసుకోగానే పోలీసులు అతన్ని నేరుగా సీసీఎస్‌కు తరలించాలి. అయితే ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడే మిలాఖత్ అయిన పోలీసులు రేపు నిందితుడిని ఏమేరకు విచారిస్తారో ఇట్టే అర్థమవుతోంది. అతనికి విందు భోజనం ఏర్పాటు చేయడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.