
ధ్వంసమైన దుకాణం (ఇన్‌సెట్) గాయపడిన షబీర్ మహమ్మద్
సాక్షి, చెన్నై : ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని హోటల్ ధ్వంసం చేయడంతో పాటు యజమానిని కత్తితో పొడిచి పరారైన బృందం కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరువారూర్ జిల్లా ముత్తు పేట సమీపంలో ఉదయమార్తాండపురం ఈసీఆర్ రోడ్డులో హోటల్ నడుపుతూ వస్తున్న షబీర్ అహ్మద్ (36). ఆదివారం ఇతని దుకాణానికి మద్యం మత్తులో వచ్చిన ఇద్దరు నగదు ఇవ్వకుండా, మా అధికారి బిర్యానీ కొనుక్కొని రమ్మన్నారు అని తెలిపారు.
ఇందుకు యజమానీ షబ్బీర్ అహ్మద్ నాకు ఆ అధికారి ఎవరో తెలియదని బదులిచ్చాడు. నగదు ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లాలని స్పష్టం చేశాడు. దీంతో ఆవేశానికి గురైన ఇద్దరు అగంతకులు మళ్లీ వస్తాం.. కొద్దిసేపు చూడు అంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాత ఇనుప కమ్మి, రోకలి కట్ట, పట్టా కత్తులతో ఏడుగురు వచ్చి తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం కార్యదర్శి వినోద్ ఆధ్వర్యంలో హోటల్ యజమానిపై దాడి చేశారు. గొంతులో కత్తితో పొడిచారు.
రక్తపు మడుగులో స్పృహతప్పి పడిన అతనిపై రాయితో దాడి చేశారు. ఆ తర్వాత హోటల్ని ధ్వంసం చేసి అక్కడున్న నగదును తీసుకొని పరారయ్యారు. తీవ్ర గాయాలైన షబీర్ అహ్మద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముత్తుపేట పోలీసులు కేసు నమోదు చేసి.. కార్యదర్శి వినోద్, దిలీపన్, దినేష్, పుగలేంది, ముఖేష్ కుమార్ వీరితో సహా ఏడుగురి కోసం గాలింపు చేపట్టారు. చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..
Comments
Please login to add a commentAdd a comment