BJYM meeting
-
2023లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం!
హైదరాబాద్: రాష్ట్రంలో 2023లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు యువ మోర్చా కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే బీజేపీ ఈ స్థాయికి వచ్చిందని, వారి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. గోల్కొండ కోటపై కాషాయ జెండానే మనకు కన్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోందని మండిపడ్డారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేరి.. దోచుకుంటోందని ఆరోపించారు. రాక్షస పాలన నుంచి రాష్ట్ర విముక్తి కోసం యువమోర్చా పోరాటం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కొందరు టీఆర్ఎస్తో పొత్తు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. యువ మోర్చా ఉద్యమంతో కేసీఆర్‌కు వణుకు పుట్టాలన్నారు. యువ మోర్చా కార్యకర్తలకు క్రమశిక్షణ, ఓపిక ముఖ్యమన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు నాగార్జునసాగర్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చామన్నారు. పోలీసులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, భైంసాలో రిపోర్టర్లపై హిందూ వాహిని కార్యకర్తలు దాడి చేశారా అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన పోలీస్ అధికారి చెప్పాలని పేర్కొన్నారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని, ప్రైవేటు టీచర్లకు గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, యువమోర్చా ఇన్చార్జి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. -
కాషాయ దళం.. కమల వికాసం
-
మౌనీబాబా సర్కార్‌కు.. మాకూ తేడా ఇదే: అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్ : మౌనీబాబా మన్మోహన్ సింగ్ సర్కార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా చెప్పడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ చాలాని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ ఆధ్వర్యంలో జరిగిన విజయ లక్ష్య–2019 యువ మహాధివేశన్ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2019లో నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖామయన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత బీజేవైఎందేనని తెలిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా భారత సైనికులు ప్రాణాలర్పించారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరులను అవమానపరిచిందని మండిపడ్డారు. మజ్లీస్ భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినం పాటించడంలేదని ధ్వజమెత్తారు. విమోచన దినం మరవడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. తెలంగాణలో కూడా సర్కార్ మారాలని, ఇక్కడ బీజేపీ సర్కార్ వస్తే బలిదానాలు చేసిన వారికి ఘనమైన నివాళులర్పిస్తామన్నారు. ప్రస్తుతం దేశం కోసం పనిచేసే సమయం ఆసన్నమైందని, ఇప్పటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు యువమోర్చ కార్యకర్తలు మోదీ విజయం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మోదీకి ప్రత్యర్థి ఎవరో తెలియని కూటమితో పోటీ ఉంటుందన్నారు. నాలుగున్నరేళ్లలో మోదీ ఏం చేశారని రాహుల్ ప్రశ్నిస్తున్నారని, నాలుగు తరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు తమను ప్రశ్నించే అధికారం లేదన్నారు. పాకిస్తాన్‌తో ఆట పాట వల్ల దేశంలో ఎక్కడ చూసినా ఉగ్రదాడులు జరిగాయన్నారు. సర్జికల్ స్ట్రైక్ అయ్యాక దేశం పేరు విశ్వంతరాల వరకు మారు మోగిందని తెలిపారు. దేశంలో జవాన్లు, మానవ హక్కులు కాంగ్రెస్‌కు పట్టవని, రిటైర్డ్ సైనికుల కోసం యూపీఎ ఇవ్వని వన్ ర్యాంక్ పెన్షన్ తాము ఇస్తున్నామన్నారు. ఉజ్వల యోజన వల్ల కోట్ల మంది మహిళలు కట్టెల పొయ్యి నుంచి విముక్తి పొందారన్నారు. 14 కోట్ల మంది యువకులకు ముద్రలోన్ వచ్చిందని, కోట్ల మంది మహిళలు మరుగుదొడ్లతో ఆత్మగౌరవం పొందారని పేర్కొన్నారు. దేశాన్ని ఒక్కటిగా చేసేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ కూటమికి నాయకులు లేరని, అలాంటి కూటమిని ప్రజలు నమ్మరన్నారు. బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా బీజేవైఎం కార్యకర్తలకు సూచించారు. చదవండి: ‘రఫేల్’లో రాహుల్ ఫెయిల్ -
హైదరాబాద్‌కు రానున్న ప్రధాని
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 28న పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న బీజేపీ యువమోర్చా జాతీయ సమ్మేళనం ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. తెలంగాణ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేవైఎం నేషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారని యువమోర్చా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డజనుకు పైగా కేంద్ర మంత్రుల షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. మూడు రోజులపాటు (అక్టోబర్ 26,27,28) కొనసాగే ఈ సమ్మేళనంలో 50 వేల మంది యువమోర్చా కార్యకర్తలు భాగం కానున్నారు. సమ్మేళనం ముగింపు రోజున లక్ష మంది కార్యకర్తలు సభకు హాజరవనున్నారని బీజేవైఎం నాయకులు వెల్లడించారు. -
నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాలేవి? : బీజేవైఎం
కొత్తకోట (చిత్తూరు) : గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాల భర్తీ హామీలను టీడీపీ సర్కారు అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రాజు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్స్‌లీహిల్స్ కొండపై బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వెనుక కేంద్ర ప్రభుత్వం కృషి ఉందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నేతలు హాజరయ్యారు.