హైదరాబాద్‌కు రానున్న ప్రధాని | Narendra Modi Visits Hyderabad To Attend BJYM National Conference | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 5 2018 9:14 AM | Last Updated on Fri, Oct 5 2018 9:18 AM

Narendra Modi Visits Hyderabad To Attend BJYM National Conference - Sakshi

నరేంద్ర మోదీ (పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల 28న పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న బీజేపీ యువమోర్చా జాతీయ సమ్మేళనం ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. తెలంగాణ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేవైఎం నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారని యువమోర్చా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డజనుకు పైగా కేంద్ర మంత్రుల షెడ్యూల్‌ ఖరారైందని తెలిపారు. మూడు రోజులపాటు (అక్టోబర్‌ 26,27,28) కొనసాగే ఈ సమ్మేళనంలో 50 వేల మంది యువమోర్చా కార్యకర్తలు భాగం కానున్నారు. సమ్మేళనం ముగింపు రోజున లక్ష మంది కార్యకర్తలు సభకు హాజరవనున్నారని బీజేవైఎం నాయకులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement