ఇద్దరు సీఎంలు దోషులే!
నిజామాబాద్ సిటీ : శాసనమండలి ఎన్నికలలో ‘ఓటుకు నోటు’ విషయంలో ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులపై రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలంటూ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ కోరారు. ‘నోటుకు ఓటు’ విషయంలో ఇద్దరు సీఎంలు అవలంబిస్తున్న వైఖరికి నిర సనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ (ఎన్టీఆర్ చౌరస్తా) వద్ద వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం తాహెర్ బిన్ హం దాన్ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలలో ఒక సీఎం నోట్లు ఇస్తుండగా,మరొక సీఎం డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేను కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని అన్నారు.
‘ఓటుకు నోటు’ విషయంలో దొంగ నాటకం ఆడుతున్న ఇద్దరు సీఎంలు తోడు దొంగలేనని ఆయన వ్యాఖ్యానించారు. వీరిద్దరూ శిక్షర్హూలేనని, రాష్ట్రపతి జోక్యం చేసుకుని వీరిద్దరిపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాస్తవాలను బయటకు తీసి రెండు రాష్ట్రాల ప్రజలకు ఉత్కంఠ తొలగించాలన్నారు. మేధావులు ఏకమై తెలం గాణ, ఏపీ ప్రజలను కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తి గౌరవం ఉందన్నారు.
ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటూ పోరాటం చే స్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, మున్సిపల్ ఫ్లోరులీడర్ మాయవార్ సాయిరాం, కార్పొరేటర్లు కేశ మహేష్, చాంగుభాయి, ఖూద్దుస్, దారం సాయిలు, సర్పంచుల సంఘం ఫోరం అధ్యక్షుడు బోజన్న, డీసీసీ ఉపాధ్యక్షుడు జాకీర్, ప్రధాన కార్యదర్ళులు ఆకుల చిన్న రాజేశ్వర్, పోలా ఉషా, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణలత, అపర్ణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజారుద్దీన్, నాయకులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.