Bobbiliraja
-
రాజులను తరిమికొట్టండి
బొబ్బిలి: స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన రాజులను తరిమికొట్టాలని మాల, మాదిగ బహుజన రాష్ట్ర నాయకులు మల్లెల వెంకటరావు అన్నారు. శనివారం స్థానిక తాండ్ర పాపారాయ జంక్షన్లో దళితుల అభివృద్ధి రాజ్యాధికార సాధికారత అన్న అంశంపై బహిరంగ సభను నిర్వహించారు. దీనిలో పాల్గొన్న ఆయన రాజులంటే ప్రజా సంక్షేమం చూసేవారని అర్థం. కానీ ఈ రాజులు ప్రజలను మోసం చేసి వారి ఆస్తులను కాపాడుకోవడానికి, గిరిజనుల భూములను లాక్కోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అంబేడ్కర్ పోరాట సమితి అధ్యక్షుడు సోరు సాంబయ్య మాట్లాడుతూ ఇక్కడి రాజా కాలేజ్‌ను చెరకు రైతులు ఎత్తుకున్న చందాలతో నిర్మించినదన్నారు. కానీ దీనిని ఎయిడెడ్ పేరుతో అన్ఎయిడెడ్ విభాగాన్ని కూడా కల్పించి డొనేషన్లు వసూలు చేస్తూ రాజులు అనుభవిస్తున్నారన్నారు. కాలేజ్‌లో విద్యార్హత లేని వ్యక్తిని పెట్టి ఎంతో విద్యార్హత కలిగిన మేధావులు ఆయనకు వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో న్యాయవాది ఎస్జే విల్సన్ బాబా, గంట సురేష్, ముప్పాల నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు. -
గీత స్మరణం
పల్లవి : అతడు: చెమ్మచెక్క చెమ్మచెక్క జున్నుముక్క చెంపనొక్క ఆమె: నిమ్మచెక్క నిమ్మచెక్క నమ్మకంగ తిమ్మిరెక్క అ: కో... అంది కోక ఎందుకో ఆ: కోరింది కోసి అందుకో అ: రాణీ... ఐ లవ్ యూ... ఆ: రాజా... ఐ లవ్ యూ... ॥ చరణం : 1 అ: మారుమూల సోకుచేర లేఖరాయనా ఆ: సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా అ: తేరిపార చూడనీ దోర ఈడునీ ఆ: చీర చూరు దాటనీ వేడి ఊహనీ అ: వెక్కిరించు వన్నెలన్ని కొల్లగొట్టుకోనీ ఆ: పళ్లగాటు కత్తిరించు కన్నె కంచెలన్నీ అ: రా... గారంగా ఆ: సైరా... సారంగా... ॥ చరణం : 2 ఆ: ఈటెలాటి నాటుచూపు నాటుకున్నదీ అ: అలవాటులేని చాటుచోట మాటుకున్నదీ ఆ: ఈదలేను యవ్వనం ఆదరించవా అ: మీదవాలు మోజుతో స్వాగతించవా ఆ: రంగ రంగ వైభవాల మంచుమేలుకోవా అ: గంగ పొంగు సంబరాల రంగుతేరనీవా ఆ: ఈ... ఏకాంతం... అ: జాలీ... హహ్హా... కైలాసం... ॥ చిత్రం : బొబ్బిలిరాజా (1990) రచన : సిరివెన్నెల, సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర