boddeda Prasad
-
నలుగురు సభ్యులతో వైఎస్ఆర్సీపీ సమన్వయ కమిటీ
విశాఖపట్నం: విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో వైఎస్ఆర్సీపీ సమన్మయ కమిటీని నియమించింది. చంగల వెంకట్రావు, గొల్ల బాబురావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణలను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ కేంద్రకార్యలయం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. విశాఖ పట్నంకు చెందిన బొడ్డేడ ప్రసాద్‌ను యలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయ కర్తగా నియమించారు. -
గెలిపించిన పార్టీని కొత్తపల్లి గీత మోసం చేశారు
హైదరాబాద్: అరకు ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేసి ... దమ్ముంటే తిరిగి అరకు ఎంపీగా గెలవాలని కొత్తపల్లి గీతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ సవాల్ విసిరారు. ఎంపీటీసీగా కూడా గెలవలేని కొత్తపల్లి గీతను ఎంపీగా చేసిన ఘనత తమ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్‌దేనని ఆయన స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాల్లో వాటాలు, కమీషన్ల కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని కొత్తపల్లి గీతను ప్రసాద్ ఈ సందర్భంగా హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబంపై తప్పుడు ప్రకటనలు మానుకోకపోతే గిరిజనులే తగిన బుద్ధి చెబుతారని బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మహిళ అన్న ఉద్దేశంతో కొత్తపల్లి గీత ఇన్నాళ్లు ఏం మాట్లాడినా సహనంగా ఉన్నామన్నారు. గెలిపించిన పార్టీకి ద్రోహం చేయాలనుకునే ముందు అభాండాలు వేయడం సరికాదని గీతకు ఆయన హితవు పలికారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాలను మహిళలకు కేటాయించిన పార్టీ వైఎస్ఆర్ సీపీ అని ఆయన గుర్తు చేశారు. అలాగే అరకు పార్లమెంట్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా మహిళలకే కేటాయించారని తెలిపారు. వ్యక్తి అజెండా కోసం గెలిపించిన పార్టీని కొత్తపల్లి మోసం చేశారని ఆరోపించారు. గెలిపించిన గిరిజనులను కూడా గీత మోసం చేస్తున్నారని విమర్శించారు. సొంత ఇమేజ్‌తోనే గెలిచానని కొత్తపల్లి గీత భృ఼విస్తే తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని గీతకు హితవు పలికారు. గెలిచే సత్తా ఉందా అని కొత్తపల్లి గీతను ప్రసాద్ ప్రశ్నించారు. -
బాబూ.. మాఫీ మాట నిలబెట్టుకో!
మునగపాక : అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. మునగపాక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి కుటుంబానికి లక్షన్నర మాత్ర మే రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రైతాం గాన్ని మోసం చేశారన్నారు. రైతులు పీఏసీఎస్‌లకు అప్పు కట్టకపోవడంతో వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందన్నారు. జిల్లాలో పలు పీఏసీఎస్‌లు ఇప్పటికే దివాలా దిశలో ఉన్నాయని, సీఎం పుణ్యమాని అవి మరిం త దిగజారేప్రమాదం ఉందన్నారు. చంద్రబాబు అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను నిలువునా ముంచేశారన్నారు. ఇప్పటికైనా సీఎం రుణమాఫీపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించాలని బ్యాంక్‌లు ఒత్తిడి తెస్తే వైఎస్సార్సీపీ వారికి అండగా నిలుస్తుందన్నారు. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నాయకత్వంలో వారి తర పున పోరాట ం చేస్తామని చెప్పారు. సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మళ్ల నాగసన్యాశిరావు, ఎంపీటీసీ పల్లెల ప్రకాశరావు, జాజుల వెంకటరమణ, యల్లపు వెం కట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
త్రిసభ్య కమిటీ సమావేశం రేపు
ఎన్నికలపై వైఎస్సార్ సీపీ సమీక్ష నియోజకవర్గాల వారీ సమావేశం మునగపాక, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షకు జూన్ ఒకటిన అనకాపల్లి న్యూకాలనీలోని రోటరీ కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ సమావేశమవుతున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మునగపాకలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నాయకులతో సమీక్ష ఉంటుందన్నారు. దీనికి పార్టీ సీనియన్ నేతలు, విశాఖ జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, సాయిరాజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. నియోజకవర్గాల వారీ సమీక్ష అనంతరం నివేదికను జగన్మోహన్రెడ్డికి సమర్పిస్తారన్నారు. ఇందులో భాగంగా ఒకటిన ఉదయం 9గంటలకు అనకాపల్లి , 9.30 గంటలకు చోడవరం, 10 గంటలకు పెందుర్తి, 10.30 గంటలకు యలమంచిలి, 11 గంటలకు పాయకరావుపేట, 11.30 గంటలకు నర్సీపట్నం, 12 గంటలకు మాడుగుల, 12.30 గంటలకు పాడేరు, ఒంటి గంటకు అరకు నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష ఉంటుందన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలని ప్రసాద్ కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మళ్ల సంజీవరావు,పీఏసీఎస్ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, పార్టీ నాయకుడు సూరిశెట్టి కన్నారావులు పాల్గొన్నారు.