బాబూ.. మాఫీ మాట నిలబెట్టుకో!
మునగపాక : అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. మునగపాక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి కుటుంబానికి లక్షన్నర మాత్ర మే రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రైతాం గాన్ని మోసం చేశారన్నారు. రైతులు పీఏసీఎస్‌లకు అప్పు కట్టకపోవడంతో వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందన్నారు. జిల్లాలో పలు పీఏసీఎస్‌లు ఇప్పటికే దివాలా దిశలో ఉన్నాయని, సీఎం పుణ్యమాని అవి మరిం త దిగజారేప్రమాదం ఉందన్నారు.
చంద్రబాబు అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను నిలువునా ముంచేశారన్నారు. ఇప్పటికైనా సీఎం రుణమాఫీపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించాలని బ్యాంక్‌లు ఒత్తిడి తెస్తే వైఎస్సార్‌సీపీ వారికి అండగా నిలుస్తుందన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి నాయకత్వంలో వారి తర పున పోరాట ం చేస్తామని చెప్పారు. సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మళ్ల నాగసన్యాశిరావు, ఎంపీటీసీ పల్లెల ప్రకాశరావు, జాజుల వెంకటరమణ, యల్లపు వెం కట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.