debt waivers
-
ఏపీకి రానున్న 15వ ఆర్ధిక సంఘం సభ్యులు
-
రాష్ట్రాలకు కొరవడుతున్న ఆర్థిక క్రమశిక్షణ
ముంబై: రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ విషయంలో జాగరూకత పాటించాల్సిన అవసరాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. వ్యవసాయ రుణ మాఫీ, ఆదాయ మద్దతు పథకాలు, విద్యుత్ పంపిణీ కంపెనీలకు ఉదయ్ బాండ్ల వంటి అంశాలు రాష్ట్రాల ద్రవ్య స్థిరత్వానికి ఇబ్బందులను పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులు, ఆర్బీఐ అధికారుల మధ్య నేడు ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్, డిప్యూటీ గవర్నర్లు తదితర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో చర్చలకు సంబంధించి విడుదలైన ఒక అధికారిక ప్రకటనలో ముఖ్యాంశాలు.. ►సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంసహా పలు రాష్ట్రాలు సైతం పలు ఆర్థిక వరాలు కురిపించాయి. వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అధికార పార్టీలు, ప్రతిపక్షాలు హామీలు గుప్పించాయి. ఆర్థిక క్రమశిక్షణ కోణంలో ఇది ప్రతికూలాంశమే. ► గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఓటర్లను ఆకర్షించడానికి అలాగే పేదవర్గాలకు ఊరట కలిగించడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు హామీలిచ్చాయి. గత డిసెంబర్లో అధికారం చేపట్టిన మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా ప్రజాకర్షక పథకాల అమలుకు శ్రీకారం చుట్టాయి. ► ఆయా అంశాలు ద్రవ్యలోటుకు సంబంధించి వార్షిక బడ్జెట్ అంచనాలను తప్పిస్తున్నాయి. ► ఆదాయాల్లో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతున్నా... స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ రుణ భారాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ► గత డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్‌గా నియమతులుకావడానికి ముందు 15వ ఆర్థిక సంఘంలో శక్తికాంతదాస్ కూడా ఒక సభ్యుడు కావడం గమనార్హం. ► మార్కెట్ రుణాల విషయంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలపై ఆర్బీఐ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చింది. మార్కెట్ నుంచి నిధుల సమీకరణ, సెకండరీ మార్కెట్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మెరుగుదల వంటి అంశాలపై సమావేశం చర్చించింది. -
చేనేత కార్మికులకు చేయూత: హరీశ్
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలు మెచ్చాయని, ఇక్కడి చేనేత కార్మికులు నేసిన గొల్లభామ చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిం దని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట చేనేత సొసైటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించి ప్రభుత్వ రుణమాఫీ చెక్కులను బ్యాంకర్లకు అందజేశారు. నేత కార్మికులను ఆదుకుంటామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల యోగ క్షేమాలపై ప్రత్యేక దృష్టిపెట్టారని ఆయన అన్నారు. చాలీచాలని ఆదాయంతో అప్పుల ఊబిలో కూరుకు పోయిన చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయడంలో కేటీఆర్ సహకారం మరువలేమని అన్నారు. కార్మికులకు నూలు, రసాయనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రతి పట్టణంలో చేనేత వస్త్రాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న గొల్లభామ చీరల తయారీని ప్రభుత్వ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. -
రుణ మాఫీకి కసరత్తు
రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పరాజయం పాలు కావడానికి రైతుల ఆగ్రహమే కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా వ్యవసాయ సంక్షోభం కొనసాగుతుండటం, రైతుల కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఫలించకపోవడంతో రైతులు పాలక పక్షాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంతో తమ కోపాన్ని ప్రదర్శించారని వారంటున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పరిస్థితి ఎదురు కాకుండా చూసేందుకు ఇప్పటి నుంచే రైతుల కోసం పథకాలు ప్రకటించాలని బీజేపీ ఆలోచిస్తోంది. గత ఏడాది కేంద్రం పంటల కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచింది. అయినా కూడా ఎన్నికల్లో అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇక మిగిలింది. రైతులకు అత్యధిక ప్రయోజనం కలిగించేది రుణమాఫీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రైతు రుణ మాఫీ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. యూపీఏ సర్కారు కూడా 2008లో 72వేల కోట్ల రూపాయల మేర రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. 2009 ఎన్నికల్లో కేంద్రంలో మెజారిటీ సాధించి అధికారంలోకి రావడానికి అదీ ఒక కారణమే. ఆర్థికంగా పెనుభారం రుణమాఫీ రాజకీయంగా మేలు చేసినా దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల పాలవుతుందని, బ్యాంకులపై పెనుభారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కేంద్రానికున్న ఆర్థిక పరిమితుల దృష్ట్యా రుణమాఫీని దేశమంతటికీ కాకుండా దుర్భిక్ష ప్రాంతాలకు మాత్రమే ప్రకటిస్తే మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. అదీకాక, ఈ రుణమాఫీ వల్ల పెద్ద రైతులే లాభపడతారని, 80శాతానికి పైగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదని కూడా వారు వివరిస్తున్నారు.ఆహార ధాన్యాల ధరలు తక్కువగా ఉండటం, ఎగుమతి నిబంధనలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి సర్కారు ప్రయత్నిస్తే బాగుంటుందని కేర్ రేటింగ్స్ సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ సూచించారు. ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనను పెంచడం వంటి వాటిపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు.2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3శాతానికి పరిమితం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రుణమాఫీ అమలయితే ద్రవ్యలోటు అంచనాలను మించిపోతుందని ఆయన చెప్పారు. మాఫీ@లక్షల కోట్లు ప్రస్తుత ఎన్డీఏ సర్కారు కూడా రైతు రుణమాఫీ ప్రకటించాలని భాగస్వామ్య పక్షాలు బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాయని, అయితే, 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల ముందు ప్రకటించే ఉద్దేశంతో.. బీజేపీ ఇప్పుడా పథకాన్ని కావాలనే పక్కన పెట్టిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజా ఫలితాల నేపథ్యంలో వీలయినంత త్వరలో రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించేందుకు కేంద్రం సన్నద్దమవుతోందని ఆ వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 26 కోట్ల 30లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయడం మాటలు కాదు. దీనికి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు కావాలి.ఇది కేంద్రానికి పెను ఆర్థిక భారంగా పరిణమిస్తుంది. అయినా సరే ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ భారాన్ని మోయడానికి కేంద్రం సిద్ధపడుతోందని ప్రభుత్వ వర్గా లు అంటున్నాయి. రుణ మాఫీతో పాటు కనీస మద్దతు ధర పెంపు, పంటల సేకరణ పరిమాణం పెంపు వంటి చర్యలు కూడా తీసుకుని రైతాంగం ఆగ్రహాన్ని ఉపశమింపచేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ‘ఎన్నికలు తొందరలోనే ఉన్నాయి. ఇంత వరకు ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయింది. దాని ఫలితం మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించింది. కాబట్టి వీలయినంత తొందరగా రైతు రుణ మాఫీని ప్రభుత్వం ప్రకటించకతప్పదు’ అన్నారు ప్రముఖ ఆర్థిక వేత్త అశోక్ గులాటి. ఏ ప్రభుత్వమైనా రైతులకు చేసే అతిపెద్ద మేలు రుణ మాఫీయేనని చెప్పారు. -
గడీల పాలన గద్దె దించే లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాల కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో ఉంచాల్సిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గడీల పాలనను గద్దె దించడమే లక్ష్యంగా అమరవీరుల ఆకాంక్షల ఎజెండా పేరుతో సీఎంపీ తయారు చేసేందుకు కూటమిలోని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందించగా వాటన్నింటినీ క్రోడీకరించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ వారంలో కసరత్తు పూర్తవుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కూటమిపక్షాన కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ని విడుదల చేస్తామని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. కనీస ఉమ్మడి ప్రణాళికలో పరిగణనలోకి తీసుకోనున్న ముఖ్య ప్రతిపాదనలివే... ► అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ► రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ ► జిల్లాలు, జోనల్ వ్యవస్థలపై సమీక్ష ► 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ► గునీటి కాంట్రాక్టుల్లో ఈపీఎస్ వ్యవస్థ రద్దు, స్థానిక కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ► తొలి, మలి దశ ఉద్యమకారులకు గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం, పింఛన్ సౌకర్యం∙ ధర్నా చౌక్ పునరుద్ధరణ ► నిరుద్యోగులకు నెలసరి భృతి (రూ. 3 వేలు)కర్ణాటక తరహాలో లోకాయుక్త వ్యవస్థ బలోపేతం ► రూ. 10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ► రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధి ► ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపు ► పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ► ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు, రక్షిత మంచినీరు, బస్సు సౌకర్యం ► పెండింగ్‌లో ఉన్న మండల, డివిజన్ డిమాండ్ల పరిష్కారం ► అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత ► సంవత్సరంలోగా అమరవీరులకు స్మృతి వనం ► భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి, అర్హులందరికీ ఇచ్చేంత వరకు నెలకు రూ. 3 వేల ఆర్థిక సాయం ► బీసీ సబ్‌ప్లాన్ ► మైనార్టీల సంక్షేమం కోసం సచార్, సుధీర్ కమిటీల నివేదికల అమలు ► సింగరేణి, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఆసరా పింఛన్లు ► వ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ► ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ► అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్, వైద్య సౌకర్యం, గృహ వసతి, సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ► 5 సంవత్సరాలలోపు ప్రాక్టీస్ ఉన్న లాయర్లకు సైపెండ్ ► ఏటా ఉద్యోగ కేలండర్ ► అన్ని జిల్లా కేంద్రాల్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు ► విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ఎన్నారై శాఖ ► విత్తనం వేసే సమయంలోనే మద్దతు ధర ప్రకటన ► ఆదాయ భద్రత కోసం రైతు కమిషన్ ఏర్పాటు ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం... అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం ► మండల కేంద్రాల్లో ఐటీఐ/జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్/డిగ్రీ కళాశాల, జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీ, పీజీ సెంటర్ ఏర్పాటు ► మహిళ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు ► పట్టణాల్లో ఉచిత బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు ► 104, 108 సేవలు ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా కార్పొరేషన్ ఏర్పాటు ► ఇంటి పన్ను హేతుబద్ధీకరణ ► తెలంగాణ ఉద్యమ కళాకారులకు గుర్తింపు, తగిన వేతనం ► తెలంగాణ సినీ రంగానికి ప్రోత్సాహం, తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు పన్ను రాయితీ ► ఖాయిలా పడిన పరిశ్రమల పరిరక్షణకు విధానం ► నిజాం షుగర్స్, సిర్పూర్ పేపర్ మిల్లు, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ. -
రాష్ట్రాభివృద్ధికి 20 ఏళ్ల ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి 20 ఏళ్ల సమగ్ర ప్రణాళికను రూపొందించి దానినే బీజేపీ మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా మేనిఫెస్టోను రూపొందించడంతో పాటుగా నియోజకవర్గ స్థాయి సమస్యలపైనా ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో విద్యా, వైద్యం, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర ప్రజల అవసరాలు–బీజేపీ ఆవశ్యకత, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అవినీతి, కుటుంబ పాలన, మజ్లిస్‌తో ఆ పార్టీల దోస్తీ తదితర అంశాలను కూడా ప్రస్తావించనుంది. దీనిని రూపొందించే పనిలో భాగంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. రైతులకు ఉచిత బోరు, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు, రైతు రుణాల వడ్డీని ప్రభుత్వమే భరించేలా చర్యలు, పంటలపై ఎంఎస్పీకి అదనంగా బోనస్ ఇవ్వడం, నిరుద్యోగభృతి, ఉద్యోగ అవకాశాల పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ఇందులో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటోంది. వీలైనంత త్వరగా దీనిని రూపొందించి ప్రజల్లోకి తేవాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తాజామాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మల్లారెడ్డి, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వైకుంఠం, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమిత్‌షా సభ తరువాత ప్రకంపనలే: లక్ష్మణ్ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా మేనిఫె స్టోను రూపొందిస్తున్నామని ఇది విజనరీ డాక్యుమెంట్లా ఉంటుందని లక్ష్మణ్ వెల్లడించారు. ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో అమిత్‌షా సమావేశం అనంతరం ఇతర పార్టీల్లో ప్రకంపనలు పుట్టించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి భారీగా నాయకులు తమపార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. -
గంగిరెద్దులు వస్తున్నాయి?
సాక్షి,మహబూబాబాద్/కరీమాబాద్: ‘‘సంక్రాంతి మొన్ననే పోయింది కదా.. ఊళ్లోకి ఇప్పుడెందుకు గంగిరెద్దులు వస్తున్నాయి’’అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామావు ఎద్దేవా చేశారు. పాలేరులో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకుల నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. బుధవారం వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్.. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షమే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి రైతుబంధు పథకం కింద ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.8 వేలు ఇస్తామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 2,630 తండాలను పంచాయతీలుగా చేశామని వివరించారు. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అథారిటీ, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఆపరేటర్స్లతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. వరంగల్‌లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మాస్టర్ ప్లాన్‌పై ఆయన సమీక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్, టూరిజం, టెక్స్టైల్ పార్కు, ఉద్యోగ కల్పనను దృష్టిలో ఉంచుకుని 9 నెలలుగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు ఇన్నర్ రింగ్‌రోడ్డు కూడా ఉండాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హైదరాబాద్‌లో మాదిరిగా అర్బన్ ల్యాండ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 500 ఎకరాల మేర ల్యాండ్‌పుల్లింగ్ చేయాలని మంత్రి సూచించారు. పిక్ ఆఫ్ ది డే షేక్‌హ్యాండ్ ఇచ్చిన పోలీస్ జాగిలం ట్విట్టర్లో పోస్టు చేసిన మంత్రి కేటీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసు బందోబస్తులో భాగంగా వచ్చిన శునకం ఆయన్ని ఆకట్టుకుంది. ‘కుడా’కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొనేందుకు సమావేశ మందిరంలోకి వెళ్తుండగా అక్కడే ఉన్న శునకం.. మంత్రికి సెల్యూట్ చేసింది. ఆ వెంటనే షేక్‌హ్యాండ్ ఇచ్చింది. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. పర్యటన అనంతరం మంత్రి తన ట్విట్టర్లో ఆ ఫొటోను పోస్టు చేస్తూ ‘మై ఫేవరేట్ పిక్ ఆఫ్ ది డే ఫ్రం వరంగల్, రాన్ ఇంటూ స్వీటీ, ఈ పోలీస్ కెనీన్ హూ ఆఫర్డ్ ఏ వార్మ్ హ్యాండ్‌షేక్’అంటూ కామెంట్ రాశారు. -
ఎందుకు ‘మహా’ రైతులు కన్నెర్ర చేస్తున్నారు?
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రైతన్నలు రోడ్డెక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 12న ముంబైలో అసెంబ్లీ ముట్టడికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నదాతల ఆక్రందనలకు కారణాలేంటి ? ఎందుకు రైతులు ఫడ్నవీస్ సర్కార్‌పై కన్నెర్ర చేస్తున్నారు ? ఏమిటీ మార్చ్ భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైంది. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంటుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. ఎందుకీ పాదయాత్ర ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచేశాయి. వడగండ్ల వానలు కడగండ్లను మిగిల్చాయి. పింక్ బాల్ వార్మ్ పత్తి రైతుల్ని పీల్చిపిప్పి చేసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్లవానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. అమరావతి, మరఠ్వాడ, నాగపూర్, నాసిక్ ప్రాంతాల్లో రైతులు దారుణంగా నష్టపోయారు. ఇక మహారాష్ట్రలో గత ఏడాది 84 శాతం వ్యవసాయ భూముల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే ఈ పంటకు సోకిన పింక్ బాల్ వార్మ్ కారణంగారైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల్లో కూరుకుపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది.. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ 34 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి హామీ ఇచ్చింది. కానీ అమలు సరిగా జరగలేదు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యల తీరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు ఏంటి ? ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి. విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి కనీస మద్దతు ధరతో రైతులకు ఒదిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి. బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. ఆదివాసీలకు అటవీ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలి. నాసిక్, థానే, పాల్ఘడ్ ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు కారణంగా ఎన్నో ఆదివాసీ గ్రామాలు నష్టపోతాయి.. అందుకే ఆ రూట్ మ్యాప్‌ను మార్చాలి. ఆగని అన్నదాతల ఆత్మహత్యలు రైతు సమస్యల పరిష్కారానికి గత ఏడాది ప్రభుత్వం రుణ మాఫీని ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో దీని అమలు జరగలేదు. దీంతో అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేసేదంతా చేస్తున్నాం: సర్కార్ మరోవైపు మహారాష్ట్ర సర్కార్ రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు 13, 782 కోట్లు నిధులు విడుదల చేశామని చెబుతోంది. అంతేకాదు ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అత్యంత ప్రాధాన్యతనిస్తూ 15వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి 2,400 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం కోరింది. . అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘మహా’ మార్చ్
ముంబై: చరిత్రలో రైతు ఉద్యమాలు ఎన్నో చూశాం. కానీ రికార్డు స్థాయిలో వేలాది మంది అన్నదాతలు 180 కి.మీ మేర పాదయాత్ర చేపట్టడం బహుశా ఇదే తొలిసారేమో! ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతోంది ఇదే. రుణ మాఫీ అమలు సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని సుమారు 30 వేల మంది రైతులు మార్చి 6న నాసిక్ నుంచి ముంబైకి మహా యాత్రగా బయల్దేరారు. మార్గ మధ్యలో వారికి థానె, పాల్ఘడ్ తదితర జిల్లాల రైతులు జతకలిశారు. 12న ర్యాలీ ముంబై చేరుకునే సరికి రైతుల సంఖ్య 70 వేలకు పెరగొచ్చు. అదే రోజు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించే వీలుంది. భారతీయ కిసాన్ సభ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ముంబై–ఆగ్రా జాతీయ రహదారి మీదుగా మార్చ్ కొనసాగుతోంది. రైతులు భోజనాలు, నిద్ర లాంటి అవసరాలను రోడ్లపైనే తీర్చుకుంటున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్లకు పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. అసంతృప్తిని రగిల్చిన పంట నష్టం.. ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. పింక్ బాల్ వార్మ్ చీడ పత్తి పంటను దెబ్బతీసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్ల వానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ రూ. 34 వేల కోట్ల రుణాల మాఫీకి హామీ ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాలేదు. దీంతో అన్నదాతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుని ఉద్యమానికి దారి తీసింది. ఆగని ఆత్మహత్యలు.. రుణ మాఫీ పథకం అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు, రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు రూ. 13, 782 కోట్లు విడుదల చేశామని తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి రూ. 2,400 కోట్ల ఆర్థిక సాయం కోరగా కేంద్రం నుంచి స్పందన రాలేదు. రైతుల డిమాండ్లు ఇవీ.. ► ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి ► విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి ళీ స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి ► కనీస మద్దతు ధరతో రైతులకు ఒరిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. ► అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి ► బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. -
ప్రభుత్వానిది డ్రామా... కాంగ్రెస్‌ది అసహనం
సాక్షి, హైదరాబాద్: పంట రుణాల మాఫీ, పంటలకు మద్దతు ధర అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్షాల మధ్య కాసేపు మాటల యుద్ధానికి దారి తీసింది. సభలో ప్రభుత్వం డ్రామా చేస్తోందని విపక్ష నేత జానారెడ్డి మండిపడగా కాంగ్రెస్‌లో అసహనం పెరుగుతోందని శాసనసభ వ్యవహా రాల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రుణ మాఫీ, మద్దతు ధరపై మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన చర్చలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయన ప్రసంగంపై అభ్యంతరం తెలిపారు. రుణమాఫీలో వడ్డీ భారంపై చెప్పకుండా మంత్రి ఏవేవో చెబుతున్నారన్నారు. అన్ని అంశాల గురించి చెబుతామని మంత్రి చెప్పగా తాము ప్రస్తావించిన అంశాలపై నివృత్తికి అవ కాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. మంత్రి మాట్లాడడం పూర్తయ్యాక అవకాశం ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు అంగీకరించని కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు... వారిలో అసహనం పెరుగు తోందని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులు సీట్లలో కూర్చుంటే అవకాశం ఇస్తామన్నారు. ఈ సమయంలో జానారెడ్డి నిల్చుని... ‘ఆయన (స్పీకర్) ఎందుకు వెళ్లారో... మీరెందుకు (డిప్యూటీ స్పీకర్) వచ్చారో మాకు తెల్సు. ఇదొక డ్రామా. ఏం జేస్తరో చూస్త. అధికార పక్షానికి ఓపిక ఉండాలె. నేను ఎవరినీ ఎప్పు డూ తిట్టను. నాకు ఆ అవసరంలేదు. రైతుల పక్షాన ప్రణమిల్లుతున్నాను’ అని వ్యాఖ్యానిం చారు. ఆపై ‘నిరసనల బహిష్కారం’ శీర్షికతో సాక్షి పత్రిక బుధవారం సంచికలో వచ్చిన ఎడిటోరియల్‌ను చదవడం మొదలుపెట్టారు. జానా తీరుపై మంత్రి హరీశ్ మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించాలనే విషయాన్ని పట్టించుకోకుండా జానారెడ్డి మాట్లాడారని విమర్శించారు. స్పీకర్ స్థానంలో ఉన్న మహిళా డిప్యూటీ స్పీకర్‌ను కించపరిచారని, వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. జానా మాట్లాడుతూ తాను ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి మాట్లాడలేదని, అలాంటి దేమైనా ఉంటే తన వ్యాఖ్యలను ఉపసం హరించుకుంటున్నానన్నారు. -
బాబూ.. మాఫీ మాట నిలబెట్టుకో!
మునగపాక : అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. మునగపాక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి కుటుంబానికి లక్షన్నర మాత్ర మే రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రైతాం గాన్ని మోసం చేశారన్నారు. రైతులు పీఏసీఎస్‌లకు అప్పు కట్టకపోవడంతో వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందన్నారు. జిల్లాలో పలు పీఏసీఎస్‌లు ఇప్పటికే దివాలా దిశలో ఉన్నాయని, సీఎం పుణ్యమాని అవి మరిం త దిగజారేప్రమాదం ఉందన్నారు. చంద్రబాబు అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను నిలువునా ముంచేశారన్నారు. ఇప్పటికైనా సీఎం రుణమాఫీపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించాలని బ్యాంక్‌లు ఒత్తిడి తెస్తే వైఎస్సార్సీపీ వారికి అండగా నిలుస్తుందన్నారు. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నాయకత్వంలో వారి తర పున పోరాట ం చేస్తామని చెప్పారు. సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మళ్ల నాగసన్యాశిరావు, ఎంపీటీసీ పల్లెల ప్రకాశరావు, జాజుల వెంకటరమణ, యల్లపు వెం కట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.