Boddu Bhaskara Rama Rao
-
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత
పెదపూడి/రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు (72) కరోనా బారిన పడి ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన, భార్య జగ్గయమ్మ 20 రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన వారం రోజుల్లో జగ్గయమ్మకు కరోనా వైద్య పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలు రావడంతో ఇంటికి వచ్చేశారు. భాస్కర రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పెద్దాడ గ్రామానికి 1971 నుంచి 1981 వరకు ఏకగ్రీవ సర్పంచ్‌గా పని చేశారు. 1982లో సామర్లకోట సమితి అధ్యక్షునిగా పనిచేశారు. టీడీపీలో చేరి 1984లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా, 1994 నుంచి 1999 వరకు, 1999 నుంచి 2004 వరకు పెద్దాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. 2013లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరి 2014 డిసెంబర్లో మళ్లీ టీడీపీలో చేరారు. సీనియర్ నేతగా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి మృతి కార్మిక నేత, కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి (96) ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మృతి చెందారు. నూరు సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో 80 ఏళ్లు ప్రభాకర చౌదరి ఉద్యమనేతగా ఉన్నారు. 1952లో రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో కూడా గెలిచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏడు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన అవిశ్రాంత పోరాటం సాగించారు. ఆయన మృతి కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటని పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. చదవండి: కరోనా టెస్టుల్లో రికార్డు నిన్ను నమ్మం బాబూ.. -
చిన రాజప్పకు చంద్రబాబు హ్యాండ్..!
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు తీవ్ర అవమానం ఎదురవుతోంది. ఇప్పటికే మంత్రులు గంటా శ్రీనివాసరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ అధిష్టానం వ్యవహరించిన తీరు.. ఆయా నేతల అనుచరుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప సీటుకే ఎసరు పరిస్థితి కనిపిస్తోంది. చిన రాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సీటు విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. బొడ్డు భాస్కర రామారావుకు పెద్దాపురం నుంచి టికెట్ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భాస్కర రామారావును అమరావతికి పిలువడంతో.. ఆయనకు సీటు ఖరారైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో డిప్యూటీ సీఎం చిన రాజప్పకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారని, ఆయనకు టీడీపీ టికెట్ లేనట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తన సీటు వేరే వ్యక్తికి కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారని తెలియడంతో ఆందోళన చెందిన చిన రాజప్ప హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. -
టీడీపీలో బయటపడ్డ గ్రూపు రాజకీయాలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. వచ్చే ఎన్నికలకు ప్రస్తుతం హోంమంత్రి చినరాజప్పకే మళ్లీ పెద్దాపురం సీటును చంద్రబాబు ఖరారు చేయడంతో పార్టీలో లుకలుకలు వెలుగుచూశాయి. పెద్దాపురం సీటు తనకే వస్తుందని చివరి నిమిషం వరకు ఆశపడ్డ మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భంగపడ్డారు. దీంతో పెద్దాడలోని తన నివాసంలో బొడ్డు భాస్కర్, అనుచరులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ మారైనా వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేయాలని సన్నిహితులు సమావేశంలో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అధిష్టానం నిర్ణయం మారుతుందో లేదో రెండు రోజులు వేచి చూసి టీడీపీకి బైబై చెప్పే యోచనలో బొడ్డు భాస్కర్ రామారావు ఉన్నట్లు తెలిసింది. కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత బొడ్డు మాట్లాడుతూ.. పెద్దాపురం సీటు తనకు ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. రాజమండ్రి ఎంపీగా తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కూడా తేల్చిచెప్పారు. -
మీతో శత్రుత్వమే మాకు సంతోషం
-
చినరాజప్పకు మిత్రుడిగా ఉండడం కంటే...
తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంటి సంస్కారహీనుడికి మిత్రుడిగా ఉండడం కంటే శత్రువుగా ఉండడమే సంతోషమని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు వ్యాఖ్యానించారు. రాజప్ప ఇటీవల ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై స్పందిస్తూ భాస్కర రామారావు బహిరంగ లేఖ రాశారు. దాని పూర్తి పాఠం.. గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి.. మీ స్థాయికి, సంస్కారానికి సంబంధం లేదని మీ మాటలు నిరూపిస్తున్నాయి. ఒక రాష్ట్ర శాంతి భద్రతలని పరిరక్షించే అత్యంత కీలకమైన హోంమంత్రి పదవిలో వుండి దాని పరువు తీస్తూ నోరు పారేసుకోవడం మీకే చెల్లింది. ఈ మధ్య కాలంలో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ప్రోగ్రామ్‌లో నన్ను మరియు దివంగత నేత మెట్ల సత్యనారాయణరావును మీ శత్రువులుగా చెబుతూ ఏక వచనంతో హీనంగా, అణుమాత్రం సభ్యత లేకుండా మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజ లంతా అసహ్యించుకొనేలా ఉంది. జీవించినంత కాలం మంచికి మారుపేరుగా నిలిచిన మెట్ల సత్యనారాయణరావుని, మీ జీవిత కాలంలో ఏమీ చేయలేని మీరు ఆయన మరణించిన తరువాత ఇప్పుడు విమర్శిస్తుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లుంది. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడే సంస్కారం ఏ సీమదో తెలియదుగానీ, కోనసీమది మాత్రం కాదు, తెలుగుజాతిది కాదు. ఇక నన్ను శత్రువుగా భావిస్తూ మీరు మాట్లాడడం, ఏకవచనంతో వెటకారంగా మాట్లాడడం బాధనిపించినా మీలాంటి సంస్కారహీనుడికి మిత్రుడుగా కన్నా శత్రువుగా ఉండడమే మేలు! మీ శత్రుత్వం మాకు సంతోషం. ఇకపై దానినే కొనసాగిద్దాం! మీరు టీవీ చానల్లో మాట్లాడినవి అన్నీ అబద్ధాలే. గత 25 సంవత్సరాలలో జిల్లా తెలుగుదేశం పార్టీకి, పెద్దాపురం నియోజకవర్గానికి మీరేం చేశారో, నేనేం చేశానో జిల్లా నాయకులకు మరియు పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకు, బాగా తెలుసు. ఈ విషయంలో నేను బహిరంగ చర్చకు సిద్ధం. మన పార్టీ పెద్దలు అయిన యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ వంటి పెద్దల సమక్షంలోఈ బహిరంగ చర్చకు నేను సిద్ధం. పెద్దాపురం నియోజకవర్గం నా జన్మభూమి. ఇక్కడ ప్రజలతో నాది ఎప్పుడూ రక్త సంబంధమే. ఇక్కడ నేనెప్పుడూ అతిథిని కాదు. సొంత మనిషిని. అని మళ్లీ వక్కాణిస్తూ బహిరంగ చర్చకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ.... మీరు శత్రువుగా భావించే – బొడ్డు భాస్కర రామారావు -
సెప్టెంబర్‌లో మళ్లీ ఉద్యమిస్తాం: ముద్రగడ
పెదపూడి: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆగస్టులోగా నెరవేర్చకుంటే సెప్టెంబరులో మళ్లీ ఉద్యమిస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. తెలగ, కాపు, ఒంటరి కులాలను బీసీల్లో కలపాలని చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పెద్దలు, నేతలకు కృతజ్ఞతలు తెలపడంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఉద్యమానికి ఎంతగానో సహకరించారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానన్నారు. చంద్రబాబు పాదయాత్రలో, 2014 ఎన్నికల్లో వెళ్లిన ప్రతి చోట కాపులను బీసీల్లో చేరుస్తామని నమ్మించారన్నారు. తాము సెప్టెంబర్‌లో రోడ్డు ఎక్కాలా లేక వద్దా అనేది బాబు నిర్ణయంపైనే ఉందని స్పష్టం చేశారు.