సెప్టెంబర్‌లో మళ్లీ ఉద్యమిస్తాం: ముద్రగడ | Mudragada Padmanabham comments | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో మళ్లీ ఉద్యమిస్తాం: ముద్రగడ

Published Tue, Jun 7 2016 1:33 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

సెప్టెంబర్‌లో మళ్లీ ఉద్యమిస్తాం: ముద్రగడ - Sakshi

సెప్టెంబర్‌లో మళ్లీ ఉద్యమిస్తాం: ముద్రగడ

పెదపూడి: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆగస్టులోగా నెరవేర్చకుంటే సెప్టెంబరులో మళ్లీ ఉద్యమిస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. తెలగ, కాపు, ఒంటరి కులాలను బీసీల్లో కలపాలని చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పెద్దలు, నేతలకు కృతజ్ఞతలు తెలపడంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడలో ఎమ్మెల్సీ  బొడ్డు భాస్కర రామారావు ఉద్యమానికి ఎంతగానో సహకరించారని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానన్నారు. చంద్రబాబు పాదయాత్రలో,  2014 ఎన్నికల్లో వెళ్లిన ప్రతి చోట కాపులను బీసీల్లో చేరుస్తామని నమ్మించారన్నారు.  తాము సెప్టెంబర్‌లో రోడ్డు ఎక్కాలా లేక వద్దా అనేది బాబు నిర్ణయంపైనే ఉందని స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement