Bodo terrorists
-
అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యం: నిలువెత్తు జ్ఞాపకం
బిడ్డల భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరెళ్లినా వారి జ్ఞాపకాలు మాత్రం ఆమె మెడ చుట్టూ చిట్టి చేతుల్లా అల్లుకుపోతూనే ఉంటాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కంది నాగమణి పాతికేళ్ల క్రితం దేశసేవలో కానరాని దూరాలకు వెళ్లిన కొడుకును మళ్లీ కళ్లారా చూడాలనుకుంది. కొడుకు గొప్పతనాన్ని ఆ ఊరి ప్రజల ముందుకు తేవాలనుకుంది తనలాంటి కొడుకు వీధికొక్కరు పుట్టాలని నడివీధిలో విగ్రహాన్ని నిలబెట్టింది. కంది నాగమణి, శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగునీటి వసతులు లేక వర్షాధారంపై ఆధారపడి సేద్యం చేస్తుండే వాళ్లు. నాగమణి ఇల్లు, వ్యవసాయపనులే కాదు బీడీలు చుట్టే పని కూడా చేస్తుండేది. పెద్ద కొడుకు సిద్దరాములు ఏడో తరగతి వరకు చిట్యాలలో చదువుకున్నాడు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తాడ్వాయి మండల కేంద్రానికి వెళ్లి చదువుకున్నాడు. 1990 లో సీఆర్పీఎఫ్ జవానుగా సెలెక్టయ్యాడు. అప్పట్లో వాళ్ల గ్రామంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. పోలీస్ డిపార్టుమెంటులో చేరుతానని ముందుకెళ్లాడు. వద్దని వారించినా వెనకడుగువేయలేదు. ఇంకో అడుగు ముందుకేసి దేశం కోసం సేవ చేస్తానంటూ వెళ్లాడు. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. గుండెలో పేలిన బాంబు 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు పేల్చిన మందుపాతరలో పది మంది వరకు జవాన్లు చనిపోయారు. అందులో సిద్దరాములు ఒకరు. ఇంటికి కబురందింది. తల్లి గుండె చెరువయ్యింది. సీఆర్పీఎఫ్ అధికారులు శవాన్ని తీసుకుని తాడ్వాయికి వచ్చారు. ఆ జ్ఞాపకాల్లోనే.. కొడుకు చనిపోయి పాతికేళ్లు దాటింది. అయినా, ఆ తల్లి మాత్రం కొడుకు జ్ఞాపకాల్లోనే కాలం గడుపుతోంది. చిన్నతనంలో చేసిన అల్లరి, పెద్దయ్యాక చూపిన గుండెధైర్యం ఆమెను రోజూ వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఆలనా పాలనా చిన్న కొడుకు విఠల్ చూసుకుంటున్నాడు. బీపీ, షుగర్ సమస్యలకు మందులు వాడుతోంది. నిత్యం కొడుకు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వచ్చింది. బీడీ కార్మికురాలిగా రిటైర్ అయ్యాక పీఎఫ్‌లో జమ అయిన డబ్బులపై నెలనెలా పెన్షన్ వస్తోంది. ఆ డబ్బులతో కొడుకు విగ్రహం ఏర్పాటు చేయాలని పూనుకుంది. విగ్రహం తయారీకి, ఏర్పాటుకు ఎంతోమందిని కలిసి, తన కల గురించి చెబుతుండేది. దాదాపు రూ.లక్షా 60 వేలు ఖర్చు చేసి సిద్దరాములు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించింది. జై జవాన్.. గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈ నెల 27న జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది నాగమణి. కొడుకు జ్ఞాపకాలతో విగ్రహం ఏర్పాటు చేసిన తల్లిని అందరూ అభినందించారు. నాగమణి మాత్రం నాడు తన కొడుకుతో పాటు మరో పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకుంది. దేశసేవలో జవాన్ల త్యాగం గురించి ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకున్నారు. పిల్లలు సైతం జై జవాన్ అంటూ దేశసేవలో జవాన్ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. కండ్ల ముందే తిరుగుతున్నట్టుంది చిన్నప్పటి నుంచి నా కొడుకులు ఎంతో కష్టపడి చదువుకున్నరు. తాడ్వాయికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. పెద్దోడు ఉద్యోగంలో చేరిన తరువాత మా కష్టాలు తీరినయి. ఆరేడేండ్లు ఉద్యోగం చేసిండో లేదో చనిపోయిండు. వాడు కనుమరుగై ఇరవై ఐదేండ్లవుతున్నా నా కండ్ల ముందర ఇంకా తిరుగున్నట్టే ఉంటది. యాది జేసుకోని రోజు ఉండది. ఊళ్లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేటోడు. రోజూ వాని ఫోటో చూసుకుంటూ ఇన్నేళ్లు గడిపినా. నా కొడుకు లెక్కనే ఉండే విగ్రహం అందరికీ తెలిసేలా పెట్టించాలనుకున్నా. అది ఇన్నాళ్లకి తీరింది. సైనికుడైన నా కొడుకు నాకే కాదు మా ఊరికి కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టిండు. – కంది నాగమణి, అమర జవాన్ సిద్దరాములు తల్లి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
సురక్షితంగా ఇంజనీర్ల విడుదల
-
సురక్షితంగా ఇంజనీర్ల విడుదల
విజయవాడ: అసోంలో కిడ్నాప్‌కు గురైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు సురక్షితంగా విడుదలయ్యారు. అసోంలోని బీమాన్‌పూర్‌లో వీరిద్దరిని ఈనెల 27వ తేదీన నాగాలాండ్ తీవ్రవాదులు విజయవాడలోని కరెన్సీనగర్‌కు చెందిన రఘు, ప్రదీప్‌చంద్రలను కిడ్పాప్ చేసిన విషయం తెలిసిందే. తీవ్రవాదులు వారిని సురక్షితంగా విడుదల చేశారు. మరో గంటలో వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటారు. తాము తీవ్రవాదుల చెర నుంచి విడుదలయ్యామని ఇంజనీర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. రత్నా కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో తీవ్రవాదులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రఘు, ప్రదీప్‌లు పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. వారిని విడుదల చేసేందుకు తీవ్రవాదులు తొలుత 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. గతంలో కూడా బోడో తీవ్రవాదులు అక్కడ పనిచేసే తెలుగు వారిని అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే. -
బోడో తీవ్రవాదుల నుంచి రాష్ట్ర ఇంజనీర్‌కు విముక్తి
చీరాల, న్యూస్‌లైన్: అసోంలో బోడో తీవ్రవాదులు బంధించిన రాష్ట్ర ఇంజనీర్ బత్తుల అంకమ్మరావు మంగళవారం విడుదలయ్యారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఆయన హైదరాబాద్‌కు చెందిన బొల్లినేని శీనయ్య నిర్మాణ సంస్థ తరపున అసోంలో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 22న బోడో తీవ్రవాదులు అంకమ్మరావును కిడ్నాప్ చేశారు. వెంటనే కంపెనీ ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలతో గాలించినా, ఆచూకీ లభించలేదు. అయితే, తొమ్మిది రోజులపాటు తమ చెరలో ఉంచుకున్న తీవ్రవాదులు అంకమ్మరావును మంగళవారం ఉదయం 4గంటల సమయంలో వదిలేశారు. అనంతరం అక్కడి సంస్థ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. తీవ్రవాదుల చెరలో ఉన్నప్పటి పరిస్థితిని వివరించారు. ‘‘డిసెంబర్ 22న సాయంత్రం విధులు ముగించుకుని వస్తున్న సమయంలో మాదర్పూర్ వద్ద ఆరుగురు బోడో తీవ్రవాదులు మా వాహనాన్ని ఆపారు. కళ్లకు గంతలు కట్టి ద్విచక్రవాహనంపై ఒక కిలోమీటర్ వరకు తీసుకెళ్లారు. తర్వాత మూడు గంటల పాటు అడవుల్లో నడిపించుకుని తీసుకెళ్లి ఒకచోట ఉంచారు. నాతో ఎవరూ మాట్లాడలేదు. వారంతా అర్థం కాని భాషలో వారే మాట్లాడుకుంటున్నారు. అందరి వద్దా ఆయుధాలున్నాయి. రోజూ రోటీలు, అన్నం పెట్టేవారు. స్నానం చేసేందుకు కూడా వీలు కల్పించారు. నాకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని వేడుకున్నాను. ఏమనుకున్నారో ఏమోగానీ మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో ఐఈ రివర్ బ్రిడ్జి వద్ద నన్ను వదిలి వెళ్లిపోయారు. దారి ఖర్చుల నిమిత్తం అరవై రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతో ఆటో ద్వారా మా కంపెనీ వాహనం వెళ్లే చెప్పగుడి ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ సంస్థ వాహనంలో హౌలీలోని కార్యాలయానికి చేరుకున్నాను. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కంపెనీ ప్రతినిధి భాస్కర్ నాతో మాట్లాడి మా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు’’ అని వివరించారు. అయితే, అంకమ్మరావుతోపాటు మరో ముగ్గురినీ బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసి.. అనంతరం వదిలివేసినట్లు సమాచారం. -
అసోంలో ఆంధ్రా ఇంజినీర్ కిడ్నాప్
అస్సాం: రాష్ట్రంలో ఆంధ్రా ఇంజినీర్ కిడ్నాప్ కు గురైయ్యాడు. బీఎస్ సీ కంపెనీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అంకన్రావు అనే ఇంజినీర్ ను బోడో తీవ్రావాదులు కిడ్నాప్ చేశారు. ఆ ఇంజినీర్ తోపాటు మరో ముగ్గురిని కూడా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఖైరాబరీలో నిన్న సాయంత్రం 4గంటల ప్రాంతంలోతమ విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా వారిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆ ముగ్గురిని వదిలిపెట్టారు. అంకన్రావును మాత్రం వారివద్దే బందీగా ఉంచినట్టు సమాచారం. కిడ్నాప్ కు గురైన అంకన్రావుది స్వస్థలం ప్రకాశం జిల్లా. ఇంజినీర్ ను విడుదలచేయాల్సిందిగా చాలా సంస్థలు కలిసి తీవ్రవాదులకు విజ్ఞప్తిచేశాయి. ఇంజినీర్ ను తీవ్రవాదుల చెరనుంచి రక్షించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, కొన్ని నెలల కిత్రం పైడిరాజు అనే ఇంజినీరింగ్‌ను కూడా బోడో తీవ్రావాదులు కిడ్నాప్ చేసి అనంతరం వదిలిపెట్టినట్టు తెలిసింది.