boeing 787 dreamliner
-
అంటార్కిటికాలో దిగిన అతిపెద్ద విమానం
నార్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్ అరుదైన ఘనత సాధించింది. అతి పెద్ద ప్యాసింజర్ విమానం బోయింగ్ 787ను అంటార్కిటికాలోని "బ్లూ ఐస్ రన్‌వే"పై సురక్షితంగా ల్యాండ్ చేసింది. నార్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం అంటార్కిటికాలోని ట్రోల్ ఎయిర్‌ఫీల్డ్‌లో దిగింది. 330 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల భారీ ఎయిర్‌క్రాఫ్ట్ అంటార్కిటికా ఖండానికి చేరుకోవడం ఇదే మొదటిసారి. "నార్స్కి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. అంటార్కిటికాలో ల్యాండ్ అయిన మొట్టమొదటి బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్. ఈ ఘనతతో నార్స్ ఓ మైలురాయిని చేరింది. ఇందుకు మేము గర్వంగా భావిస్తున్నాము" అని ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. "ట్రోల్ ఎయిర్‌ఫీల్డ్‌లో దిగిన అతిపెద్ద విమానం. దీంతో ఒకేసారి ఎక్కువ మందిని అంటార్కిటికాకు తీసుకెళ్లగలమని భావిస్తున్నాం.' అని డైరెక్టర్ కెమిల్లా బ్రెక్కే చెప్పారు. ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను జత చేస్తూ నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ ట్వీట్ చేసింది. Largest aircraft ever to land on #TrollAirfield! "This demonstrates our capability of performing more effective flight operations to #Antarctica by carrying a larger scientific/logistics crew, more cargo with a smaller environmental footprint", says NPI-director, Camilla Brekke, pic.twitter.com/7vjsSw0gPI — Norsk Polarinstitutt // Norwegian Polar Institute (@NorskPolar) November 16, 2023 అంటార్కిటికాలోని క్వీన్ మౌడ్ ల్యాండ్‌లోని రిమోట్ ట్రోల్ రీసెర్చ్ స్టేషన్‌కు అవసరమైన పరిశోధన పరికరాలు, శాస్త్రవేత్తలను తీసుకెళ్లడం ఎయిర్‌లైన్ డ్రీమ్‌లైనర్ లక్ష్యం. అంటార్కిటిక్ అన్వేషణకు అవసరమైన 12 టన్నుల పరిశోధన పరికరాలను విమానంలో తీసుకెళ్లారు. నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో సహా మొత్తం 45 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికా ఖండంలో విమానం ల్యాండ్ చేయడం సవాలుతో కూడి ఉంటుంది. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
హైదరాబాద్–లండన్ మధ్య నాన్‌స్టాప్ ఫ్లయిట్
హైదరాబాద్: ఎయిరిండియా హైదరాబాద్– లండన్ మధ్య నాన్‌స్టాప్ విమాన సరీ్వస్‌ను ప్రారంభించింది. తొలి విమానం గురువారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఇదే విమానం తిరిగి 10వ తేదీన (శుక్రవారం) లండన్ బయల్దేరి వెళుతుంది. 256 సీట్ల సామర్థ్యం (బిజినెస్క్లాస్ 18, ఎకానమీ క్లాస్ 238 సీట్లు) కలిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వారానికి రెండు సరీ్వసుల కింద ఎయిరిండియా నడపనుంది. హైదరాబాద్ నుంచి ప్రతీ సోమవారం, శుక్రవారం లండన్‌కు విమాన సరీ్వస్ ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణ సమయం 10.30 గంటలు. అదే లండన్ నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణ సమయం 9.20 గంటలుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా విమానాశ్రయాల నుంచి లండన్‌కు ఎయిరిండియా నాన్‌స్టాప్ సరీ్వసులను నిర్వహిస్తోంది. -
130 మిలియన్ డాలర్లు.. కొనేవాళ్లు లేక తిప్పలు
మెక్సికో సిటీ: గత ప్రభుత్వాల అవినీతికి నిదర్శనంగా నిలుస్తోన్న లగ్జరీ జెట్ ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్’ను అమ్మడానికి మెక్సికన్ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తోంది. సరైన కొనుగోలుదారు కోసం ఇన్ని రోజులు ఈ లగ్జరీ జెట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉంచారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి విమానాన్ని కొనడానికి ఎవరూ ఆసక్తి చూలేదు. ఈ క్రమంలో విమానాన్ని తిరిగి మెక్సికోకు రప్పించినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు. అంతేకాక ఈ లగ్జరీ విమానాన్ని మెక్సికో వాసులకే అమ్మాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మెక్సికో నగరంలోని బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు అక్కడి టెలివిజన్ చానెల్స్‌లో ప్రసారం అయ్యాయి. 2012లో ఈ జెట్‌ను మాజీ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీన్ని 80 మంది ప్రయాణించేలా పునర్నిర్మించారు. బాత్రూమ్లను పాలరాయితో నిర్మించారు. ప్రస్తుతం దీనిలో ఒక ప్రెసిడెంట్ సూట్, ప్రైవేట్ బాత్ ఉన్నాయి. (ప్రధాని కోసం ప్రత్యేక విమానం) ఐక్యరాజ్య సమితి ఈ విమానం ఖరీదును 130మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఇంతకంటే తక్కువ ధరకు అమ్మడానికి లోపెజ్ ఒబ్రాడోర్ ఇష్టపడకపోవడంతో ఈ లగ్జరీ జెట్‌ను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని దక్షిణ కాలిఫోర్నియాలో ఖాళీగా ఉంచితే.. విలువ పడిపోతుందని భావించి.. తిరిగి దాన్ని మెక్సికోకు రప్పించారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి విమానాన్ని కొనడానికి ఆసక్తి చూపించాడని లోపేజ్ ఒబ్రాడోర్ తెలిపారు. సదరు వ్యక్తి ఈ జెట్ కోసం 120 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. ఇప్పటికే కొంత ముందస్తు చెల్లింపు కూడా చేశాడని సమాచారం. మెక్సికోలో సగం పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. (మెక్సికో లేడీ డాన్ ఆఖరి క్షణాలు....) ఇలాంటి సమయంలో కరోనా ఆ దేశ పరిస్థితులను మరింత దిగజార్చింది. ఆస్పత్రుల్లో తగినన్ని ఔషధాలు అందుబాటులో లేవు. అంతేకాక కరోనా మరణాల సంఖ్యలో మెక్సికో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ఈ లాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీ విమానం వల్ల దేశానికి ఎలాంటి లాభం లేదని భావించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. ఈ లగ్జరీ జెట్‌లో ఓ రాఫెల్ విమానం కూడా ఉన్నట్లు సమాచారం. -
ఇక విమానాల్లో సుఖ ప్రయాణం
న్యూయార్క్: ఒకప్పటితో పోలిస్తే విమాన చార్జీలు తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గాయి. అయినా ప్రయాణికుల ఫిర్యాదులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇరుకైన సీట్లలో సర్దుకోలేక సతమతమవడం, సీటు హ్యాండిల్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయాణికులు ఒకరి మోచేతులను ఒకరు తోసేసుకోవడం, చంటి పిల్లల ఏడుపులను భరించలేక పోతున్నామంటూ గోల చేయడం తరచు బయటకు వినిపించే ఫిర్యాదులు. విమాన ప్రయాణ బడలికను ప్రయాణికులు అనుభవిస్తారేగానీ పెద్దగా బయటకు మాట్లాడరు. తలనొప్పి రావడం, కళ్లుతిరగడం, కళ్లు మండడం, వాంతివచ్చినట్లవడం, నోరు ఎండిపోవడం, ఊపిరాడకపోవడం, అన్నీ కలిసి భరించలేని అసహనం కలగడం, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలను వైమానిక పరిభాషలో ‘జెట్ ల్యాగ్’ అని పిలుస్తారు. కమర్షియల్ విమానంలో, ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే విమానాల్లో ప్రతి ప్రయాణికుడికి ఇలాంటి సమస్యలు తప్పవు. సముద్రం లేదా నేలకు అత్యంత ఎత్తులో విమానాలు ప్రయాణిస్తాయి కనుక అంత ఎత్తులో ఉండే వాతావరణం ఒత్తిడి కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. 3,800 అడుగులు ఎత్తులో విమానం ప్రయాణిస్తున్నప్పుడు విమానం లోపల 8,000 అడుగుల ఎత్తులో ఉండే ఒత్తిడి ప్రయాణికులపై పడుతుంది. అంటే ఎనిమిదివేల అడుగుల ఎత్తులో ఉన్న బొగోటా, కొలంబియా పర్వతాల్లో లేదా కొలరాడోలోని స్కై రిసార్ట్‌లో ఉండే వాతావరణ పరిస్థితి విమానంలో కూడా ఉంటుంది. తలనొప్పి, ఊపిరి పీల్చుకోవడం లాంటి జెట్ ల్యాగ్ సమస్యలు అక్కడికెళ్లే పర్యాటకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి విమానాల్లో ఇలాంటి సమస్యల నుంచి విముక్తి లేదా? ఇలాంటి సమస్యలను కొత్త తరం విమానాలు ఎక్కువ వరకు అధిగమించాయి. ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ 350’ విమానాలు ఆ కోవకు చెందినవే. వీటిలో సీట్లు విశాలంగా సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా 18 గంటలపాటు ఏక బిగినా ప్రయాణించినా ప్రయాణికులకు ‘జెట్ ల్యాగ్’ సమస్యలు పెద్దగా ఎదురుకావు. ఈ విమానాలు 3,800 అడుగుల ఎత్తులో ప్రయాణించినప్పటికీ విమానం లోపల 6000 అడుగుల ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితులే ఉంటాయి. అందుకు కారణం విమానాల నిర్మాణంలో కార్బన్‌తో బలోపేతం చేసిన తేలికైన పటిష్టమైన ప్లాస్టిక్ పరికరాలతోపాటు హైటెక్ మెటీరియల్ ఉపయోగించడమే. ఈ విమానాల్లో కావాల్సిన మేరకు తేమ ఉండడం కూడా మరో విశేషం. గాలిలో తేమను ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక పరికరాలేమీ లేవు. ప్రయాణికుల శ్వాస నుంచి ఉత్పన్నమయ్యే తేమనే ఉంటుంది. మామాలు కమర్షియల్ విమానాల్లోనైతే ఈ తేమ వల్ల పరికరాలు పాడవుతాయి. మరమ్మతులు అవసరమవుతాయి. కొత్తతరం విమానాల్లో కార్బన్‌తో తయారు చేసిన ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వల్ల తేమ వల్ల ప్రమాదం లేదు. అయితే ఈ కొత్త విమానాలు అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలంటే మరో దశాబ్దం పాటు నిరీక్షించాల్సిందే. ఎయిర్‌బస్ ఏ 350 విమానాల కోసం ఇప్పటివరకు ప్రపంచ దేశాలు 810 అర్డర్లను మాత్రమే ఇచ్చాయి. వీటిలో 67 ఆర్డర్లు ఒక్క సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చినవే. ఇక 787 విమానాల కోసం ప్రపంచ దేశాలు 1200 విమానాల కోసమే ఆర్డర్లు ఇచ్చాయి.