bomb exploded
-
విశాఖ శ్రీకృష్ణపురంలో నాటు బాంబు పేలుడు
-
మణిపూర్ వర్సిటీ వద్ద బాంబు పేలుడు
ఇంపాల్: మణిపూర్లో మరో బాంబు పేలుడు సంభవించింది. అంతకుముందు బాంబుపేలుడు చోటుచేసుకొని గంటలు కూడా గడవకముందే మరో బాంబు పేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈసారి ఇంపాల్ లోని మణిపూర్ యూనివర్సిటీ వద్ద బాంబు పేలుడు సంభవించింది. రిమోట్ ద్వారానే ఈ రెండు బాంబు పేలుడ్లు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మాపౌ అనే గ్రామం వద్ద బీఎస్ఎఫ్ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనూహ్యంగా బాంబు పేలింది. అయితే, ఈ దాడి నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు తప్పించుకోగా.. నాలుగేళ్ల పాపకు మాత్రం గాయాలయ్యాయి. రెండోసారి బాంబు దాడి మాత్రం యూనివర్సిటీ వద్ద సంభవించింది. ఈ ఘటన సమయంలో విద్యార్థులంతా క్లాస్ రూముల్లోనే ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ప్రాథమిక సమాచారం. -
ఎమ్మెల్యే ఇంటిముందు బాంబు పేలుడు
ఇంపాల్: మణిపూర్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటి ముందు భారీ విస్ఫోటనం సంభవించింది. ఎమ్మెల్యే కరం తామర్ జిత్ సింగ్ ఇంటి గేటు ముందు బుధవారం శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో భయానక వాతావరణం నెలకొంది. అయితే ఆందోళనకు గురిచేసిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కెయిరో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
బంతి అనుకుని బాంబు వేశాడు.. ముగ్గురికి గాయాలు
కోల్ కతా : స్కూలు ఆవరణలో ఓ బాంబు పేలడంతో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బుర్ధ్వాన్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాయపడిన వారు ఐదేళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం... బుర్ధ్వాన్ జిల్లా ఖందఘోష్ లోని దహుకా గిరిష్ ప్రాథమిక పాఠశాల పైకప్పు మీదికి శుక్రవారం కొందరు విద్యార్థులు ఎక్కారు. ఇంటి పని నిమిత్తం పక్కనే ఉండే పాఠశాలపైకి విద్యార్థులు ఎక్కినట్లు తెలుస్తోంది. అందులో ఓ విద్యార్థి స్కూలు పైభాగంలో ఓ బ్యాగులో బాంబులను చూశాడు. అయితే అవి గుండ్రంగా బంతిలా ఉండటంతో ఆడుకునే బంతి అని ఆ విద్యార్థి భావించాడు. పైనుంచి ఓ బాంబును కిందకి విసిరాడు. స్కూలు ఆవరణలో భారీ శబ్దం చేస్తూ బాంబు పేలింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే బుర్ధ్వాన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం స్కూలు పైభాగంలో మరో రెండు బాంబులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
న్యూఇయర్ వేడుకల్లో విషాదం: ఆరుగురు మృతి
మనీలాలో నూతన సంవత్సరం వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్ బసిలాన్ ప్రావెన్స్లోని సుమిసిప్ పట్టణం సమీపంలోని తుముబంగ్ పెరిష్ చర్చిలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో నిన్న రాత్రి బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో క్షతగాత్రులను హుటాహుటిన సైనిక హెలికాఫ్టర్లో జమ్బోగాలోని 64వ సైనిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.