Bomb explosions
-
ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం
Disabling Bomb Their bare hands and just a bottle of water: ఉక్రెయిన్ రష్యా మధ్య పోరు నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. ఒక వైపు రష్యా విదేశీయుల తరలింపు నిమిత్తం కాల్పుల విరమణ ప్రకటిస్తూనే మరోవైపు నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఉక్కెయిన్ చాలా ఘోరంగా అతలాకుతలమైపోతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమ దేశాన్ని తమ ప్రజలను రక్షించుకుంటామంటూ తమ దేశ భక్తిని చాటుతున్నారు. మరోవైపు సైనికులు కూడా తమవంతుగా ప్రాణాలను లెక్కచేయకుండా రష్యా బలగాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అత్యంత ధైర్య సాహసాలతో రష్యా సైన్యాన్ని నిలవరించడమే కాక రష్యా దాడులను తిప్పికొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందులో భాగంగా ఉక్రేనియన్ పేలుడు ఆర్డినెన్స్ డిస్పోజల్ స్పెషలిస్ట్‌ల బృందం తమ దేశంలో పేలకుండా పడి ఉన్న బాంబులను కేవలం ఉత్తి చేతులతో వాటిని నేరుగా తీసి, వాటర్ బాటిల్‌తో నిర్విర్యం చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమ దేశ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ బాంబులను నిర్విర్యం చేస్తున్న తీరుని చూస్తే మనసు చలించుపోతుందంటూ వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ వాసులు సైతం రష్య యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడి మా దేశంలోకి రావద్దంటూ నినాదాలు చేసి మరీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. This #Russia-dropped bomb would flatten a building — and yet these #Ukraine EODs defuse it with 2 hands and a bottle of water, while shells audibly land nearby. Mind boggling bravery.pic.twitter.com/KvCZeOxRyz — Charles Lister (@Charles_Lister) March 9, 2022 (చదవండి: చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!) -
ముమ్మరంగా తరలింపు!
కాబూల్: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మరిన్ని పేలుళ్లు జరుగుతాయన్న భయంతో పలు దేశాలు అఫ్గాన్‌లోని తమ ప్రజలను వెనక్కురప్పించే యత్నాలను ముమ్మరం చేశాయి. పేలుడు అనంతరం మూతపడిన విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రాకపోకలు ఆరంభమయ్యాయి. బాంబుల భయం తీరకపోయినా, విమానాశ్రయం బయట వందలాదిమంది గుంపులుగా దేశం విడిచి పోయేందుకు ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆగస్టు 31నాటికి యూఎస్ దళాలు అఫ్గాన్ నుంచి వైదొలగనున్నాయి. అనంతరం ఏమైతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో అఫ్గాన్ ప్రజానీకం ఉంది. అందుకే ఈలోపే ఏదో ఒక దేశానికి పారిపోవాలని పలుమంది విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్నారు. కాబూల్ నుంచి దాదాపు లక్షకు పైగా ప్రజలను సురక్షితంగా వేర్వేరు ప్రదేశాలకు తరలించామని అమెరికా ప్రకటించింది. ఇంకా వేలాది మంది పారిపోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. విదేశాలకు పోయే అవకాశం లేని పౌరులు దేశ సరిహద్దులకు చేరుకొని పొరుగు దేశాల్లో తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే నెలల్లో దాదాపు 5లక్షల మంది అఫ్గాన్ సరిహద్దు దేశాలకు శరణార్థులుగా పోవచ్చని యూఎస్ మిలటరీ అంచనా వేసింది. నిశితంగా గమనిస్తున్నాం: భారత్ ఆపరేషన్ దేవి శక్తి పేరిట ఆఫ్గానిస్తాన్‌లోని భారతీయుల తరలింపు ప్రక్రియను ఇండియా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆరు భారత విమానాలు ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 550 మందిని స్వదేశానికి తెచ్చాయి. వీరిలో దాదాపు 260మంది భారతీయులున్నారు. వీరితో పాటు అర్హులైన అఫ్గాన్ పౌరులను కూడా భారత్ సురక్షితంగా తరలించిందని, ఇంకా తరలింపు కొనసాగుతోందని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని, అఫ్గాన్‌లోని అన్ని వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. అఫ్గాన్‌లో మిగిలిన భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చడంపైనే శ్రద్ధ పెట్టామన్నారు. దాదాపు 20మంది భారతీయులు, కొందరు అఫ్గాన్ జాతీయులు అనుకున్న సమయానికి విమానాశ్రయానికి రాలేకపోయారని, వీరిని తరలించే యత్నాలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఏ దేశం ఏం చేస్తోంది? అమెరికా: యూఎస్ పౌరుల తరలింపును మరిం త వేగవంతం చేసింది. త్వరలో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని యూఎస్ అధికారి ఫ్రాంక్ మెకంజీ చెప్పారు. డెడ్‌లైన్ కల్లా తరలింపును పూర్తి చేస్తామన్నారు. కాబూల్ విమానాశ్రయంలో ఇంకా దాదాపు 5,400మంది తరలింపునకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 24గంట ల్లో దాదాపు 12,500కు పైచిలుకు పౌరులను 89 విమానాల్లో తరలించామన్నారు. బ్రిటన్: అఫ్గాన్ నుంచి తమ బలగాల తరలింపు ప్రక్రియ ముగిసిందని బ్రిటన్ ప్రకటించింది. శుక్రవారం 9 విమానాలతో తరలింపును పూర్తి చేశామని తెలిపింది. అఫ్గాన్లతో కలిపి మొత్తం 14 వేల మందిని దేశం దాటించామని పేర్కొంది. ఇంకా 150 మంది బ్రిటన్ పౌరులు కాబూల్‌లో చిక్కుకుపోయారని ప్రధాని జాన్సన్ తెలిపారు. స్వీడన్: ఇప్పటివరకు దాదాపు 500 మంది స్వీడిష్ పౌరులతో సహా 1,,100మందిని అఫ్గాన్ నుంచి తీసుకువచ్చామని తెలిపింది. ఇటలీ: అఫ్గాన్ నుంచి 108మందితో కూడిన చివరి తరలింపు విమానం రోమ్కు చేరినట్లు ఇటలీ ప్రకటించింది. శుక్రవారానికి దాదాపు 4,900మంది అఫ్గాన్ పౌరులను దేశం దాటించామంది. ఫ్రాన్స్: శుక్రవారం రాత్రికి ఫ్రెంచ్ దేశీయుల తరలింపు పూర్తి కావచ్చని ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్: అఫ్గాన్ నుంచి తమ దేశీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని స్పెయిన్ తెలిపింది. సుమారు 1,900మంది అఫ్గాన్ పౌరులను కూడా తమ దేశానికి తెచ్చామంది. జర్మనీ: 45 దేశాలకు చెందిన దాదాపు 5,347 మందిని సురక్షితంగా సరిహద్దు దాటించామని, గురువారం తమ చివరి రెస్క్యూ విమానం అఫ్గాన్ నుంచి బయటపడిందని తెలిపింది. టర్కీ: కాబూల్ విమానాశ్రయాన్ని నిర్వహిం చాల్సిందిగా తాలిబన్లు తమను కోరారని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. -
కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి!
కాబూల్: భయపడినంతా జరిగింది. కాబూల్ రక్తమోడింది. దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గాన్ల లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం చీకటి పడుతున్న వేళ ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ రెండు బాంబుపేలుళ్లలో 100 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 90 మంది అఫ్గాన్ జాతీయులే ఉండగా, 13 మంది వరకూ అమెరికా దేశానికి చెందిన వారు ఉన్నారు. చదవండి: ఇటలీ విమానంపై కాల్పులు విమానాశ్రయంలో పేలుడు దృశ్యం ఇది ఇస్లామిక్ స్టేట్ – ఖోరాసన్ (ఐసిస్–కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని... సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్ దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడితో పాటు విమానాశ్రయానికి వచ్చిన వారిపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం అందుతోంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని... బిక్కుబిక్కుమంటూ విమానాశ్రయంలోకి ప్రవేశం కోసం వేచిచూస్తున్న అఫ్గాన్లు, విదేశీయులు ఈ దాడితో తీవ్రంగా భయకంపితులయ్యారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. చదవండి: అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది రక్తమోడుతున్న ఓ అఫ్గాన్ పౌరుడు విమానాశ్రయం ప్రధాన ద్వారం అబే గేటు వద్ద రాత్రి 6.45 గంటలకు తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ వేల సంఖ్యలో జనం గుమిగూడి ఉండటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. సాధారణ పౌరులతో పాటు అమెరికా భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 11 మంది అమెరికా మెరైన్ దళ సభ్యులు, వైద్య బృందంలో ఒకరు కలిపి మొత్తం 12 మంది అమెరికా సిబ్బంది చనిపోయారని అమెరికా ధ్రువీకరించింది. రెండోదాడి అబే గేటుకు సమీపంలోకి బారన్ హోటల్ గేటు వద్ద రాత్రి 8 గంటలకు జరిగింది. ఇక్కడ 52 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాబూల్ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ఇప్పటిదాకా 60 మంది క్షతగాత్రులు చేరారు. పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ అమెరికన్ భద్రతా సిబ్బంది మరణించినట్లు, గాయపడ్డట్లు ధ్రువీకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం విమానాశ్రయం గేటు వద్ద జరిగిన పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించారని, క్షతగాత్రులయ్యారని ప్రత్యక్షసాక్షి అదమ్ ఖాన్ తెలిపారు. చాలామంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయన్నారు. గాయపడ్డ మహిళలు రక్తమోడుతూ రోదించడం, చిన్నారుల ఆక్రందనలతో సంఘటనా స్థలం వద్ద భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానాశ్రయం ప్రహరీగోడను ఆనుకొని ఉన్న మురికి కాలువలో దిగి... అమెరికా బలగాలను తమను లోనికి అనుమతించాలని బతిమాలుతున్న అఫ్గాన్లపై ఆత్మాహుతి బాంబర్ దూసుకెళ్లి పేల్చి వేసుకున్నాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నిఘా, భద్రతావర్గాలు తాజా పరిస్థితిని వివరించాయి. బైడెన్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విమానాశ్రయం అమెరికా బలగాల అధీనంలోనే ఉందని, లోపల య«థావిధిగా తరలింపు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని పెంటగాన్వర్గాలు చెప్పాయి. అమెరికా అధీనంలోని ప్రాంతంలోనే: తాలిబన్లు ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు. ఈ బాంబుపేలుళ్లు అమెరికా నియంత్రిత ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. తాము ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని... ఎయిర్పోర్ట్ భద్రతపై నిశితంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌ను స్థావరంగా వాడుకోవడానికి అనుమతించబోం’ అని జబీహుల్లా ప్రకటించారు. ఐసిస్ ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని తామే అమెరికాను హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు, వెయ్యిమంది దాకా బ్రిటన్ సైన్యం, ఇతర నాటో దళాలు ఉన్నాయి. ఆగస్టు 31వ తేదీలోగా ఈ బలగాల ఉపసంహరణ పూర్తికావాలని... గడువు పొడిగించే సమస్య లేదని తేల్చిచెప్పిన తాలిబన్లు... విమానాశ్రయం అన్ని వైపుల నుంచీ మోహరించి ఉన్నారు. ఒప్పందం మేరకు విమానాశ్రయం లోనికి వెళ్లే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న అఫ్గాన్లను అడ్డుకుంటున్నారు. ఇళ్లకు తిప్పిపంపేస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వేలాదిగా విమానాశ్రయానికి తరలివస్తున్న అఫ్గాన్లను చెదరగొడుతున్నారు. గురువారం వీరిపై వాటర్ క్యానన్లను కూడా ప్రయోగించారు. ఆయుధాలు చేజిక్కించుకొని... ఐసిస్(కె) కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. తాలిబన్లను మించి ఇస్లామిక్ అతివాద భావజాలం. ఐసిస్‌కు తాలిబన్లతో తీవ్రవైరముంది. అంతర్జాతీయ ప్రకంపనలు సృష్టించడం, తాలిబన్లను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడం లక్ష్యంగా ఐసిస్ ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనపడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న క్రమంలో ఆయా ఫ్రావిన్సుల్లోని జైళ్లలో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేశారు. వీరిలో తాలిబన్లతో పాటు ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు. వీరందరూ బయటపడి... అస్త్రసన్యాసం చేస్తున్న అఫ్గాన్ సైనికుల ఆయుధాలను చేజిక్కించుకున్నారని... కొద్దికాలంలోనే బాగా బలపడ్డారని తెలుస్తోంది. ఆగస్టు 31లోగా బలగాల ఉపసంహరణ పూర్తిచేస్తామని, ఆలోగా హమీద్ కర్జాయ్ విమానాశ్రయం జోలికి రావొద్దని అమెరికా – తాలిబన్లతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ, భద్రతా చానళ్ల ద్వారా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... అమెరికన్లను, నాటో దళాలకు సహాయపడ్డ అఫ్గాన్లను ఆగమేఘాలపై తరలిస్తోంది. గడువు సమీపిస్తున్న కొద్దీ తరలింపులో వేగం పెంచింది. చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్లిఫ్ట్గా భావిస్తున్న ఆపరేషన్‌లో మంగళవారం 19 వేల మందిని, బుధవారం 13,400 మందిని సురక్షితంగా కాబూల్ బయటకు తరలించింది. 4,500 మంది అమెరికన్లను తరలించగా... మరో 1,500 మంది అమెరికన్లు ఇంకా కాబూల్‌లోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ గురువారం చెప్పారు. భారతీయులందరినీ తరలిస్తాం అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జై శంకర్ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయి ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులు సంక్లిష్టంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో జై శంకర్ విపక్ష నాయకులకు అఫ్గాన్‌లో పరిస్థితుల్ని వివరించారు. ఈ భేటీకి 31 పార్టీల నుంచి 37 మంది నాయకులు హాజరయ్యారు. జై శంకర్‌తో పాటుగా కేంద్రమంత్రి, రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయెల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఇక విపక్షాల నుంచి ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్, డీఎంకేకు చెందిన టి.ఆర్.బాలు తదితరులు హాజరయ్యారు. అనంతరం జైశంకర్ మాట్లాడారు. అఫ్గాన్‌లో పరిస్థితులు చక్కబడే వరకు తాలిబన్ల పట్ల కేంద్రం తన వైఖరిపై ఒక నిర్ణయానికి రాలేదని అన్నారు. ‘మా ముందున్న అతి పెద్ద కార్యక్రమం భారతీయులందరినీ తరలించడం. అఫ్గాన్‌తో స్నేహసంబంధాలను కొనసాగించడమూ మా ముందున్న లక్ష్యం’ అని జై శంకర్ ట్వీట్ చేశారు. -
అస్సాంలో బాంబు పేలుళ్లు
గువాహటి: అస్సాంలో గణతంత్ర దినోత్సవ రోజు ఉదయం సమయంలో నాలుగు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ బాంబులను తామే అమర్చినట్లు నిషేధిత మిలిటెంట్ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం– ఇండిపెండెంట్ (యూఎల్ఎఫ్ఏ–ఐ) ఆదివారం ప్రకటించింది. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదు. అయితే గణతంత్ర వేడుకలు జరుపుకోవద్దంటూ పరేశ్ బారువా నేతృత్వంలోని యూఎల్ఎఫ్ఏ–ఐ సహా పలు సంస్థలు ముందే ప్రకటనలు జారీ చేశాయి. చారైడియో జిల్లాలో ఓ బాంబు పేలుడు జరగ్గా, దిబ్రూగఢ్ జిల్లాలో మూడు బాంబుపేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఉదయం 8:15 నుంచి 8:25 గంటల్లోపే నాలుగు పేలుళ్లు జరిగా యి. ఇందులో ఒక పేలుడు పోలీస్ స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో జరగడం గమనార్హం. బైక్‌పై వచ్చిన యువకులు గ్రెనేడ్లను ఉంచడం సీసీటీవీల్లో నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవా ల్ ఈ పేలుళ్లను ఖండించారు. ప్రజల చేత తిరస్కారానికి గురైన ఉగ్రసంస్థలు చేసిన పేలుళ్లు అంటూ మండిపడ్డారు. బాధ్యులపై తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ట్విట్టర్ ద్వారా స్పష్టంచేశారు. -
వ్యాపారవేత్త ఇంటి నుంచే ప్రణాళిక
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ రోజున వరుస బాంబు పేలుళ్ల వ్యవహారంలో కొత్త అంశాలు తెరమీదకొచ్చాయి. ఆత్మాహుతి దాడులకు శ్రీలంకలోని ప్రముఖ సుగంధద్రవ్యాల వ్యాపారవేత్త ఇల్లు కేంద్రంగా పనిచేసిందని అధికారులు గుర్తించారు. కొలంబో కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవేత్త మొహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం ఇద్దరు కుమారులు ఈ దాడిలో పాల్గొన్నారు. వీరిలో ఒకరు షాంగ్రీలా హోటల్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు సినమన్ హోటల్ వద్ద తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. దాడులకు అవసరమైన పేలుడు పదార్థాలను ఇక్కడే భద్రపరిచారన్నారు. ఈ ఉగ్రమూకకు జహ్రన్ హషీమ్(40) అనే ఉగ్రవాది నేతృత్వం వహించాడని చెప్పారు. ఉగ్రదాడులు జరిగిన అనంతరం ఇబ్రహీం ఇంట్లో తనిఖీల కోసం పోలీసులు రాగానే ఇబ్రహీం కోడలు పేలుడు పదార్థాలను పేల్చేసింది. దీంతో ఆమెతో పాటు పోలీస్ అధికారులు చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త యూసుఫ్ ఇబ్రహీంను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు. అందరూ విద్యావంతులే.. ఈ ఉగ్రదాడిలో మొత్తం 9 మంది ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి విజేవర్ధనే తెలిపారు. అంతేకాకుండా వీరంతా బాగా చదువుకున్నవారేనని వ్యాఖ్యానించారు. ‘ఆత్మాహుతిదాడికి పాల్పడ్డవారిలో ఒకరు బ్రిటన్‌లో చదువుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఈ దారుణానికి తెగబడ్డ తొమ్మిది మందిలో 8 మందిని ఇప్పటికే గుర్తించాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరి వివరాలను ఇప్పుడే బయటపెట్టలేం’ అని వెల్లడించారు. శాంతిభద్రతలు అదుపులోకివచ్చేవరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని విజేవర్ధనే పేర్కొన్నారు. కాగా, షాంగ్రీలా హోటల్‌పై ఏప్రిల్ 21న అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ బీబీసీ తెలిపింది. లతీఫ్ 2006–07 మధ్యకాలంలో బ్రిటన్‌లోని కింగ్స్టన్ విశ్వవిద్యాయలంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేశాడని వెల్లడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇతను, అక్కడ మాస్టర్స్ పూర్తిచేసినట్లు పేర్కొంది. శ్రీలంక పేలుళ్లకు తమిళనాడులో కుట్ర? సాక్షి ప్రతినిధి, చెన్నై: పేలుళ్లకు సంబంధించిన కీలక సూత్రధారి ఒకరు కోయంబత్తూర్ వచ్చిరనే సమాచారంతో ఎన్ఐఏ, ఎస్ఐసీ పోలీసులు రహస్యంగా విచారించారు. కోయంబత్తూరులో హిందూ సంస్థల నేతలను హతమార్చేందుకు కుట్రపన్నిన స్థానికులు ఇద్దరు, చెన్నైకి చెందిన నలుగురిని గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్ సానుభూతి పరులుగా తేలడంతో ఈ కేసును ఎన్ఐఏ విచారణకు అప్పగించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు అరెస్టైన వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి పెన్ డ్రైవ్‌లను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన ఐసిస్ సానుభూతి పరులైన ఆ ఆరుగురిని శుక్రవారం మరోసారి ఎన్ఐఏ అధికారులు విచారించి కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. -
చీకటి రోజుకు పదేళ్లు
∙ ఇంకా పరారీలోనే ప్రధాన సూత్రధారి రియాజ్ ∙ నిందితులపై కొనసాగుతున్న విచారణ సిటీబ్యూరో: లుంబినీపార్క్, గోకుల్చాట్ల్లో జంట పేలుళ్లు చోటు చేసుకుని శుక్రవారం నాటికి పదేళ్లు పూర్తయింది. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో 41 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 300 మంది వరకు క్షతగాత్రులయ్యారు. వీరిలో అనేక మంది ఇప్పటికీ జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. అదే రోజున దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ పేలని బాంబునూ స్వాధీనం చేసుకున్నారు. ఉదంతం చోటు చేసుకున్న 14 నెలలకు ఈ ఘాతుకాని ఒడిగట్టింది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులుగా తేల్చిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రాష్ట్ర ఆక్టోపస్ అధికారులు ఈ ఘాతుకంపై చార్జ్‌షీట్ సైతం దాఖలు చేశారు. ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్న ఈ కేసును ఇంటెలిజెన్స్ ఆధీనంలోని సీఐ సెల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ‘ట్విన్ బ్లాస్ట్’ క్రమం ఓసారి పరిశీలిస్తే... 25.8.07 సాయంత్రం 7–7.30 గంటల మధ్య లుంబినీ పార్క్, గోకుల్ఛాట్ల్లో షేప్డ్ బాంబులు పేలాయి. వెంకటాద్రి థియేటర్ వద్ద ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద ఓ పేలని బాంబు కూడా దొరికింది. 27.8.07 ఊహా చిత్రాలు రూపొందించి దాదాపు 130 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. రెండు కుట్రలు వెలుగులోకి రావడంతో కొందరిపై ఆ కేసులు నమోదు చేశారు. 10.1.08 హైదరాబాద్‌కు చెందిన రజీయుద్దీన్ నాసిర్‌ను కర్ణాటకలోని దావళగెరె పోలీసులు అరెస్టు చేశారు. అయితే జంట పేలుళ్లపై ఎలాంటి క్లూ లభించలేదు. 6.10.08 ఢిల్లీ ఎన్కౌంటర్లో దొరికిన లీడ్స్‌పై దర్యాప్తు చేపట్టిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ మొత్తం ఇండియన్ ముజాహిదీన్ గుట్టు విప్పింది. 2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసు కొలిక్కి వచ్చింది. 30.11.08 ఉగ్రవాదంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) రూపుదిద్దుకున్న ఏడాది తరవాత అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. 1.2.09 జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్లో అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్షా షేక్‌లను పీటీ వారెంట్ పై ముం బయి నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. 9.2.09 దర్యాప్తులో కీలక ఘట్టమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించారు. లుంబినీ పార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్తో పాటు ఇతనితో కలిసి హబ్సిగూడలోని బంజారా నిలయంలో బస చేసిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలను సాక్షులు గుర్తించారు. 25.3.09 జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆక్టోపస్ అధికారులు హైదరాబాద్ తరలించారు. అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్సా షేక్‌లను 2009 ఫిబ్రవరిలోనే తీసుకురాగా... ఐఎం కో–ఫౌండర్ సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ తర్ఖాష్‌లను పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి తదుపరి దర్యాప్తు జరిపారు. 15/28.5.09, – 20.6.09 జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులనూ దర్యాప్తు చేసిన ఆక్టోపస్ అధికారులు అనేక కీలక ఆధారాలు సేకరించి నాంపల్లి కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేశారు. వీటిలో లుంబినీపార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్, గోకుల్‌చాట్‌లో ఐస్‌క్రీమ్ డబ్బాపై బాంబు పెట్టిన రియాజ్ భత్కల్, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన అక్బర్‌లతో పాటు ఇక్బాల్ భత్కల్, ఐఎం ఫౌండర్ అమీర్ రజా ఖాన్, ఫారూఖ్ తర్ఖాష్, సాదిక్ షేక్‌లను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో రియాజ్, ఇక్బాల్, అమీర్ రజా ఇప్పటికీ పరారీలో ఉన్నారు. సీఐ సెల్‌కు కేసు బదిలీ ఆక్టోపస్‌ను పూర్తి స్థాయి కమాండో ఫోర్స్‌గా మార్చిన తర్వాత ఈ కేసుల్ని ఉగ్రవాద వ్యతిరేక విభాగం సీఐ సెల్‌కు బదిలీ చేశారు. ఈ వి«భాగం పర్యవేక్షిస్తున్న ఏకైక కేసు ఇదే కావడం గమనార్హం. ఐఎం ఉగ్రవాదులపై దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉండటంతో ఆయా అధికారులు తీసుకువెళ్ళడం, తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణకు సమయం పడుతోంది. -
ఇరాక్‌లో జంట పేలుళ్లు: 31 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్లలో 31 మంది మరణించారు. తొలిదాడిలో...సోమవారం రాత్రి కరాదాలో రద్దీగా ఉండే ఐస్‌క్రీం దుకాణంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో 17 మంది చనిపోగా, 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు దుకాణం బయట సాయం కోసం అర్థిస్తున్న దృశ్యాలు కనిపించాయి. రెండో సంఘటనలో... మంగళవారం షవాకా ప్రాంతంలోని ప్రభుత్వ పింఛను కార్యాలయం సమీపంలో బాంబులు అమర్చిన కారు పేలడంతో 14 మంది మరణించగా 37 మంది గాయాలపాలయ్యారు. రెండు దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. షియా ముస్లింలే లక్ష్యంగా పేలుళ్లు జరిపినట్లు పేర్కొంది. -
నెత్తుటి చరితకు పదేళ్లు
►మక్కా మసీదు వద్ద భద్రత కట్టుదిట్టం ►ర్యాలీలకు అనుమతి లేదంటున్న పోలీసులు చార్మినార్: మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగి గురువారం నాటికి పదేళ్లు (2007)పూర్తవుతున్నాయి.ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా 20మంది గాయపడ్డారు. దీంతో దక్షిణ మండల పోలీసులు నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) స్వాతి లక్రా ఆధ్వర్యంలో ఐదుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 50 మంది ఇన్స్పెక్టర్లు, 100 మందికి పైగా ఎస్ఐలు, రెండు కంపేనీల ఆర్ఏఎఫ్, 20 ప్లటూన్ల టీఎస్ఎస్పీ బలగాలతో పర్యవేక్షించనున్నాయని అదనపు డీసీపీ బాబురావు తెలిపారు. నిరసన సభలు, ర్యాలీలకు అనుమతి లేదు పాతబస్తీలో ఎక్కడా ఎలాంటి నిరసన సభలు,ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎవరికీ అనుమతి లేదని దక్షిణ మండల అదనపు డీసీపీ బాబురావు తెలిపారు. కీలకమైన అన్ని ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామన్నారు. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేయడంతో పాటు సామూహిక ప్రార్థనలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2007 మే 18 పేలుళ్లను దృష్టిలో పెట్టుకొని 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి మైనార్టీ సంక్షేమ శాఖ నిధులను మంజూరయ్యాయి. త్వరలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. -
టర్కీ పేలుళ్లలో 14 మంది మృతి
అంకారా: వరుస బాంబు పేలుళ్లతో టర్కీ దద్దరిల్లింది. ఈ దాడుల్లో 14 మంది మరణించగా, 226 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు టర్కీలోని పోలీస్స్టేషన్ల సమీపంలో మొదట రెండు కారు బాంబులు పేలాయి. తర్వాత ఆగ్నేయ టర్కీలో సైనికులను తరలిస్తున్న మిలటరీ వ్యాన్ లక్ష్యంగా చేసుకొని రోడ్డు పక్కన అమర్చిన మరో బాంబు పేలింది. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ప్రకటన చేయలేదు. బుధవారం అర్ధరాత్రి తూర్పు టర్కీలోని వ్యాన్ లేట్‌లో మొదటి కారు బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి, ఇద్దరు పౌరులు మరణించారు. 20 మంది పోలీసులు, 53 మంది పౌరులు గాయపడ్డారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే గురువారం తెల్లవారుజామున ఎలాజిగ్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద మరో కారును పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించగా, 146 మంది గాయపడ్డారు. 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని కార్లు నాశనమవ్వగా, భవనాలు దెబ్బ తిన్నాయి.