పాసింజర్ ట్రైన్లో బాంబు కలకలం
ఫరుక్కాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఓ పాసింజర్ ట్రైన్లో బాంబు ఉండటం కలకలం సృష్టించింది. యూపీలోని ఫరుక్కాబాద్లో మెయిన్‌పురి పాసింజర్ ట్రైన్లో బాంబు ఉందని పోలీసులు గుర్తించారు. ట్రైన్ బయలుదేరడానికి 20 నిమిషాల ముందు సంబంధిత సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే వారు ట్రైన్లో పెట్టిన బాంబును తొలిగించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.