bombs in car
-
ఆత్మాహుతి దాడి..10 మంది మృతి
మొగదిషు(సోమాలియా): సోమాలియా రాజధాని నగరం మొగదిషులో శనివారం బాంబుల మోత మోగింది. రెండు కార్లతో ఆత్మాహుతి దళ సభ్యులు దాడికి దిగారు. సోమాలియా అంతర్గత మంత్రిత్వ శాఖ భవనంపై ఆత్మాహుతి దాడికి దిగడంతో 10 మంది చనిపోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక సమాచార శాఖా మంత్రి దహిర్ మహ్మద్ గల్లె తెలిపారు. ఈ ఘటనను ఆఫ్రికన్ యూనియన్ మిషన్ తీవ్రంగా ఖండించింది. చనిపోయిన వారిలో సైనికులు, జర్నలిస్టులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారని మీడియా పేర్కొంది. అల్ షాబాద్ అనే మిలిటెంట్ గ్రూప్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ప్రభుత్వం భావిస్తోంది. -
ఎన్నికల సిబ్బంది కారులో బాంబులు!
పశ్చిమబెంగాల్లో ఎన్నికల హింస దారుణంగా ఉంది. ఎన్నికల అధికారులను తీసుకెళ్లాల్సిన కారులో నాలుగు బాంబులు కనిపించాయి. డ్రైవర్ కారును స్టార్ట్ చేయబోతుండగా.. ఈ బాంబులను గుర్తించారు. ఆదివారం జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు డీసీఆర్సీ కార్యాలయంగా ఉపయోగిస్తున్న సెంట్రల్ స్కూలు ఆవరణలో ఈ కారు పార్క్ చేసి ఉంది. తన కారు సీటు కింద పాలిథిన్ బ్యాగులో ఏవో వస్తువులు ఉండటాన్ని డ్రైవర్ చూశాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేయడంతో అందరూ అక్కడకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్, పోలీసు సిబ్బంది కూడా వచ్చి పాలిథిన్ బ్యాగును తీశారు. అందులో నాలుగు బాంబులు ఉన్నట్లు ఆ తర్వాత చెప్పారు. ఈ ఘటనతో ఎన్నికల వాహనాలను తీసుకెళ్లడానికి అక్కడున్న డ్రైవర్లు నిరాకరించారు. తమకు తగినంత భద్రత కల్పించాలని లేకపోతే ముందుకు కదిలేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఎన్నికల సిబ్బందిని తరలించడం కూడా కష్టంగా మారింది.