చేపలు పట్టే యత్నంలో వ్యక్తి గల్లంతు
ఆగిరిపల్లి: చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ కాలు జారడంతో వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంతెని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆగిరిపల్లి గ్రామానికి చెందిన బోనం కొండయ్య (40) చేపలు పట్టేందుకు ఆదివారం వాగు దగ్గరకు వెళ్లాడు. వల విసిరే క్రమంలో కాలు జారి వాగులో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి వరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు.