కన్నయ్య కుమార్కు చేదు అనుభవం
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో బెయిల్పై విడుదలైన మాజీ జేఎన్యూ స్టూడెంట్ లీడర్ కన్నయ్య కుమార్కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఓ సెమినార్లో పాల్గొన్న కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా శ్రోతలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో మధ్యలోనే ఆయన ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేయడంతో కన్నయ్యపై అక్కడివారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. దేశంలో ప్రజలు వీధుల్లో, జైళ్లలో ఉంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నారంటూ కన్నయ్య విమర్శలు ఎక్కుపెట్టాడు. దేశంలో 65 శాతం యువత ఉండగా.. 65 ఏళ్ల వ్యక్తి వారికి నాయకుడిగా ఎలా ఉంటారు అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో అక్కడివారు కన్హయ్య ప్రసంగానికి అడ్డుపడటంతో 'దేశంలో స్వేచ్ఛ ఉంది. ఇలా అడ్డు తగులుతున్న మీపై ఎవరూ దేశ ద్రోహం కేసు నమోదు చేయరు' అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.