Border security forces
-
ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. వీరిలో జైషే మహ్మద్ టాప్ కమాండర్ జహీద్ అహ్మద్ వని అలియాస్ ఉజైర్ ఉన్నాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆదివారం తెలిపారు. పుల్వామా, బుడ్గావ్ జిల్లాల్లో ఉగ్రవాదుల ఆచూకీ సమాచారం అందుకున్న భద్రతాదళాలు కూంబింగ్ నిర్వహించాయని తెలిపారు. పుల్వామాలోని నైరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు మృతి చెందగా, బుడ్గావ్లోని చరారే షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన బిలాల్ అహ్మద్ ఖాన్ చనిపోయాడన్నారు. జహీద్ వని జైషేలో టాప్ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, అతని సోదరుడు బాన్‌ప్లాజా దాడిలో నిందితుడని తెలిపారు. 2017 నుంచి జహీద్ చురుగ్గా ఉగ్రకార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని చెప్పారు. లోయలో మొత్తం జేషే కార్యకలాపాలకు ఇతనే సూత్రధారి అని, ఇతని మరణం భద్రతా దళాలు సాధించిన గొప్పవిజయమని విజయ్ కుమార్ ప్రశంసించారు. 11 ఎన్కౌంటర్లు.. 21 మంది ఉగ్రవాదులు జనవరిలో ఇంతవరకు 11 ఎన్కౌంటర్లలో 21మంది టెర్రరిస్టులు మరణించినట్లు చెప్పారు. వీరిలో 8మందికి పాక్‌తో సంబంధం ఉందన్నారు. పలు ఐఈడీ పేలుళ్లతో వనికి సంబంధం ఉందని ఆర్మీ అధికారి మేజర్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ చెప్పారు. ఉగ్రవాదుల్లోకి యువతను రిక్రూట్ చేయడంలో కూడా ఇతని పాత్ర ఉందన్నారు. మరణించిన ఇతర ఉగ్రవాదులను కఫీల్ భారీ అలియాస్ ఛోటూ, వహీద్ అహ్మద్ రెషి, ఇనాయత్ అహ్మద్ మిర్గా గుర్తించారు. వీరిలో ఛోటూ పాక్ నివాసి. కాల్పుల్లో మరణించిన మిర్ ఉగ్రవాదులుంటున్న ఇంటి యజమాని కుమారుడని, హైబ్రిడ్ టెర్రరిజానికి ఇది ఉదాహరణఅని ప్రశాంత్ తెలిపారు. ఇలాంటి వారికి టెర్రరిస్టులుగా ఐడెంటిటీ ఉండదని, కానీ ఉగ్రవాదులకు సహాయంగా వ్యవహరిస్తుంటారని వివరించారు. పాక్, హైబ్రిడ్ టెర్రరిస్టులు భద్రతాదళాలకు అసలు సమస్యన్నారు. జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తొలిసారి 200 దిగువకు తెచ్చామని తెలిపారు. డ్రోన్లతో పాటు ఇతర మార్గాల్లో వీరికి ఆయుధాలు అందుతున్నాయని, ఈ ఆయుధ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అధికారులు చెప్పారు. In dual encounters - 4 neutralized in Pulwama and 1 in Budgam. Among the killed in Pulwama is Zahid Wani who was actively involved in killings and recruitments. He was the district (Pulwama) commander and JeM chief of the entire Valley: Vijay Kumar, IGP Kashmir pic.twitter.com/86nkmwaRBM — ANI (@ANI) January 30, 2022 చదవండి: సీన్ రివర్స్.. కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతున్నాయ్ -
దాయాది ఆగడాలు, మరోసారి కాల్పులు
జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్ దళాలు శనివారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, కథువా జిల్లాల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలు, పలు సెక్టార్ పరిధిలో పాకిస్తాన్ దళాలు కాల్పులకు దిగాయని భద్రతా అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఆగడాలతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారని వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు రాత్రంతా భూగర్భ రక్షణ వసతుల్లో బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు. పూంచ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి, మాన్‌కోట్ సెక్టార్ పరిధిలో తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 4 గంటల వరకు దాడులు చేశారని, హిరానగర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాత్రంతా కాల్పులు కొనసాగాయని అధికారులు తెలిపారు. ఆటోమాటిక్స్, మోర్టార్స్‌తో దాయాది బలగాలు దాడులకు తెగబడ్డారని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అంతకు ముందు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కూడా పాక్ దళాలు కరోల్ కృష్ణ, సత్పాల్, గుర్నామ్‌లో సరిహద్దు వెంట కాల్పులకు దిగారు. భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పాక్ చర్యలను దీటుగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు. -
ప్రేయసి కోసం నడిచి పాకిస్తాన్‌కు..
భుజ్/ముంబై: ప్రేమించిన అమ్మాయి కోసం నడుచుకుంటూ పాకిస్తాన్ వెళ్లాలని ప్రయత్నించిన మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడిని సరిహద్దు భద్రతా బలగాలు అడ్డుకున్న ఘటన గుజరాత్లో జరిగింది. అదుపులోకి తీసుకున్నాక అతడిని తల్లిదండ్రులకు బీఎస్ఎఫ్ అధికారులు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన జషాన్ మొహమ్మద్ సిద్ధిఖీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సిద్ధిఖీ సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ఈ నెల 11న తన ఇంటి నుంచి బైక్ మీద బయల్దేరి గుజరాత్ చేరుకున్నాడు. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం గుండా పాకిస్తాన్లోకి అడుగుపెట్టాలని ప్రణాళిక వేసుకున్నాడు. అయితే మధ్యలో ధోలవీర గ్రామం సమీపంలో బైక్ ఇసుకలో కూరుకుపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి నడక మొ దలుపెట్టాడు. గ్రామంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న అనుమానాస్పద బైక్ వదిలేసి ఉండటంతో బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. ఆ క్రమంలోనే భారత్–పాక్ సరిహద్దు వెంట సిద్ధిఖీని జవాన్లు అడ్డుకున్నారు. అప్పటికే మహారాష్ట్రలో అతని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసును పెట్టారు. అతని బైక్ వివరాలను కేసుతో పోల్చుకున్న పోలీసులు బీఎస్ఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చి అతన్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అతని సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
అమెరికాలో ఇద్దరు భారతీయుల నిర్బంధం
న్యూయార్క్: అమెరికాలోకి దొంగతనంగా ప్రవేశించిన ఇద్దరు భారతీయులను సరిహద్దు గస్తీ బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. న్యూయార్క్‌లోని హోగన్స్బర్గ్లో ఓ క్యాసినో వద్ద నిలిపి ఉన్న వాహనాన్ని బోర్డర్ పెట్రోల్ స్టేషన్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న ఆరుగురు భారతీయుల్లో ఇద్దరు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తేలింది. ఎటువంటి పత్రాలు లేని ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. -
వలసదారులపై బాష్పవాయువు
టిజుయానా: మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలనుకున్న వలసదారులను యూఎస్ సరిహద్దు దళాలు అడ్డుకున్నాయి. వీరిలో 25 మందిని అరెస్టు చేశాయి. నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో దాదాపు 100 మంది వలసదారులు అమెరికాలోకి చొరబడేందుకు యత్నించారని స్థానిక మీడియా పేర్కొంది. మెక్సికో సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 45 మంది వలసదారులను అడ్డుకున్నామని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మంగళవారం వెల్లడించింది. కొద్దిసేపటి తర్వాత వీరంతా సీబీపీ అధికారులపై రాళ్ల వర్షం కురిపించారని తెలిపింది. వలసదారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు, పెప్పర్ స్ప్రేను వాడామని వివరించింది. -
పాక్ పోస్టులపై బీఎస్ఎఫ్ మోర్టార్ల వర్షం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత గ్రామాలు, పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పాక్ బలగాలకు దీటుగా జవాబిస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉన్నతాధికారి ఒకరు సోమవారం తెలిపారు. పాక్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా ఇప్పటివరకూ బీఎస్ఎఫ్ 9,000 రౌండ్ల మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించిందని వెల్లడించారు. భారత బలగాలు చాలా కచ్చితత్వంతో చేసిన దాడిలో పాక్ ఆర్మీకి చెందిన పలు పోస్టులు, మోర్టార్ లాంచింగ్ ప్యాడ్లు, ఆయుధాలు, ఇంధన డంప్‌లు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. భారత బలగాల దాడిలో పాక్ రేంజర్ల ఇంధన డంప్ ధ్వంసమవుతున్న రెండు వీడియోల్ని విడుదల చేశారు. జమ్మూ వెంట ఉన్న 190 కి.మీల అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని తెలిపారు. జమ్మూలోని మక్వాల్–కనచక్ బోర్డర్ పోస్టుల మధ్య ఉన్న చికెన్‌నెక్ ప్రాంతంపై తొలిసారి పాక్ కాల్పులు జరిపిందని వెల్లడించారు. భారత బలగాల తీవ్ర ప్రతిస్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ రేంజర్లను పోత్సహించేందుకు ఆ దేశ సీనియర్ ఆర్మీ కమాండర్లు సరిహద్దుకు చేరుకోవడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. భారత బలగాలతో చర్చలు జరిపేందుకు, ఫ్లాగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు పాక్ రేంజర్లు విముఖత చూపుతున్నారని చెప్పారు. కాల్పుల మాటున దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో అంబుష్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ఆగని పాక్ కాల్పులు జమ్మూ, రాజౌరీ జిల్లాల్లోని మూడు సెక్టార్లపై పాకిస్తాన్ బలగాలు సోమవారం కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఆదివారం సాయంత్రం నుంచి మొదలైన ఈ కాల్పులు సోమవారం తెల్లవారుజాము 5.45 గంటల వరకూ కొనసాగాయని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. -
సిపాయి చిన్నోడు!
‘బోర్డర్లోకి వెళ్లి, సోల్జర్స్‌ని చూస్తా’ అన్నాడు. ‘సరే’ అంది అమ్మ. ‘సై’ అన్నాడు నాన్న! ఆర్మీ కూడా పర్మిషన్ ఇచ్చింది! అంతే. ఎడారిలో ఈ చిన్నారి కల పండింది! సరిహద్దు కంచెల దాకా వెళ్లాడు. తుపాకీ పట్టి పహారా కాశాడు. శతఘ్నుల్ని గురి చూశాడు. ‘ఇంత కష్టమా!’ అని ప్రతి సైనికుడికీ సెల్యూట్ కొట్టాడు. ‘త్వరలో నేనూ వస్తా. మన దేశాన్ని కాపాడే డ్యూటీ చేస్తా’ అని... బంగారు వర్ణంలో మెరిసిపోతున్న జైసల్మేర్ ఇసుకను గుప్పెట్లోకి తీసుకుని ముద్దాడాడు. సరిహద్దు సైన్యం రేయింబవళ్లు మునివేళ్లపై దేశానికి పహారా కాస్తుంటుంది. తొమ్మిదేళ్ల పిల్లవాడు రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇచ్చేంత వ్యవధి సైన్యానికి ఉంటుందా అన్నది సందేహమే. అదికూడా, ‘మీరు అక్కడ ఎలా పనిచేస్తారో చూడాలని ఉంది’ అని వెళ్లిన విజ్ఞప్తి! సాధారణంగా అలాంటి ఉత్తరం డస్టబిన్లోకి వెళుతుంది. లేదా, ‘సారీ’ అనే రిప్లయ్ వస్తుంది. అయితే రవికర్‌కు సానుకూలమైన తిరుగు సమాధానం వచ్చింది! హైదరాబాద్‌లో ఐదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి రాసిన లేఖకు సరిహద్దు భద్రతాదళం డైరెక్టర్ జనరల్ కె.కె.శర్మ స్పందించి, అతడిని జైసల్మేర్‌కు ఆహ్వానించారు! రవికర్ కోరిక మేరకు సైనిక విధులను దగ్గరగా చూసే అవకాశం కల్పించారు. భారత్–పాక్‌ల మధ్య సరిహద్దు పట్టణ ప్రాంతం జైసల్మేర్. సరిహద్దు భద్రతా బలగాలు (బిఎస్ఎఫ్) శత్రువు కదలికలను గమనిస్తూ అనుక్షణం అక్కడ నిర్విరామంగా గస్తీ కాస్తుంటాయి. ఆ గస్తీకి దీటుగా ఎండలూ కాస్తుంటాయి. అంతేకాదు, రాజస్థాన్‌లోని ఈ ఎడారి ప్రాంతపు ఉష్ణోగ్రతలు ఏమాత్రం స్థిరంగా ఉండవు. ఇసుక 25–49 డిగ్రీల మధ్య వేడెక్కి, చల్లబడుతుంటుంది. ఈ మార్పులు మానవదేహానికి ఏమంత హితమైనవి కావు. అకస్మాత్తుగా వడగాలులు వీస్తుంటాయి. ఇసుక తుపానులు రేగుతుంటాయి. అంతటి కఠినమైన పరిస్థితులను తట్టుకుని నిలబడి, దేశానికి రక్షణగా నిలుస్తారు సరిహద్దు సైనికులు. ఏ సరిహద్దులోనైనా జవానుల విధులు క్లిష్టంగానే ఉంటాయి కానీ, భౌగోళికంగా జైసల్మేర్ సరిహద్దు మరింత ప్రతికూలమైనది. ఈ సంగతిని పేపర్లలో చదివి, టీవీలలో చూసి తెలుసుకున్న రవికర్‌కు సైనికులంటే భక్తిభావం ఏర్పడింది. నిజమైన హీరోలంటే సినిమాల్లో కనిపించేవాళ్లు కాదు, సైనికులేనని అనుకున్నాడు. వాళ్లు ఎలా ఉంటారో? ఏం చేస్తుంటారో దగ్గరగా చూడాలనుకున్నాడు. తల్లిదండ్రుల చొరవతో రవికర్‌కు ఆ అవకాశం వచ్చింది. మార్చి చివరివారంలో రవికర్ ప్రత్యేక ఆహ్వానంపై జైసల్మేర్ వెళ్లి సైనికులతో పాటు తను కూడా కాసేపు సరిహద్దుకు పహారా కాశాడు! రవికర్ ఉత్సాహం చూసి శర్మ ముచ్చట పడ్డారు. రవికర్ జైసల్మేర్‌లో నాలుగు రోజులు ఉన్నాడు. ఆ సమయంలో నార్త్ సెక్టార్ డి.ఐ.జి. అమిత్ లోధా రవికర్తో మాటలు కలిపారు. అవకాశం వస్తే తప్పకుండా సైన్యంలో చేరి, దేశాన్ని రక్షిస్తానని ఆ చిన్నారి చెప్పడం శర్మను సంతోషానికి, ఉద్వేగానికి లోను చేసింది. రవికర్‌కు ధనానా, మురార్, టనాట్, బబ్లియాన్ సరిహద్దు కేంద్రాలను చూపించారు.రవికర్ తల్లిదండ్రుల స్వస్థలం చిత్తూరు చిల్లాలోని మండ్యంవారిపల్లి. తండ్రి నరసింహారెడ్డి, తల్లి ఇందిర. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రవికర్ బాచుపల్లిలోని వికాస్ కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నాడు. తుపాకీ చేతపట్టి పహారా... కమెండోతో...