అధునాతన భారతమే రాజీవ్ ఆశయం
భారత్‌ను 21వ శతాబ్దంలోకి నడిపించాలని పిలుపునిచ్చిన వారు రాజీవ్‌గాంధీ (ఆగస్ట్ 20, 1944-మే 21, 1991). నెహ్రూ, ఇందిరాగాంధీల వారసునిగా, నెహ్రూ కుటుంబం నుంచి ప్రధాని పదవిని అధిష్టించిన మూడో వ్యక్తిగా రాజీవ్ తనదైన ముద్రను వేశారు. భారత శాస్త్ర, సాంకేతికరంగాన్ని ఆధునీకరించి, పరుగులు పెట్టించిన వారాయన. పైలట్‌గా జీవితం గడుపుతున్న రాజీవ్ అనుకోని పరిస్థితులలో తల్లి ఇందిర హత్య (అక్టోబర్ 31, 1984) తరువాత భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది డిసెంబర్ లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 411 స్థానాలు సాధించింది.
ఆ పార్టీ చరిత్రలో ఇదొక మైలురాయి. రాజీవ్ తన హయాంలో విదేశాంగ విధానానికి కొత్త రూపును ఇచ్చి, అన్ని దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పారు. శ్రీలంక అంతర్యుద్ధం ముగింపునకు కృషి చేస్తూ ఇరుపక్షాలను శాంతి చర్చలకు ఆహ్వానించారు. లంక ప్రభుత్వం ఆహ్వానం మేరకు శాంతి స్థాపక దళాన్ని కూడా పంపారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తూ 73, 74వ రాజ్యాంగ సవరణలు చేశారు. ఫిరాయింపులతో రాజకీయ అస్థిరత్వం పెరిగిపోయిన తరుణంలో ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్ రాజ్యాంగబద్ధం చేశారు. దీనితో రాజ కీయ పక్షం అనే వ్యవస్థ బలోపేతమైంది. 1985-1991 మధ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడం, గాట్ ఒప్పందం మీద సంతకం చేసి ప్రపం చీకరణ పరిణామాల మధ్య సాహసోపేతంగా ముందుకు నడిచారు. నేడు ఇంత విశేషంగా విస్తరించిన సాఫ్ట్వేర్ రం గానికి బీజాలు పడినది రాజీవ్ హయాంలోనే. టెలిఫోన్ రంగాన్ని శాఖలుగా విభజించి అభివృద్ధి చేశారు.
ఎం.టి. ఎన్.ఎల్., వి.ఎస్.ఎన్.ఎల్., బి.ఎస్.ఎన్.ఎల్. సంస్థలు గా ప్రత్యేక ప్రతిపత్తితో ఏర్పాటైనాయి. టీవీ రంగం అభివృద్ధికి కూడా రాజీవ్ తనవంతు కృషి చేశారు. శాంపిట్రోడా ఇచ్చిన సలహాలు కూడా రాజీవ్‌కు ఎంతగానో ఉపకరించాయి. ఓటు హక్కు వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన వారు రాజీవ్. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన పీవీ నరసింహారావు జవ హర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు. 1989లో జరిగిన ఎన్ని కలలో జనతాదళ్ విజయం సాధించి, వీపీ సింగ్ ప్రధాని పదవిని చేపట్టా రు. రాజీవ్ ప్రతిపక్ష నేత బాధ్యతలను నిర్వర్తించారు. ఇన్ని కోణాల నుంచి దేశానికి సేవలందించిన రాజీవ్ చరిత్రలో చిరస్మరణీయం.
(నేడు రాజీవ్ 71వ జయంతి)
డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ