boxing title
-
ప్రత్యర్థి పంచ్‌కు ఊహించని అనుభవం; ఆపై కోమాలోకి
బాక్సింగ్ రింగ్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ప్రత్యర్థి పంచ్‌లకు బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో మరొక బాక్సర్ కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు.. అతను ప్రవర్తించిన తీరు ఉద్వేగానికి గురి చేసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. లైట్ వెయిట్ బాక్సర్లు సిమిసో బుటెలేజీ, సిప్సిలే నుంటుగ్వాల మధ్య జూన్ 5న(ఆదివారం) వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆల్ ఆఫ్రికా లైట్ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరు జరిగింది. ఇద్దరు మంచి టఫ్ ఫైట్ కనబరచడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. 10వ రౌండ్ బౌట్ మొదలయ్యే వరకు సిమిసో, నుంగుట్వాలు ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. పదో బౌట్ మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు నుంటుగ్వా ఇచ్చిన పంచ్ సిమిసో బుటెలేజీ తలలో బలంగా తగిలింది. దీంతో కళ్లు బైర్లు కమ్మిన సిమిసోకు ఏం చేస్తున్నాడో ఒక్క క్షణం ఎవరికి అర్థం కాలేదు. రిఫరీ ఉన్న వైపు దూసుకొచ్చిన సిమిసో బుటెలేజీ అతనికి పంచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన ప్రత్యర్థి వెనకాల ఉంటే.. అది గమనించకుండా తన ముందువైపు ఎవరు లేనప్పటికి గాలిలో పంచ్‌లు కొట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన రిఫరీ సిమిసో పరిస్థితిని అర్థం చేసుకొని బౌట్‌ను నిలిపేసి మెడికోను పిలిచాడు. దీంతో సిప్సిలే నుంటుగ్వా లైట్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించాడు. వైద్య సిబ్బంది సిమిసోను పరిశీలించి వెంటనే డర్బన్‌లో కింగ్ ఎడ్వర్డ్-8 ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన సిమిసో బెటెలేజీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో కోమాలో ఉన్నాడని.. రెండురోజులు గడిస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనాకు వస్తుందని వైద్యులు తెలిపారు. అయితే కొద్దిరోజుల్లోనే అతను మాములు పరిస్థితికి వచ్చేస్తాడని.. ప్రాణాలకు ఏం భయం లేదని తెలిపారు.. కాగా సిమిసో బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేసిన ఆఖరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని Rabat Diamond League 2022: అవినాశ్ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు Very scary in South Africa please 🙏🏼 for Simiso Buthelezi (4-1). At 2:43 of the 10th & final round, Siphesihle Mntungwa (7-1-2) falls through the ropes but then Buthelezi appears to lose his understanding of the present situation. Mntungwa takes the WBF African lightweight title pic.twitter.com/YhfCI623LB — Tim Boxeo (@TimBoxeo) June 5, 2022 I was at the #boxing in KZN yesterday and this is one of the strangest and saddest things I've seen in the sport. Thoughts and prayers with Simiso Buthelezi who is now in an induced coma in hospital 🙏🏿🙏🏿 @SABC_Sport #SizenzaZonke pic.twitter.com/1097yFtKmY — Tracksuit (@ThabisoMosia) June 6, 2022 -
బాక్సింగ్ చాంప్స్ నగ్మా, ప్రవళిక
అండర్-19 జూ. కాలేజి, స్కూల్ గేమ్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అండర్-19 జూనియర్ కాలేజి, స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో షేక్ నగ్మా, ప్రవళిక విజేతలుగా నిలిచారు. ఎల్బీస్టేడియంలోని బాక్సింగ్ హాల్లో బుధవారం జరిగిన బాలికల 44-46 కేజీల కేటగిరీలో నగ్మా (సుల్తాన్ వులూమ్ జూనియర్ కాలేజి) గెలుపొందగా, త్రిపూజ (కస్తూర్బా కాలేజి) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ద్రివిత (మహబూబియా కాలేజి)కు మూడో స్థానం దక్కింది. 46-48 కేజీల కేటగిరీలో ప్రవళిక (మహబూబియా) టైటిల్ సాధించింది. ఇతర పోటీల ఫలితాలు: 48-52 కేజీల కేటగిరీ: 1.మాధవి (మహర్షి కాలేజి); 50-52 కేజీలు: 1. అభిలాష (సెరుుంట్జార్జ్ కాలేజి), 2.స్మిత్ (కస్తూర్బా); 52-54 కేజీలు: 1. తన్మరుు (నారాయణ), 2. ఉమారాణి (కస్తూర్బా); 54-57 కేజీలు: 1. శాని (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. అంజలి (వనిత), 3. శ్రుతి గుప్తా (కస్తూర్బా); 57-60 కేజీలు: 1. నాగమణి (కస్తూర్బా), 2. ప్రతిభ (వనిత); 60-63 కేజీలు: 1. జుబియా అఫ్రిన్ (ఎన్ఏఎస్ఆర్), 2. క్యాథలిన్ (వనిత), 3. మనీష (వనిత); 63-66 కేజీలు: 1. సారుుశ్రీ (ఆదర్శ కాలేజి); 66-70 కేజీలు: 1. తబసుమ్ (కస్తూర్బా); 70-75 కేజీలు: సోని సింగ్ (వనిత); 75-81 కేజీలు: 1. అక్షిత (నారాయణ), 81-86 కేజీలు: 1. నాగనిక (సెరుుంట్ఆన్స కాలేజి).