the boy
-
ప్రైవేటు ఆస్పత్రిలో బాలుడి మృతి
చికిత్స సరిగ్గా అందించలేదంటూ బాధిత కుటుంబీకుల ఆగ్రహం ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం, సిబ్బందిపై దాడి మహబూబాబాద్ : ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, బాధిత కుటుంబానికి చెంది న పలువురు దవాఖానలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కాంపౌండర్‌పై చే యిచేసుకొని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం మానుకోటలో చోటు చేసుకుంది. మరిపెడ మండలంలోని జ య్యారం గ్రామ శివారు మన్నెగూడేనికి చెందిన తేజావత్ స్వప్న, రాకేష్‌శర్మ కుమారుడైన సాయితేజ నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. జలుబు, దగ్గు ఉండటంతో తల్లిదండ్రులు మానుకోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు బాబును పరీక్షించి, ఆసుపత్రిలో అ డ్మిట్ చేసుకున్నారు. కాగా మంగళవారం రాత్రి 11 గంటలకు చిన్నారి బాగా ఏడ్వడంతో వైద్యుడికి తెలిపారు. ఈక్రమంలో ఆ బాలుడికి చికి త్స అందించారు. అయినా బాబు ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వైద్యుల సలహా మేరకు అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, బాలుడు రెండు గంటల క్రితమే మృతిచెందాడని చెప్పారు. అక్కడి నుంచి మానుకోటలోని ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపై వైద్యుడు భీమ్సాగర్ను వివరణ కోరగా ‘బాలుడు ఏడుస్తుండగా తల్లి ఆ బాలుడ్ని పడుకోబెట్టి సిరప్ పోసింది. అది బాబు ఊపిరితిత్తుల్లోకి నేరుగా వెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది’ అని పేర్కొన్నారు. -
మెదడువాపు వ్యాధితో బాలుడి మృతి
గోరంట్ల: స్థానిక పట్టణంలోని పులేరు రోడ్డులోని బీసీ రెడ్డి కాంపౌండ్ సమీపంలో నివాసముంటున్న పురుషోత్తం(6) అనే బాలుడు మెదడు వాపు వ్యాధితో బెంగుళూరులో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. వివరాలకు గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుడిని స్థానిక ఆస్పత్రితో పాటు హిందూపురం, బత్తలపల్లి ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు బెంగుళూరులోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తల్లిదండ్రులు రామకృష్ణ, లక్ష్మిలు తెలిపారు. వీరి స్వగ్రామం చిలమత్తూరు మండలంలోని బూదిలి శెట్టిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రాణం తీసిన బంతి
- కాలువలో పడి బాలుడి మృతి తిరుపతిక్రైం: ‘అమ్మా... నీళ్లల్లో మునిగిపోతున్నాను... ఊపిరి ఆడడం లేదు... ఎక్కడున్నావమ్మా... త్వరగా వచ్చి కాపాడు’ అంటూ ఆర్తనాదాలు చేస్తూ నీటిలో మునిగి తల్లికి శవమై కన్పించాడో కొడుకు. దీంతో ఆ తల్లి వేదనకు అంతే లేకుండా పోయింది. ఆమె రోదనలు చుట్టపక్కల వారి హృదయాలను కలచి వేసింది. కొర్లగుంటలోని నవోదయ కాలనీలో భాను తన కుమారుడు సురేష్(6)తో కలసి నివాసం ఉం టోంది. భర్తకు దూరంగా ఉండడంతో కుమారుడిని తానే పెంచుకుంటోంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి వారి ఇంటి వెనకాలే ఉన్న కపిలతీర్థం నుంచి వచ్చే 10 అడుగుల పెద్ద కాలువ నిండిపోయింది. వేగంతో వస్తున్న నీటిలో నుంచి కొన్ని బంతులు కాలువలో కొట్టుకొని వస్తున్నాయి. దీన్ని గమనించిన బాలుడు సురేష్ బంతి కోసం కాలువులోకి దిగాడు. నీటి ప్రవాహం అధికంగా రావడంతో బంతి కోసం వంగిన వెంటనే బాలుడు కొట్టుకెళ్లిపోయాడు. దీంతో అ క్కడున్న వారు చుట్టుపక్కలవారికి సమాచారం ఇచ్చారు. బాలుడి కో సం సుమారు 2 గంటల పాటు వెతికారు. కొర్లగుంట లోపల ఉన్న వెంకటరవి కాలనీ చెరువులో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, బయటకు తీశారు. దీన్ని చూసిన తల్లి బోరున విలపించింది. -
విమ్స్‌లో బాలునికి అరుదైన ఆపరేషన్
సాక్షి, బళ్లారి : ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడికి విమ్స్ ఆస్పత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ విశ్వనాథ్ నేతృత్వంలో అత్యాధునిక శస్త్ర చికిత్స నిర్వహించారు. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా కరడిహాల్ గ్రామానికి చెందిన ఓబుళేసు కుమారుడు అశోక్ అనే బాలుడు పదవ తరగతి చదువుకుంటున్నాడు. నాలుగు నెలల క్రితం బాలుడు పొలంలోకి వెళ్లి వస్తుండగా నాలుగు ఎలుగుబంట్లు దాడి చేశాయి. తల, కళ్లు, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడిని కుటుంబ సభ్యులు విమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ విశ్వనాథ్ బాలుడిని పరీక్షించి శస్త్రచికిత్స చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు రూ.10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేపట్టి బాలుడి ప్రాణాలు కాపాడారు. జ్ఞాపకశక్తి, కంటిచూపు, వాసన, స్పర్శ పూర్తిగా కోల్పోయిన అశోక్‌కు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో మామూలు స్థితికి చేరుకున్నాడు. బతకడనుకున్న కొడుకుకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ విశ్వనాథ్‌ను బాలుడి తల్లిదండ్రులు, బంధువులు అభినందించారు. ఈ విషయంపై డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ సోమశేఖర్ సమగండి, చంద్రకుమార్, ఆనంద్ తదితర వైద్య బృందం విలేకరులకు వివరించారు. ఎలుగుబంటి దాడులు, ఇతరత్ర గాయాలైన వెంటనే తనను సంప్రదించాలని విమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తామని డాక్టర్ విశ్వనాథ్ పేర్కొన్నారు.