B.R. Dr. Ambedkar
-
అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం
కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఘనంగా అంబేద్కర్ జయంతి ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: నిమ్నకులాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ఐ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ 124వ జయంతి వేడుకలు సోమవారం ఖమ్మం లో ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఐ.శ్రీనివాసశ్రీనరేష్, ఎస్పీ ఏవీ రంగనాధ్, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేద్రమోహన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితా న్ని ధారపోశారని కొనియాడారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి, వాటి పరిష్కర మార్గాలను రాజ్యాంగంలో పొందుపరిచిన దార్శనికుడని కొనియాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలనపై అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. అంబేద్కర్ మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు లక్ష్మీదేవి, ఎస్పీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి సీతామహాలక్ష్మి, జేడీఏ భాస్కర్‌రావు, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, బీసీ సంక్షే మ అధికారి వెంకటనర్సయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయశర్మ, నగరపాలక సంస్థ కమిషనర్ బి శ్రీనివాస్, వికలాంగ శాఖ ఏడీ మున్న య్య, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, ఉద్యానవన శాఖ సహాయసంచాలకులు మరియన్న పాల్గొన్నారు. -
అంబేద్కర్ కలలను సాకారం చేయాలి
కలెక్టర్ చిరంజీవులు ఘనంగా అంబేద్కర్ జయంతి నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్,బడుగు బలహీనవర్గాలు ఉన్నత విద్యను అభ్యసించి పేదరికం నుంచి బయటపడడం ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయాలని కలెక్టర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట గల అంబేద్కర్ విగ్రహానికి సోమవారం కలెక్టర్ తోపాటు పలువురు అధికారులు, దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటికీ జిల్లాలో 33 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉండడం శోచనీయమన్నారు. ప్రతి ఒక్కరు చదువుకోవడానికి చదువుకున్న వారు కృషి చేయాలని చెప్పారు. ఎన్ని పండుగలు ఉన్నా బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ జయంతి మాత్రమే నిజమైన పండుగని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకే కాకుండా అంబేద్కర్ యావత్ మానవాళికి ఆదర్శమూర్తిగా నిలిచిన వ్యక్తి అని కొని యాడారు. మానవచరిత్రను మార్చిన మహనీయులలో గౌతమబుద్ధుడు, కారల్‌మార్క్స్ తోపాటు అంబేద్కర్ కూడా నిలిచారన్నారు. జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సాంఘిక దురాచారాలు, అంటరాని తనాన్ని సమాజం నుంచి పాలద్రోలడానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, దళిత సంఘాల నాయకులు బొర్ర సుధాకర్, కత్తుల నర్సింహ, ఎంఎన్ భూషి. బీసీ సంఘం నాయకులు రామరాజు,వైద్యుల సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి, కూతురు శ్రీనివాస్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, సయ్యద్‌హాషం, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, రత్నాకర్‌రావు, బీఎస్పీ నాయకులు సిద్దార్ధపూలే తదితరులు పాల్గొన్నారు. -
దళిత బాంధవుడికి పుష్పాంజలి
కవాడిగూడ,న్యూస్‌లైన్: భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 57వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోలాహలం నెలకొంది. పలువురు రాజకీయ,ఉద్యోగ,దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిలంచారు. నాయకులు,అభిమానులు ఎంతో అభిమానంతో వేసిన దండలతో విగ్రహం నిండిపోయింది. ఈసందర్భంగా పలువురు దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్, ప్రజాగాయకుడు గద్దర్, అరుణోదయ విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, ఉపాధ్యక్షుడు వేదకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, నగర అధ్యక్షుడు వెంకటరెడ్డి, టీఆర్ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ఆంధ్రామేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య, ప్రధానకార్యదర్శి బి.రాజారాం, మాలమహానాడు అధ్యక్షులు జి.చెన్నయ్య, కారెం శివాజీ, ఆలిండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు మహేశ్వర్‌రాజ్, కేవీపీఎస్ అధ్యక్షుడు జాన్‌వెస్లీ, శంకర్‌నాయక్ తదితరులు మహానుభావుడి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. రెండు ప్రాంతాల నినాదాలు: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, చలసాని శ్రీనివాసరావు, కారెం శివాజీలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సమయంలో..ఒక తెలంగాణవాది జెతైలంగాణ అని నినాదాలు చేయడంతో.. కారెం శివాజీ జై సమైక్యాంధ్ర నినాదాన్ని అందుకున్నారు. బాబాసాహెబ్‌కు జగన్ నివాళి సాక్షి,హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు, హైదరాబాద్ జిల్లా ఎస్సీ కన్వీనర్ రవికుమార్, నేతలు డా.ప్రఫుల్లారెడ్డి, నీలంరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ నేతలు పీఎన్వీ ప్రసాద్, తమ్మినేని సీతారాం, చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.