Brahmin community
-
యూపీ చదరంగంలో కొత్త ఎత్తుగడలు
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు బ్రాహ్మణ, ఠాకూర్ వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇది ప్రత్యక్ష రాజకీయ యుద్ధంగా మారి బీజేపీకి తీవ్ర నష్టం జరగక ముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం పావులు కదపటం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ జనాభాలో 10 శాతంగా ఉన్న బ్రాహ్మణ వర్గం మొదటి నుంచీ బీజేపీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉంది. అటువంటి ఓటుబ్యాంకును.. మరో బలమైన ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు దూరం చేస్తున్నాయి. ఆయన ‘ఠాకూర్ వాదాన్ని’ ప్రమోట్ చేçస్తూ బ్రాహ్మణులను పైకి రాకుండా చేస్తున్నారనే విమర్శ ఉంది. దీంతో కాశీ కారిడార్ ప్రారంభ కార్యక్రమాన్ని మోదీ తనంతతానై నడిపించారు. మొత్తం మీద యూపీలో ఈ పరిస్థితులు చిక్కుముడులను తలపిస్తున్నాయి. అక్కడి రాజకీయ చదరంగంలోని చిక్కుముడులు విప్పడం అసాధ్యం అనిపిస్తోంది కూడా! ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కుల చదరంగం వైపు చూపు సారిస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని కీలక దిగ్గజాలు, అప్రధానమైన బంట్లు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అధిక సంఖ్యలో బీజేపీకి ఎంపీలను అందించిన ఉత్తరప్రదేశ్ (యూపీ)లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలెత్తిన రైతుల ఆగ్రహ జ్వాలలను చల్లార్చడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఏకపక్షంగా ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తన ప్రసంగంలో పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చుకునే ధోరణి కనిపించింది. వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ రైతులు అధికంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆ ప్రాంతం నుంచి ఎక్కువ సీట్లు రావడం వల్లనే బీజేపీకి భారీ విజయం లభించింది. ముజఫర్‌నగర్ అల్లర్లు జరిగిన మరుసటి ఏడాదే జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ శక్తిని అనేక రెట్లు పెంచిన ప్రాంతం ఇది. పశ్చిమ యూపీలోని జాట్ల కోపాన్ని తగ్గించడానికి, సాధ్యమైతే వారిని తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి మోదీ నూతన వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. పశ్చిమ యూపీలో హిందు– ముస్లింల మధ్య నెలకొని ఉన్న కొన్ని అగాథాలను ఈ రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం కొంతవరకు పూడ్చగలిగింది. ఇప్పుడు రాష్ట్రం లోనూ, కే్రందంలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి ఈ మారిన పరిస్థితులు ప్రతికూలమైనవని వేరే చెప్పనవసరం లేదు. అందుకే మోదీ వెంటనే కొత్త వ్యూహాలతో దిద్దుబాటు చర్యలకు తెరలేపారు. అక్టోబర్ 3వ తేదీన లఖింపూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేసి ఇళ్లకు మరలిన రైతులను ఓ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొట్టి నలుగురు రైతుల మరణానికి కారణం కావడం, ప్రతీకార దాడిలో ఓ జర్నలిస్ట్ మృతి చెందడం తెలిసిందే. రైతులను ఢీకొట్టిన ఒక వాహనం ఆ ప్రాంత బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారునిదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన ఆ ఏరియాలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. అటువంటి నాయకుని కుమారునిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ కేసును దర్యాప్తు చేయడానికి ఒక సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ వ్యవహారం కోర్టులకు చేరేటప్పటికి, సుప్రీం కోర్టు ఈ సిట్‌ను మానిటర్ చేయడం ప్రారంభించింది. అత్యున్నత న్యాయ స్థానం సిట్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను నియమించి దానిని మరింత శక్తిమంతం చేసింది. ఇప్పుడు సిట్ ‘ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర’ వల్లనే రైతు హత్యలు జరిగాయని నివేదిక ఇచ్చింది. దీంతో మంత్రి అజయ్ మిశ్రాకు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నిర్లక్ష్య మైన ర్యాష్ డ్రైవింగ్ వల్ల రైతు మరణాలు సంభవించాయని పోలీ సులు ఎఫ్ఐఆర్లో మొదట్లో పేర్కొన్నారు. అయితే సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఆరోపణల స్థానంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని వివిధ సెక్షన్ల కింద హత్య, నేరపూరిత కుట్ర, మరి కొన్ని ఇతర సీరియస్ ఆరోపణలను చేర్చారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో.. బీజేపీలోని ఒక వర్గం నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను చంపడానికి కుట్ర పన్నిందని పేర్కొంటున్న ఈ కేసు బీజేపీ పాలిట పేలబోతున్న టైమ్ బాంబ్లా తయారైంది. సిట్ రిపోర్టు సంగతి ప్రస్తావించిన ఒక జర్నలిస్ట్‌పై సాక్షాత్తూ మంత్రి అజయ్ మిశ్రానే తీవ్ర పదజాలంతో మండిపడుతూ దాడిచేస్తున్న దృశ్యాలు ఉన్న వీడియో ఒకటి జనంలోకి వెళ్లిపోయింది. నిజానికి అక్టోబర్ 3న రైతు మరణాలు సంభవించడా నికి కొన్ని రోజుల ముందే రైతులను ఆయన బహిరంగ వేదిక మీద నుంచి బెదిరించారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాల్సిందే! అప్పుడు రైతులను, ఇప్పుడు జర్నలిస్టులను భయపెట్టిన అజయ్ మిశ్రా మంత్రి పదవికి ఏమాత్రం అర్హుడు కాదు. బలమైన ఓటుబ్యాంకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒక పక్క రైతుల్లోని ఒక వర్గాన్ని శాంతింపచేసే ప్రయత్నం చేస్తూనే.. మరోపక్క ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణత్వానికి ప్రతినిధిగా బీజేపీ కేంద్ర నాయకత్వం చూపుతూ వచ్చిన వ్యక్తి చేసిన నష్టాన్ని పరిహరిం చేందుకు బీజేపీ నడుం బిగించింది. యూపీ జనాభాలో 10 శాతం బ్రాహ్మణులే ఉన్నారు. వీరు సిద్ధాంతపరంగా బీజేపీకి అనుకూలురని పరిగణించడం కద్దు. కానీ యూపీలో మరో బలమైన ఠాకూర్ కులానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘ఠాకూర్వాదం’ లేదా ఠాకూర్ల ఆధిపత్యం పెరగడానికి ఇతోధికంగా మద్దతు ఇస్తున్నా డనే ఆరోపణతో బ్రాహ్మణ వర్గం బీజేపీకి దూరమవుతున్నట్లూ విమ ర్శకులు భావిస్తున్నారు. ఇందువల్ల యూపీలో బీజేపీకి ఉన్న సంప్ర దాయ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉండటంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. బీజేపీకి యూపీలో 40 శాతం ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీని ఓడించాలంటే మిగతా పార్టీలు అంతకన్నా ఎక్కువ ఓట్లు పొందాలి. అయితే ప్రస్తుతం ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రధాన పార్టీలన్నీ దేనికది ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవాలని భావించ డంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బీజేపీకి అనుకూలించే అంశమే. యూపీలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), అఖిలేశ్ యాదవ్ అధినేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కన్నా వెనుకబడి ఉంది. అఖిలేశ్ అనేక చిన్న ఏక కుల పార్టీలతో పొత్తుపెట్టుకొని రేసులో ముందున్నారు. ప్రస్తుతం పోటీ ద్విముఖమే అనిపిస్తోంది. బీజేపీకి 10 శాతం ఓట్లు తగ్గితే అవి ఎస్పీ ఖాతాలో పడతాయని భావిస్తున్నారు (2017లో అఖిలేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎస్పీకి 22 శాతం ఓట్లే పోలవ్వడంతో ఆయన పదవిని కోల్పోయారు). దీంతో అక్కడ పరిస్థితి రసకందాయంలో పడింది. ప్రియాంక మేలుకొలుపుతో ఎస్పీకి లాభం పార్లమెంట్ సమావేశాల సమయంలో వెలువడిన సిట్ రిపోర్ట్ ప్రతిపక్షాలకు మంచి ఆయుధం అయింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్షాల దాడికి నాయకత్వం వహించారు. అదే సమయంలో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించి ఈ విషయంపై బీజేపీని ఎండగట్టారు. ఈ అంశం ద్వారా లబ్ధి పొందాలని ఆమె తీవ్రంగా ప్రయత్నించినా.. ప్రయోజనం మాత్రం ఎస్పీకే చేకూరుతుంది.. కాంగ్రెస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదని జనానికి తెలుసు. ఓడిపోయే పార్టీకి ఓటువేసి తమ ఓటును వ్యర్థం చేసుకోకూడదనే నియమాన్ని మన ఓటర్లు ఎటూ తప్పరు కాబట్టి.. గెలిచే పార్టీకే ఓటు వేస్తారు. ఆ విధంగా చూస్తే ప్రియాంక మేలుకొలుపు ఎస్పీకి లాభం చేకూర్చ బోతోంది. బీజేపీ ప్రచారంలో గమనించదగిన మరో విశేషం ఏమిటంటే.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం! ఇటీవల చోటుచేసు కున్న కాశీ కారిడార్ ప్రారంభోత్సవం ఒక రకంగా మతపరమైన వ్యవహారమే. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆ మతంలో యోగిగా గుర్తింపు పొందినవారు. కానీ ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్య నాథ్‌ను పక్కన పెట్టి అంతా తానై కనిపించారు ప్రధాని మోదీ. ్రçపస్తుతం బీజేపీలో బలమైన ‘హిందూ హృదయ సమ్రాట్’ ఎవరు అనే పోటీ ఏర్పడితే కచ్చితంగా అది మోదీయే అని చెప్పడానికి వీలుగా కాశీ కారిడార్ ప్రారంభ కార్యక్రమం సాగింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో పరిస్థితులు చిక్కుముడులను తలపిస్తున్నాయి. కొన్ని ముడులు విప్పడం అసాధ్యం అనిపిస్తున్నది కూడా! – సాబా నఖ్వీ, సీనియర్ జర్నలిస్ట్ -
బ్రాహ్మణ విద్యార్థులకు వరం..'భారతి విద్యా పథకం'
సాక్షి, తాడేపల్లి: పేద బ్రాహ్మణ విద్యార్థులు ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (ఏబీసీ) లిమిటెడ్ ఆధ్వర్యంలో భారతి విద్యా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హులైన విద్యార్థులు 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువు కొనసాగించేందుకు ఈ పథకం ద్వారా ఏటా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. 2019–20 విద్యా సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హతలు వీరే.. విద్యార్థి తల్లిదండ్రులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారై ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తూ ఉండాలి. విద్యార్థి పేరు తప్పనిసరిగా ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. తల్లి, తండ్రి, సంరక్షకుడి వార్షిక ఆదాయం రూ.30 లక్షలకు మించకూడదు. దరఖాస్తుదారులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యా సంస్థల్లో మాత్రమే చదువుతూ ఉండాలి. 2019–20 విద్యా సంవత్సరంలో పాఠశాల, కళాశాల, ఇన్స్టిట్యూట్, విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండాలి. ఆయా కోర్సుల్లో ముందు సంవత్సరంలోని సబ్జెక్టులు అన్నీ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి ఇతర ప్రభుత్వ పథకాల్లో ఈ విధంగా ఎటువంటి ఆర్థిక లబ్ధి పొంది ఉండకూడదు. అయితే అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులే. నగదు ప్రోత్సాహకాలు 1 నుంచి 5వ తరగతి వరకు ఇచ్చే ప్రోత్సాహకం మొత్తం రూ.5 వేలు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.7 వేలు, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, డీఎడ్, డీఫార్మసీ తదితర కోర్సులకు రూ.10 వేలు, డిగ్రీ కోర్సులకు రూ.15 వేలు, వృత్తి విద్యా కోర్సులకు రూ.20 వేలు, పీజీ కోర్సులకు రూ.10 వేలు ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థులకు పొదుపు ఖాతాలో జమ చేస్తారు. దరఖాస్తు చేయడం ఇలా.. అర్హులైన విద్యార్థులు వారి దరఖాస్తులను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆంధ్రాబ్రాహ్మిణ్.ఏపీ.జీఓవీ.ఐఎన్ అనే వెబ్సైట్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులు 15 ఆగస్టు 2019 నుంచి 30 సెప్టెంబర్ 2019 వరకు, ఇతర కోర్సులు చదివే విద్యార్థులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -
బాబు వ్యాఖ్యల్ని ఖండించిన బ్రాహ్మణ సంఘాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ సంఘాలు ఖండించాయి. సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విమర్శలు చేయడం సరైంది కాదని ఆల్ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవి కుమార్ అభిప్రాయపడ్డారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఉన్న కేసులను హైకోర్టు 2018 జనవరిలోనే కొట్టేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకి వస్తాయని చెప్పారు. ప్రతిపక్ష నేత కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేస్తోన్న తప్పులను ఎత్తిచూపినపుడు ఇదే ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మీరు మాట్లాడించలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే అవుతోందని వ్యాక్యానించారు. గతంలో కూడా అనేక సందర్భాలలో సీఎస్‌లు డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల విధులను పర్యవేక్షించారని గుర్తు చేశారు. సీఎస్ డీజీపీ కార్యాలయానికి వెళ్లడమనేది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమన్నారు. -
బ్రాహ్మణులు టీడీపీకి ఎందుకు ఓటేయాలి?
సాక్షి, అనంతపురం కల్చరల్: బ్రాహ్మణుల విషయంలో టీడీపీ వ్యవహారశైలిని బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘బ్రాహ్మణులు తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలి? రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసినందుకా? సంస్కృతి, ఆచార వ్యవహారాలను కించపరచినందుకా?’ అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఆవి ర్భావం నుంచి కూడా హిందూ వ్యతిరేక విధానాలనే అనుసరిస్తోందన్నారు. ము ఖ్యంగా బ్రాహ్మణులపై ద్వేషభావాన్ని ప్రదర్శిస్తూ వస్తోందన్నారు. 1984లో కరణీకం వ్యవస్థను, 1997లో వంశపారంపర్య అర్చక వ్యవస్థను రద్దు చేసి కసి తీర్చుకుందన్నారు. అయినప్పటికీ అధికారం కట్టబెడితే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో మరోసారి మోసం చేసిందన్నారు. నిజాయితీపరుడైన ఐవైఆర్ కృష్ణారావును తొలగించి అవినీతికి మారుపేరైన ఆనందసూర్యను చైర్మన్‌గా చేయడంతో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందన్నారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నించిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను తొలగించడం, మఠాధిపతులకు, పీఠాధిపతులకు మహా ద్వార ప్రవేశాన్ని నిలిపివేసి వారి అవమానించడం దారుణమన్నారు. ఇన్ని దుర్మార్గాలు చేయడంతోపాటు రాజకీయంగా ఏ ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్ కూడా బ్రాహ్మణులకు కేటాయించని టీడీపీని గద్దె దించేందుకు ఇదే చక్కటి అవకాశమని, చంద్రబాబు ఓటమే ధ్యేయంగా పనిచేయాలని బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. మన సంస్కృతిపై వైఎస్.జగన్మోహన్రెడ్డికి సంపూర్ణ విశ్వాసముందని, పీఠాధిపతుల వద్ద ఆయన వినయ విధేయతలు అందరినీ ముగ్ధులను చేశాయని చెప్పారు. అంతేగాకుండా రాజకీయంగా కూడా బ్రాహ్మణులకు నాలుగు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని, అందువల్ల 13 జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఆలయాలకు, అర్చకత్వానికి, ఆచార వ్యవహారాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో కూడా దూపదీప నైవేధ్యాలకు, జీర్ణోద్ధరణకు గురైన దేవాలయాలకు, అర్చక వ్యవస్థకు పెద్దపీట వేయడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు బ్రాహ్మణ సం ఘం పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, అనిల్, వంశీ, భాస్కర్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలు కోరు అని.. ఆయన అసత్యాలను సానుకూల మీడియా వక్రీకరించి పదే పదే ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతోందని విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు ధ్వజమెత్తారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన బ్రహ్మణ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర సహాయం చేయలేదని చంద్రబాబు పదేపదే అబద్దాలను చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటున్న ప్రత్యేక హోదాపై చంద్రబాబు, రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కేవలం రాష్ట్రానికి ఆర్థిక సహాయంతో కూడిన ప్రత్యేక హోదా మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదాతో పనిలేకుండా రాష్ట్రానికి నిధులు కేటాయించిందన్నారు. కేంద్ర బడ్జెట్ సుమారుగా లక్షన్నర కోట్లు కాగా.. రాష్ట్రానికి లక్ష కోట్లు కావాలని అడగడం ఎంతవరకు సమంజసమన్నారు. కేంద్రం విశాఖకు రైల్వేజోన్ ప్రకటించిన 24 గంటల్లో చంద్రబాబు అండ్‌కో మీడియా లేనిపోని అర్థరహిత వ్యాఖ్యానాలు చేసిందన్నారు. ఎక్కడ జోన్ ప్రకటించినా తప్పనిసరిగా రిక్రూట్మోంట్ బోర్డు ఉంటుందని ఇంగిత జ్ఞానం లేకుండా ఆరోపణలు చేశారన్నారు. మాట్లాడితే పోలవరం పాట పాడే బాబు నాలుగన్నరేళ్లు ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బుతో గెలవాలనే తాపత్రయంతో చంద్రబాబు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అబద్దాలు చెప్పే చంద్రబాబును గెలిపించే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో విశాఖ తూర్పు బీజేపీ అభ్యర్థి సుహాసినీ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సమావేశం
-
తొలి ఎన్నికల 'కుల గోత్రాలు'
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత వద్దనుకున్నా, కులం, మతం ప్రభావం ఎక్కువే. తెలుగు రాష్ట్రాలూ అందుకు అతీతం కాదు. అయితే ఏయే సామాజిక వర్గాలు రాజకీయంగా ఆధిపత్యం సాధించాయి? వాటిలో ఏవి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి? ఏ వర్గం మొదట రాజకీయంగా పట్టు కలిగి.. ఆపై కోల్పోయిందనే అంశాలు ఆసక్తికరం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీటికి సంబంధించిన విశ్లేషణలకు సహజంగానే ప్రాధాన్యం ఉంటుంది. గత అరవై ఐదేళ్ల రాజకీయాలకు సంబంధించి సామాజిక వర్గాల వివరాల సేకరణ, విశ్లేషణ క్లిష్టమైనదే అయినా ఒక ప్రయత్నం.. ఎక్కడైనా ఆయా నేతల కులాల వివరాల్లో పొరపాట్లు దొర్లవచ్చు. అవి ఉద్దేశపూర్వకంగా కాదని గమనించగోరుతున్నాము. ముందుగా 1952 నాటి పరిస్థితులు అప్పటి రాజకీయాలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి విశ్లేషణ.. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఒక భాగంగా ఉండేది. కర్ణాటక, మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న భద్రాచలం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో సాయుధ పోరాటం కారణంగా, తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. తర్వాత కమ్యూనిస్టులు పోరాట పంథా వీడి బయటకు వచ్చినా, నిషేధం కొనసాగింది. దాంతో కమ్యూనిస్టులు పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరుతో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని నియోజకవర్గాలను లెక్కలోకి తీసుకుంటే 43 చోట్ల కాంగ్రెస్.. పీడీఎఫ్ 35 చోట్ల గెలుపొందాయి. సోషలిస్టులు 12 చోట్ల గెలుపొందారు. అప్పట్లో షెడ్యూల్ కులాల సమాఖ్య పేరుతో వివిధ రాష్ట్రాలలో అభ్యర్థులు నిలబడేవారు. వారు ముగ్గురు గెలిచారు. అప్పట్లో ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. అంటే ఒక నియోజకవర్గంలో జనరల్ అభ్యర్థి, మరొకరు షెడ్యూల్ కులాలు లేదా తెగల అభ్యర్థి ఉండేవారు. రిజర్వుడు అభ్యర్థికి కనుక జనరల్ అభ్యర్థికన్నా ఎక్కువ ఓట్లు వస్తే అతనినే విజేతగా ప్రకటించేవారు. అలా కొందరు, మరికొన్ని చోట్ల జనరల్ స్థానాలో ఎస్సీ నేతలు గెలుపొందిన చరిత్ర ఉంది. పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు రెండుచోట్లా పోటీచేసి గెలుపొందారు. తొలి ఎన్నికల్లో రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాల వారు అత్యధికంగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో అప్పట్లో బ్రాహ్మణుల హవా బాగా నడిచేది. తర్వాత కాలంలో వారి ప్రభ తగ్గుతూ వచ్చింది. కానీ రెడ్డి సామాజికవర్గం రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతోంది. ఆ తర్వాత వెలమ వర్గం ప్రాధాన్యం పొందింది. సంఖ్య రీత్యా తక్కువే అయినా కరీంనగర్ జిల్లాలో వారి ప్రభావం కనిపిస్తుంది. 1952 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం 24 చోట్ల గెలిస్తే, బ్రాహ్మణులు 26 చోట్ల గెలిచారు. వెలమలు నాలుగు చోట్ల, ముస్లింలు, బీసీలు ఎనిమిది చొప్పున స్థానాల్లోనూ గెలిచారు. తొలి ఎన్నికలో 24 మంది రెడ్లు.. తెలంగాణలో తొలి నుంచీ రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా గట్టి పట్టుండేది. కాంగ్రెస్‌లో కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి ప్రముఖులు ఉంటే, పీడీఎఫ్ (కమ్యూనిస్టులు)లో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల కమలాదేవి వంటి ప్రముఖులు ఉండేవారు. 1952 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం వారు కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది గెలిస్తే, పీడీఎఫ్ నుంచి పది మంది విజయం సాధించారు.ప్రస్తుత రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో రెడ్ల ప్రాబల్యం అప్పటి నుంచే ఉన్నట్లు ఈ ఫలితాలను విశ్లేషిస్తే అర్ధమవుతుంది. ఇంకా సోషలిస్టు పార్టీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లుగా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గీయులు నాటి ఎన్నికల్లో గెలుపొందారు. బ్రాహ్మణులు 26 మంది.. తెలంగాణలో స్వాతంత్య్రోద్యమ సమయం నుంచే బ్రాహ్మణులు గట్టి పాత్ర పోషించారని చెప్పాలి. బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, పి.హనుమంతరావు, ముందుముల నరసింగరావు, గోపాలరావు ఎక్బోటే వంటి ప్రముఖులది రాజకీయాల్లో కీలకపాత్ర. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. నాడు కాంగ్రెస్ నుంచి 14 మంది బ్రాహ్మణులు ఎన్నికైతే, పీడీఎఫ్ నుంచి 11 మంది, సోషలిస్టు పార్టీ నుంచి ఒకరు ఈ సామాజిక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వెలమలు: ప్రభావం ఎక్కువే సంఖ్యాపరంగా తక్కువైనా.. వెలమ సామాజిక వర్గానికి తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీల గెలుపోటములను వారు నిర్దేశించే స్థాయిలో ఉంటారు. 1952 ఎన్నికల నుంచీ ఇది కొనసాగుతోంది. 1952లో నలుగురు వెలమ ఎమ్మెల్యేలు ఎన్నికైతే వారిలో ఇద్దరు పీడీఎఫ్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌గా మరొకరు గెలుపొందారు. ముస్లింలు ఎనిమిది మంది.. హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంటుంది. నిజాం రాజ్యంలో వారికి ఎనలేని ప్రాముఖ్యత ఉండేది. స్వాతంత్య్రానంతరం పరిస్థితులు మారాయి. అయినా తెలంగాణ ప్రాంతం నుంచి ముస్లింలు గణనీయ సంఖ్యలోనే గెలుస్తుంటారు. 1952లో కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది ముస్లింలు గెలిచారు. అప్పట్లో మజ్లిస్ పార్టీ ఇంకా పుంజుకోలేదు. మతపరమైన విభజనతో ఓట్లు వేయడం కూడా అప్పట్లో తక్కువే అని చెప్పాలి. మొత్తంగా ఎనిమిది మంది ముస్లింలు తొలి ఎన్నికల్లో విజయం సాధిస్తే.. వీరిలో ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు పీడీఎఫ్, ఒకరు ఇండిపెండెంట్. ఈ ఎన్నికల్లోనే మాసూనా బేగం, నవాబ్ జంగ్ వంటి ప్రముఖులు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారు. బీసీ వర్గాల నుంచి 8 మంది.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అన్ని సామాజిక వర్గాలలో రాజకీయ చైతన్యం పెద్దగా ఉండేది కాదు. ప్రత్యేకించి బీసీ వర్గాలలో సంఖ్యాపరంగా ప్రజలు ఎక్కువగానే ఉన్నా, వారి నుంచి అసెంబ్లీకి ఆ నిష్పత్తిలో ఎన్నికవడం తక్కువగానే ఉండేది. దీనికి కారణం బీసీలలో అనేక సామాజిక వర్గాలు ఉండటమే. పైగా వారు సంఘటితం కావడం కూడా తక్కువగానే ఉండేది. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ, సంగం లక్ష్మీబాయి, జి.రాజారాం వంటి ప్రముఖులు రాజకీయాల్లో రాణించి వన్నె తెచ్చారు. మొత్తం ఎనిమిది మంది బీసీలు ఎన్నిక కాగా ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు పీడీఎఫ్, ఇద్దరు సోషలిస్టు పార్టీల నుంచి, మరొకరు ఇండిపెండెంటుగా గెలిచారు. వీరిలో మున్నూరు కాపులు ముగ్గురు, పద్మశాలి, యాదవ, గౌడ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఎస్సీలు 24 మంది.. తెలంగాణ ప్రాంతంలోని వివిధ ద్విసభ్య, జనరల్ నియోజకవర్గాల నుంచి 24 మంది షెడ్యూల్ కులాల నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 9, పీడీఎఫ్ నుంచి ఏడుగురు, సోషలిస్టు పార్టీ నుంచి నలుగురు, షెడ్యూల్ కులాల సమాఖ్య నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్‌గా ఒకరు నెగ్గారు. అరిగే రామస్వామి, జేబీ ముత్యాలరావు వంటి ప్రముఖులు కాంగ్రెస్ నుంచి, ఉప్పల మల్సూర్ పీడీఎఫ్, కోదాటి రాజమల్లు సోషలిస్టు పార్టీ నుంచి గెలుపొందారు. పెద్దపల్లి, ఖమ్మం, మంథనిల నుంచి జనరల్ సీట్లలో ఎస్సీ అభ్యర్థులు గెలిచారు. గిరిజనులు ఇద్దరు విజయం సాధించారు. -
నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి
-
‘పచ్చ మీడియాను డిజప్పాయింట్ చేస్తున్నా’
సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్ర్యం తర్వాత బ్రాహ్మణులు బాగా నష్టపోయారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖలోని సిరిపురంలో సోమవారం నిర్వహించిన బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. ‘బ్రాహ్మణులు పేరుకు ఉన్నత సామాజిక వర్గమే అయినప్పటికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆర్థిక, రాజకీయ సాధికారిత లేదు. గడిచిన 50 – 60 ఏళ్లలో ఏదైనా వర్గం బాగా నష్టపోయిందంటే అది బ్రాహ్మణ జాతే. బ్రాహ్మణుల్లో ఎంట్రప్రెన్యూర్స్ చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్స్‌పై ఆధారపడతారు. ఇప్పుడు వాళ్లకు ఆ అవకాశాలు కూడా లేవు. టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఒక ఘటన నన్ను బాగా కలిచివేసింది. రామాలయంలో పనిచేసే అర్చకుడు ఆభరణాలు తాకట్టు పెట్టారని ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఆరోజు ఆయన ఇంట్లో పరిస్థితి చూస్తే జాలేసింది. ఈ ఘటనతోనే అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు తక్కువ కాకుండా గౌరవ వేతనం ఇవ్వాలని ప్రపోజల్ పెట్టా. దేవాలయాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వచ్చేలా చూశాం. ప్రధాన అర్చకులకు రూ.50 వేలు పెట్టాం. ఆ రోజు ఇప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతో సపోర్టు చేశారు. పెద్ద ఆలయాల నుంచి చిన్న ఆలయాలకు నిధులు ఇచ్చి తద్వారా ఆ అర్చకులనూ ఆదుకోవాలి. ఇందుకోసం ఆనాడు నేను తీసుకొచ్చిన జీవో 76ను ఒక లెవల్‌కు తీసుకొచ్చాక ఆగిపోయింద’ని అన్నారు. ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి.. ‘అర్చకుల పేరిట ఉన్న సర్వీస్ ఈనాం ల్యాండ్స్, దేవుని పేరిట ఉన్న ల్యాండ్స్‌ను కాపాడాలి. ఇదే ఆలోచనతో కార్పొరేషన్లో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేశాను. రిటైర్డ్ ఎస్పీ, రిటైర్డ్ ఆర్డీవోను, ఒక ఎక్స్పర్ట్ లీడర్‌ను పెట్టాను. గుడవర్తి పద్మావతి కేసులో ఈ కమిటీ పర్ఫెక్ట్గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆమె సోషల్ మీడియాలో వీడియో పెట్టారని కేసు పెడతారా..? ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి ఉంది. అర్చక వృత్తిలో బ్రాహ్మణులొక్కరే కాదు.. ఇతర కులాల వారు కూడా చాలా మంది ఉన్నారు. వారందరినీ ఆదుకోవాలి. ట్రస్ట్ బోర్డులను ధార్మికచింతన ఉన్న వారికే అప్పగించాలి. 2007లో స్థానికంగా ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయడం, అర్చకులకు వారసత్వ హక్కులు పునరుద్ధరించేందుకు రాజశేఖరరెడ్డి గారు చట్టం తీసుకొచ్చారు. బ్రాహ్మణులకు రాజకీయ సాధికారత లేకపోవడం వలన చాలా నష్టపోతున్నాం. మా జనాభా మూడు శాతం ఉందనుకున్నా ఏడుగురు ఎమ్మెల్యేలుండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్‌లో మాలాంటి చిన్న చిన్న కమ్యూనిటీ వారికి అవకాశాలు కల్పించాలి. చివరగా.. పచ్చ మీడియాను డిజప్పాయింట్ చేస్తున్నా. నేను పార్టీలోకి చేరడానికి ఇక్కడకు రాలేదు.. నా వ్యూస్‌ను పంచుకునేందుకు ఇక్కడకు వచ్చా’ -
బ్రాహ్మణుల్లో సాధికారత రావాల్సిన అవసరం ఉంది
-
‘నమ్మినవారే వైఎస్ జగన్‌ను మోసం చేశారు’
సాక్షి, విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ నాయకులు మల్లాది విష్ణు అన్నారు. విశాఖలో బ్రాహ్మణ సంఘాలతో జరిగిన ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్ సీపీ అధ్యకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, కోన రఘుపతి, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ తొలి నుంచి బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకున్నా.. రమణ దీక్షితులను తొలగించారని మండిపడ్డారు. ఆయనను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ బ్రాహ్మణుల సంక్షేమానికి వెయ్యి కోట్లు ఖర్చుపెడితే.. చంద్రబాబు మాత్రం అరకొర నిధులే ఖర్చు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే దేవాలయ భూముల పరిరక్షణకు, బ్రాహ్మణ సంక్షేమానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉండి వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. కోన రఘపతి మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అని తెలిపారు. వైఎస్ జగన్ ఎవరినీ మోసం చేయలేదని.. నమ్మినవారే ఆయన్ని మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మకై వైఎస్ జగన్‌పై కేసులు పెట్టాయని గుర్తుచేశారు. వారు పెట్టిన ఒక్క కేసులో కూడా బలం లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఏ రాజకీయ నాయకుడు చేయనన్నీ పోరాటాలు వైఎస్ జగన్ చేశారని చెప్పారు. ఆదివారం కంచరపాలెంలో వైఎస్ జగన్ సభకు హాజరైన జన సునామీని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్రోల్‌పై 2 రూపాయలు తగ్గించారని అన్నారు. -
రమణ దీక్షితులను ఎందుకు తొలగించారు
-
IYRను తొలగించిన విధానం బాధాకరం
-
బ్రాహ్మణుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం
సాక్షి, అమరావతి: బ్రాహ్మణుల్లో ఐక్యతను దెబ్బతీసి వారి మధ్య చిచ్చు పెట్టడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని బ్రాహ్మణ ఐక్య వేదిక తీవ్రంగా తప్పుపట్టింది. తిరుమల ఆలయంలో జరిగే అపచారాలతో పాటు స్వామి వారి ఆభరణాల భద్రతపై సూటిగా ప్రశ్నించిన రమణదీక్షితులును ఆలయ ప్రధాన అర్చక బాధ్యతల నుంచి తప్పించడా న్ని తప్పుపడుతూ బ్రాహ్మణ ఐక్యవేదిక సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించింది. వంశపారంపర్య అర్చకుల సర్వీసు రూల్స్ అంశంలో ఏపీ సర్కారును ప్రశ్నించిన ఐవైఆర్ కృష్ణారావుపై ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొందరు బ్రాహ్మణులను ఉసిగొలిపి అప్పట్లో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు. తాజాగా రమణ దీక్షితులు అంశంలోనూ అదే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో బ్రాహ్మణులను తిడుతున్న వారికైనా ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగితే సంతోషమన్నారు. కరడుగట్టిన కులస్వామ్య పార్టీలో అలాంటిది సాధ్యం కాదని తాము అభిప్రాయపడుతున్నామన్నారు. రమణదీక్షితులును టీటీడీ ప్రధాన అర్చక బాధ్యతల నుంచి తొలగించడం ఏపీ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యగా గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి సత్యానంద భారతీ స్వామి అభిప్రాయపడ్డారు. రమణదీక్షితులు తిరిగి ఆ బాధ్యతల్లో నియమితులయ్యే వరకు ఐక్యంగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. టీటీడీ ప్రధాన అర్చక బాధ్యతల నుంచి రమణదీక్షితులు తొలగింపు భవిష్యత్‌లో చిన్న ఆలయాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఐవైఆర్ కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీలోనే వంశపారం పర్య అర్చకులను తొలగించిన ప్రభుత్వం చిన్న ఆలయాల్లో తొలగించదా అని ప్రశ్నించారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సూటిగా జవాబు చెప్పిన వారు లేరని.. ఆయా అంశా లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘బాబు చేసింది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో నాలుగు శాతం మేర బ్రాహ్మణులు ఉన్నారని, రూ.1.45 లక్షల కోట్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి రావాల్సి ఉందన్నారు. ఇదంతా ఐవైఆర్ కృష్ణారావు చెప్పడం వల్లనే ఆయన తొలగించారని ఆరోపించారు. చంద్రబాబు బ్రాహ్మణ వ్యతిరేకని, కనీసం ఒక్క అభ్యర్థికి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయారన్నారు. టీటీడీపై రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. వెంకన్నభక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ దీక్షితులు ప్రశ్నింస్తుండటం వల్లే ఆయనపై దాడి చేయిస్తున్నారని తెలిపారు. -
ఎవరైనా ప్రశ్నిస్తే కౌంటర్ దాడులు చేయిస్తున్నారు
-
‘బ్రాహ్మణులను బ్రాహ్మణులతో తిట్టించాలనే..’
సాక్షి, విజయవాడ: శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి దారుణమని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని మండిపడ్డారు. జీవో 76 అమలు చేస్తున్నామని ప్రభుత్వం లీకులిస్తోందన్నారు. 1986 దేవాదాయ చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం సవరించిందని గుర్తు చేశారు. దీని వల్ల చిన్న చిన్న ఆలయాలు మూతపడ్డాయని తెలిపారు. 2007లో ఈ చట్టాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సవరించారని వెల్లడించారు. 1986 చట్ట సవరణతో మిరాశీ పోయిందని, 2007 చట్ట సవరణతో మరోసారి మిరాశీ అంశంపై స్పష్టంత వచ్చిందన్నారు. దీనిని అర్ధం చేసుకోవడానికి ముఖ్యమంత్రికి సమయం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు తాను పనిచేయడం కన్నా.. చేస్తున్నాననే దానికే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. బ్రాహ్మణులతో బ్రాహ్మణులతో తిట్టించాలనే పాలసీలని పెట్టుకున్నారన్నారు. కరుడుకట్టిన కులస్వామ్యంతో తెలుగుదేశం పార్టీ నడుస్తోందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కౌంటర్ దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఆగమ పరీక్షలో ఫెయిలైన వారిని ప్రధాన అర్చకుడిగా నియమిస్తారా అని ప్రశ్నించారు. వారసత్వానికి కూడా సమర్ధత వుండాలన్నారు. శాతవాహన కాలేజీని ఆక్రమించేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే మద్దుతు రావడం దారుణమన్నారు. -
‘టీటీడీని చెప్పుచేతుల్లో పెట్టుకుంటోంది’
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్ధానంను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం చూస్తోందని బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. బ్రాహ్మణ ఐక్య వేదిక ఆద్వర్యంలో స్థానిక గాయత్రి కన్వెన్షన్‌లో బ్రాహ్మణ సంఘాలు భేటీ అయ్యాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం, అర్చకవృత్తి పై జరుగుతున్న కుట్రకు నిరసనగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐక్య వేదిక నేతలు మాట్లాడుతూ.. అర్చకుల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణమన్నారు. ఇప్పటివరకు గుర్తుకురాని వయోపరిమితి హఠాత్తుగా ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. కేవలం క్షక్ష సాధింపులకే తమకు అనుకూలంగా ప్రభుత్వం నిబంధలను ప్రభుత్వం మార్చుకుంటోందని విమర్శించారు. తెలుగుదేశం మేనిఫెస్టోలో 500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, కానీ ఎన్నికోట్లు కేటాయించారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. అర్చకుడికి రిటైర్మెంట్ లేదని టీడీపీ తన మేనిఫేస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. మరి 72 ఏళ్ళ రమణదీక్షితులును ఎలా తొలగించారని నేతలు ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ళ పాటు పనిచేసిన తరువాత, ఇప్పుడు ఆయన వయసు గుర్తుకువచ్చిందా అన్నారు. ప్రభుత్వ వైఖరి చూస్తే హిందూ వ్యతిరేకత కనిపిస్తోందని తెలిపారు. ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక నేతలు డాక్టర్ పార్థసారధి, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ద్రోణం రాజు రవికుమార్‌లతో పాటు గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సత్యానంద భారతీ స్వామి, వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్యే కోన రఘుపతి, మల్లాది విష్ణు, బ్రాహ్మణ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. (విజయవాడలో జరిగిన బ్రాహ్మణ ఐక్య వేదిక సమావేశం) బ్రాహ్మణ ఐక్య వేదిక తీర్మానాలు సత్యనారాయణ పురంలోని సీతారామ కళ్యాణ మంటపంను బ్రాహ్మణ సంఘాలకు అప్పగించాలి రమణ దీక్షితులుకు వంశపారంపర్యంగా వచ్చిన తన హక్కును కల్పించాలి సదావర్తికి భూములను ఇచ్చిన దాతల స్పూర్తిని కొనసాగించాలి ఐవైఆర్ పట్ల చూపిన అనుచిత వైఖరికి క్షమాపణ చెప్పాలి దుర్గగుడి లో తాంత్రిక పూజలపై నివేదికను బహిర్గతం చేయాలి -
వివాదంలో టీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే
-
‘బాబు బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారు’
కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసమే నంద్యాలకు నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ఇస్తామని చెప్పి, కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదని కోన రఘుపతి వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ తొలి ఏడాది రూ.25 కోట్లు, 2015-16లో రూ.35 కోట్లు ఇచ్చి బ్రాహ్మణులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు.