స్వాతంత్ర్యం తర్వాత బ్రాహ్మణులు బాగా నష్టపోయారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖలోని సిరిపురంలో నిర్వహించిన బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్లో సాధికారత రావాల్సిన అవసరం ఉందన్నారు.