brahmin welfare parishad
-
అసలు ఉన్నట్టా? లేనట్టా?.. సీఎం రేవంత్‌కి హరీష్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆగమ్య గోచరంగా మారిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. ''రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?'' అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.సీఎంగా కేసీఆర్.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారని లేఖలో పేర్కొన్న హరీష్‌రావు.. పలు డిమాండ్లను ప్రస్తావించారు. ‘‘బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి. వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలి'' అని కోరారు.బ్రాహ్మణ ఎంటర్ ప్రెన్యూయల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలి. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలి'' అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
బ్రాహ్మణ పరిషత్ ప్రతిపాదనలకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రతిపాదించిన పలు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విదేశీ విద్య పథకం కింద రూ. 5 లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ విధానాల ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చేయటానికి ఏర్పరచిన పథకాన్ని ఆమోదించింది. వేద పాఠశాలలకు రూ. 2 లక్షల గ్రాంట్ మంజూరు చేయడానికి అంగీకరించింది. 75 ఏళ్లు నిండిన వేద పండితులకు నెలకు రూ. 2,500 చొప్పున గౌరవ పారితోషికం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. శాస్త్ర పారంగతులు వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 250 చొప్పున స్టైఫండ్ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్మార్ధం పూర్తి చేసిన వారికి రూ. 3 లక్షలు, వేద పాఠశాలల నుంచి బయటకు వచ్చే ముందు, క్రమాంతం, గణాంతం చదువుకున్న వారికి రూ. 5 లక్షల ప్రత్యేక గ్రాంట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. కుటీర పరిశ్రమ ఏర్పాటుకు సబ్సిడీ.. బ్రాహ్మణుల్లో రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలన్నా లేదా వ్యాపారం చేసుకోవాలన్నా రూ. 1 లక్ష ప్రాజెక్టు అయితే 80 శాతం సబ్సిడీ, రూ. 12 లక్షల లోపు ప్రాజెక్టు అయితే రూ. 5 లక్షలు మించకుండా 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇంతకు ముందు మంజూరైన వాటిలో ఈ నియమం పాటించిన వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం సూచించింది. విదేశీ విద్య పథకం, బ్రాహ్మణ ఉపాధి పథకాల కింద దరఖాస్తు చేయదలచిన వారు అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 20న జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో 2018–19 ఏడాదికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు సమాచారం. -
ఎంపిక చేశాక.. పథకమే లేదన్నారు!
సాక్షి, హైదరాబాద్: నిన్నటి వరకు..: రూ. వంద కోట్ల నిధులు.. 17 రకాల పథకాలు.. వరుసగా పాలకమండలి సమావేశాలు.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.. అర్హుల ఎంపిక, రుణాల మంజూరు కసరత్తు.. ఇప్పుడు..: కేవలం మూడు పథకాలకే ప్రభుత్వ ఆమోదం... మిగతా పథకాలు మాయం.. ఎంపికైన లబ్ధిదారుల్లో ఆందోళన.. పనికి రాకుండా పోయిన కేటాయింపు పత్రాలు, మంజూరు పత్రాలు.. ... ఇది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ దుస్థితి. నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు మేలు చేసేందుకు రూ.100 కోట్ల బడ్జెట్, 17 రకాల పథకాలను ప్రకటించినా ఆచరణలోకి మాత్రం రాలేదు. ఆయా పథకాలకు లబ్ధిదారులుగా ఎంపికైన పేద బ్రాహ్మణ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అర్హులను ఎంపిక చేసినా.. పేద బ్రాహ్మణులను ఆదుకోవడానికి ప్రభు త్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 17 పథకాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు యూనిట్ల స్థాపనకు రుణాలు, విదేశాల్లో పేద విద్యార్థులకు విద్యా రుణాలు, వేద పాఠశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం తదితర అంశాలకు సంబం« దించి భారీగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన పరిషత్.. అర్హులను ఎంపిక చేసి, మంజూరు పత్రాలను జారీ చేసింది. దీనికి సంబంధించి రూ.2 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. కానీ తర్వాత వెలువడిన జీవో నం.584తో గందరగోళం మొదలైంది. వివేకానంద విదేశీ విద్యా పథకం, రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, వేద పాఠశాలలకు ఆర్థిక సాయం పథకాలకు మాత్రమే ఆమోదం ఉందని అందులో తెలిపారు. దాంతో మిగతా పథకాలను తొలగించినట్టేనని వార్తలు వెలువడటంతో.. అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని ఔత్సాహికులకు పారిశ్రామిక రుణాలు అందించే ‘బ్రాహ్మ ణ ఎంట్రప్రెన్యూర్స్ డెవలప్మెంట్ స్కీం (బెస్ట్)’ కింద రుణాల కోసం ఎదురుచూస్తున్నవారు షాకయ్యారు. బెస్ట్ కింద తొలివిడతగా 155 మందిని ఎంపిక చేయగా.. కొందరు ఇప్పటికే ప్రైవేటుగా అప్పులు తెచ్చి యూనిట్ల ఏర్పాటు పనులు ప్రారంభించుకున్నారు. ఇప్పుడు రుణాలందకుంటే తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖ ఆమోదించనందునే.. సీఎం ఆమోదం మేరకే 17 పథకాలకు రూపకల్పన చేసినా మూడింటికే ఆమోదం రావటమేమిటని పాలకమండలి ఆరా తీయగా.. వాటిని ఆర్థిక శాఖ ఆమోదించలేదనే సమాచారం తెలియడంతో సీఎంను కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు పరిషత్ పాలకమండలి సభ్యులు వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, పురాణం సతీశ్‌లకు బాధ్యత అప్పగించారు. పథకాలన్నీ పునరుద్ధరిస్తాం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పరిషత్ ఏర్పడి తదనుగుణంగానే పథకాలకు రూపకల్పన చేసింది. కానీ ఆర్థిక శాఖ నుంచి యథాలాపంగా వెళ్లిన ఓ ఫైలు వల్ల ఈ అయోమయం ఏర్పడింది. త్వరలోనే సీఎంతో చర్చించి పథకాలన్నీ అమలయ్యేలా చూస్తాం.. – రమణాచారి, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ -
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ సంక్షేమపరి షత్కు రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు.