ఏడుగురికి జీవితానిచ్చిన డ్రైవర్
కోయంబత్తూర్: బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలతో ఏడుగురికి ప్రాణంపోసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. ఎరోడ్ జిల్లా కుమలన్కుట్టాయ్కి చెందిన నటరాజన్(36) ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 20న అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హైబీపీ వల్ల బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్సకు స్పందించకపోవడంతో నటరాజన్ అవయవాలను దానం చేయాల్సిందిగా కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి, కేఎంసీహెచ్ వైద్యులు అతని కుటుంబ సభ్యులకు సూచించారు.
వారి అంగీకారంతో నటరాజన్ గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్లు, చర్మం దానం చేయాలని నిర్ణయించారు. కాలేయం, కిడ్నీలను కేఎంసీహెచ్లోని పేషెంట్లకు అమర్చగా, గుండెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కళ్లు, చర్మాన్ని స్థానిక ఆస్పత్రులకు పంపించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.