brain function
-
స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే!
న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్‌లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది. చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్‌లను విశ్లేషించారు... ► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది ► దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి ► జ్ఞాపకశక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి ► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి ► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి ► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి ► ముఖ్యంగా ‘ట్యాబ్’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. ► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. ► డిజిటల్ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్ రచయిత, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు. -
మెదడు వేడెక్కుతుంటుంది... ఎందుకలా!
ఏదైనా సంక్లిష్టమైన పెద్ద సమస్య వచ్చినప్పుడు పరిష్కారాలు ఆలోచిస్తుంటే... ‘మెదడు వేడెక్కిపోతోంది’ అనడం మామూలే. అదేదో చమత్కారం కోసం అనే మాట కాదంటున్నారు నిపుణులు. చాలాసేపట్నుంచి వాడుతున్న ల్యాప్‌టాప్ లాగా, ఎంతోసేపట్నుంచి నడిచిన ఇంజన్ లాగే మెదడూ వేడెక్కుతుందంటున్నారు పరిశోధకులు. ఈ మెదడు వేడికీ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కోలుకునే తీరుకు సంబంధం ఉందని గుర్తించడంతో... దీనిపై ఇంకా ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మామూలుగా మనుషుల నార్మల్ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్. కానీ నిరంతరం మెదడు చేసే పనుల కారణంగా దాని ఉష్ణోగ్రత దాదాపు 104 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుందని తేలింది. ఇలా జరగడం ఏ లోపాన్నీ సూచించదనీ, నిజానికి ఇదో ఆరోగ్యకరమైన సూచిక అని వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రతను చూసి కొన్నిసార్లు పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు. ఉదాహరణకు... ‘మెదడుకు ఏదైనా గాయమైనప్పుడు... దాని కారణంగా ఇలా జరుగుతుందేమోనంటూ గతంలో ఇలాంటి ఉష్ణోగ్రతలను చూసినప్పుడు భావించేవారు. ఒకవేళ ఇదే ఉష్ణోగ్రత దేహంలోని ఏ భాగంలోనైనా నమోదైతే దాన్ని తప్పక జ్వరంగా పరిగణిస్తార’ని వ్యాఖ్యానించారు ఇంగ్లాండ్‌లోని మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ లాబోరేటరీ ఆఫ్ మాలెక్కులార్ బయాలజీకి చెందిన పరిశోధకుడు జాన్–ఓ–నీల్. మెదడు ఉష్ణోగ్రత తెలిపే ఎమ్మారెస్ అనే టెక్నిక్ మెదడు ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొంతమంది వలంటీర్లపై ఈ పరిశోధనలు చేశారు. వీరంతా 20 – 40 ఏళ్ల మధ్యవారు. ఇలా కొలవడానికి ‘మాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రోస్కోపీ (ఎమ్ఆర్ఎస్) అనే టెక్నిక్‌ను ఉపయోగించారు. అంతేకాదు... ఈ డాటాను వారు సర్కేడియన్ రిథమ్తోనూ సరిపోల్చారు. ఉష్ణోగ్రత ఫలితాలనూ, సర్కేడియన్ రిథమ్‌తో పోల్చుతూ మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. మెదడు ఉష్ణోగ్రత ఎంత? సాధారణంగా మెదడు ఉష్ణోగ్రత 101.3 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది. ఇది నాలుక కింది ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు ఎక్కువ. మళ్లీ ఈ కొలతల్లో కూడా వ్యక్తి వయసు, జెండర్, మహిళ అయితే రుతుసమయం... ఇలాంటి అంశాలన్నీ బ్రెయిన్ టెంపరేచర్‌ను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించారు. కీలకమైన విషయం ఏమిటంటే... పురుషుల మెదడు ఉష్ణోగ్రతల కంటే మహిళల్లో ఎక్కువ. ఈ ఉష్ణోగ్రతలకూ... ఏదైనా ప్రమాదం జరిగి మెదడుకు దెబ్బ (ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ) తగిలితే కోలుకునే తీరుకు సంబంధం ఉందని చెబుతున్నారు. అంతేకాదు... ఈ టెంపరేచర్ ఆధారంగానే ఇలా ప్రమాదం జరిగి కోలుకున్నాక... భవిష్యత్తులో మెదడుకు రాబోయే ముప్పు వివరాలూ తెలుస్తాయనీ, అందుకే 24 గంటల పాటు ఉష్ణోగ్రత వివరాలతో మరిన్ని పరిశోధనలు జరగాలంటున్నారు మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ లాబోరేటరీ ఆఫ్ మాలెక్కులార్ బయాలజీ విభాగంలోని న్యూరాలజిస్ట్ / మహిళా సైంటిస్ట్ నీనా జెకోర్జెక్. -
అద్భుత విజయం: పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి..
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన ఘనత సాధించారు. పక్షవాతానికి గురై పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోయిన వాళ్ల నుంచి.. చెప్పదల్చుకున్న విషయాల్ని బయటకు రప్పించే టెక్నాలజీని రూపొందించారు. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ Speech Neuroprosthesisతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్రెయిన్ నుంచి గొంతు ద్వారా సిగ్నల్స్ సేకరించి, అటుపై పేషెంట్లు చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదురుగా ఉన్న తెరపై వేగంగా డిస్ప్లే చేస్తాయి. ఫ్లోరిడా: కాలిఫోర్నియా యూనివర్సిటీ(UCSF) న్యూరోసర్జన్ డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల తర్వాత ఈ విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి పరిశోధనలే జరిగినప్పటికీ.. చేతి కండరాల కదలికల ద్వారా చెప్పదల్చుకున్న విషయాన్ని రాబట్టడం లాంటి ఫలితాలొచ్చాయి. కానీ, కాలిఫోర్నియా బృందం సాధించిన విజయంలో.. నేరుగా స్వర వ్యవస్థకే అనుసంధానమై ఉండడం వల్ల ఒక్కో అక్షరం కాకుండా, ఒకేసారి ఎక్కువ పదాలను తెరపై చూపించేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా సాధారణ వ్యక్తి మాట్లాడగలిగినట్లే.. పెరాలసిస్ బారినపడ్డ వ్యక్తి నుంచి(75 శాతం) సందేశాలను ఆశించొచ్చు. పైగా ఇది సంక్లిష్టమైన పద్ధతి కాదని, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ వెల్లడించారు. ‘స్టెనో’ పేరుతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్‌కు ఫేస్బుక్ స్పాన్సర్ చేసింది. పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి సహజంగా పదాలను బయటకు తెప్పించడం నిజంగా ఓ అద్బుత విజయంగా పేర్కొంటూ న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ఈ పరిశోధనకు సంబంధించిన విషయాల్ని ప్రచురించింది. కేవలం పక్షవాతానికి గురైమాత్రమే కాదు.. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో, షాక్‌లతో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంటారు. వాళ్ల కోసం ఈ న్యూరాల్ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని ఆ జర్నల్‌లో పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు. జుకర్‌బర్గ్ ఖుష్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా(సిగ్నల్స్ చేరివేత ద్వారా) పేషెంట్ చెప్పాలనుకున్న విషయం తెరపై దానికదే టైప్ కావడం ఈ న్యూరల్ టెక్నాలజీ ప్రత్యేకం. ఇక తమ సౌజన్యంతో రూపొందించిన ఈ న్యూరల్ టెక్నాలజీ ఘన విజయంపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘బ్రావో’ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో 15 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో గాయపడి కదల్లేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిపై కాలిఫోర్నియా ప్రొఫెసర్లు పరిశోధనలు చేశారు. ‘నాకేం దాహంగా లేదు, నా వాళ్లను పిలవండి, బాగానే ఉన్నా’ లాంటి పదాల్ని ఆ వ్యక్తి వ్యక్తం చేశాడు. -
ఇచట వేడి వేడిగా ధైర్యం నూరి పోయబడును
కొందరు పట్టపగలైనా సరే పిల్లిని చూసి భయపడతారు. కొందరు ఎవరూ కనిపించని అర్ధరాత్రిలో పులి ఎదురొచ్చినా ధైర్యం కోల్పోరు. ‘ఎందుకిలా?’ అనే ప్రాచీన ప్రశ్నకు జవాబు కోసం ఎంత దూరమైనా పోవచ్చు. ‘అదంతే’ అని ఈజీగానూ సర్దుకుపోవచ్చు. ఇక అలా సర్దుకు పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. తాము రూపొందించిన ‘డీకోడెడ్ న్యూరో ఫీడ్‌బ్యాక్’ టెక్నాలజీతో మెదడు పనితీరులో మార్పులు తీసుకువచ్చి భయాలు, ఫోబియాలు, ఒత్తిడి, ఆత్మన్యూనత... మొదలైన వాటిని తొలిగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ధైర్యంతో ముందుకు తీసుకుపోవచ్చని అంటున్నారు. దీని కోసం జపాన్‌లోని సైక అడ్వాన్స్డ్ టెలికమ్యూనికేషన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఆర్ఐ ఇమేజింగ్‌లను వాడుకున్నారు. తమ ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు. చూద్దాం మరి! -
నాణ్యమైన నిద్రతోనే మెదడు హెల్దీ
మనకు కేవలం నాలుగు గంటల నిద్ర సరిపోతుందని కొందరు చెబుతుంటారు. ‘మత్తు వదలరా... నిద్దుర మత్తు వదలరా’ అని సినిమా పాట వినిపిస్తూ... చాలాసేపు నిద్రపోవడం బద్దకస్తుల లక్షణమనీ, అది తమోగుణం అని హితవు చెబుతుంటారు. కానీ ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అంటున్నారు సింగపూర్ పరిశోధకలు,. అక్కడి డ్యూక్–ఎన్‌యూఎస్ గ్రాడ్యుయేట్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు... కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల మీద కొన్ని న్యూరోసైకలాజికల్ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మారై బ్రెయిన్ స్కాన్లు తీశారు. ఆ ఎంపిక చేసిన వ్యక్తుల నిద్రపోయే సమయాన్నీ, నిద్ర నాణ్యతను రెండేళ్ల పాటు పరీక్షించాక కొన్ని విషయాలను తెలుసుకున్నారు. అదేమిటంటే... సాధారణంగా అందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ కొద్దీ మెదడు శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అయితే ఏడు గంటల పాటు నాణ్యమైన నిద్రను అనుభవించేవారిలో ఇలా క్షీణించే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుంటుందనీ, దాంతో వారి మెదడు యవ్వనంలో ఉన్నప్పటిలాగే చాలాకాలం పాటు ఉంటుందని తేల్చారు. ఒకవేళ తగినంత నిద్రలేకపోతే వయసు పైబడకముందే మెదడుకు ఏజింగ్ ప్రక్రియ త్వరత్వరగా జరిగి మెదడుకు వృద్ధాప్యం కాస్త త్వరత్వరగా వస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధన ఫలితాలు ‘స్లీప్’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. -
ఇలా చేస్తే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది!
న్యూయార్క్ : ఒకే పనిని అలా ఎక్కువ సేపు చేయటం వల్ల, ఒక క్లిష్టమైన పనిని చేస్తున్నపుడు.. మెదడు కొంచెం మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. ఆలోచనలు రాక తికమక పడిపోతాం.. ఆ కొద్ది క్షణాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తాయి. అలాంటి సమయంలో కొద్ది సేపు మెడిటేషన్ చేయటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందంట. ప్రతి రోజు మెడిటేషన్ చేసే వాళ్లు కావచ్చు, కొత్తగా మొదటిసారి చేస్తున్న వారు కావచ్చు సత్వర ఫలితం ఉంటుందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన ‘‘యాలె యూనివర్శిటీ’’, ‘‘స్వర్త్ మోర్ కాలేజీ’’ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కొంతమంది కాలేజీ విద్యార్థులకు మెడిటేషన్‌కు సంబంధించిన ఆడియోలను ఒక పది నిమిషాల పాటు వినిపించగా.. క్లిష్టమైన పరీక్షల్లో వారు చక్కటి ప్రతిభ కనపరిచారు. క్లాస్ రూం సబ్జెక్టులను విన్న వారు అంతగా రాణించలేకపోవటం గమనార్హం. కాలేజీ విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి ఒక గ్రూపునకు మెడిటేషన్ ఆడియోలను, మరొక బృందానికి టెస్టుకు సంబంధించిన ఆడియోలను వినిపించారు. అయితే మెడిటేషన్ ఆడియోలు విన్న వారు ఎక్కువ చురుకుగా ప్రవర్తించారు. ఇప్పటివరకు వారాల, నెలల తరబడి మెడిటేషన్ చేసే వారు మాత్రమే చురుగ్గా ఉంటారన్న భావన తప్పని తేలింది. మొదటిసారి మెడిటేషన్ చేసిన వారు చురుగ్గా ఉంటారని వెల్లడైంది. -
మెదడు పనితీరును మాటలే చెప్పేస్తాయి
వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం రెండూ తగ్గుతూ ఉంటాయి. ఈ మార్పును తొందరగా తెలుసుకోవడమెలా? మాట్లాడే మాటల్లో వచ్చే తేడాలను గుర్తిస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. మధ్యమధ్యలో విరామం ఇస్తూ పదాలు పలకడం.. కొన్ని పదాలను తరచూ పునరావృతం చేయడం మెదడు ఆలోచన సామర్థ్యం తగ్గిపోతోందనేందుకు తొలి సూచనలని విస్కాన్సిన్ మేడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త స్టెర్లింగ్ జాన్సన్ జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ రకమైన పరిస్థితి అల్జీమర్స్ వ్యాధికి దారి తీయొచ్చని అంచనా. కొంతమందికి కొన్ని బొమ్మలు చూపి వాటిని వర్ణించాలని కోరారు. రెండేళ్ల తర్వాత అవే బొమ్మలను చూపగా వర్ణనకు వారు ఉపయోగించిన పదాల్లో ఎంతో మార్పు కనిపించింది. కొంతమంది తాము గతంలో వాడిన పదాలను తేలిగ్గా మరిచిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4.7 కోట్ల మంది మతిమరుపు వ్యాధితో బాధపడుతుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో ఈ సమస్యకు పరిష్కా రం లభించట్లేదు. ఈ నేపథ్యంలో సమస్యను వేగంగా గుర్తించేందుకు తమ పరిశోధన ఉపయోపడుతుందని స్టెర్లింగ్ జాన్సన్ చెబుతున్నారు. -
చాక్లెట్ లవర్స్ కి స్వీట్ న్యూస్!
వాషింగ్టన్: మీరు తరచూ చాక్లెట్లు తింటారా? అయితే మీకో స్వీట్ న్యూస్..! తరచుగా చాక్లెట్స్ తినేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందట. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. చాక్లెట్లలో ఉపయోగించే కోకో చెట్టు గింజల రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది ప్రాచీనకాలం నుంచి తెలిసిన విషయమే. చాక్లెట్లు తినడం వల్ల గుండెకు కూడా మేలు చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. అయితే చాక్లెట్ల తినడం వల్ల మనిషి మెదడుపై, ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పటివరకు పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో 23 నుంచి 98 ఏళ్ల వయస్సు గల 968 మంది వ్యక్తులపై దక్షిణ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, అమెరికాలోని మైనీ యూనివర్సిటీ, లక్సంబర్గ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన జరిపారు. వీరిపై పలు పరీక్షలు నిర్వహించడం ద్వారా తరచూ చాక్లెట్ల తినే వ్యక్తుల్లో మెదడు పనితీరు కొంత మెరుగ్గా ఉందని, ముఖ్యంగా కంటిచూపు, జ్ఞాపక శక్తి, వర్కింగ్ మెమరీ వంటి సామర్థ్యాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.