కొందరు పట్టపగలైనా సరే పిల్లిని చూసి భయపడతారు. కొందరు ఎవరూ కనిపించని అర్ధరాత్రిలో పులి ఎదురొచ్చినా ధైర్యం కోల్పోరు. ‘ఎందుకిలా?’ అనే ప్రాచీన ప్రశ్నకు జవాబు కోసం ఎంత దూరమైనా పోవచ్చు. ‘అదంతే’ అని ఈజీగానూ సర్దుకుపోవచ్చు. ఇక అలా సర్దుకు పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు.
తాము రూపొందించిన ‘డీకోడెడ్ న్యూరో ఫీడ్‌బ్యాక్’ టెక్నాలజీతో మెదడు పనితీరులో మార్పులు తీసుకువచ్చి భయాలు, ఫోబియాలు, ఒత్తిడి, ఆత్మన్యూనత... మొదలైన వాటిని తొలిగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ధైర్యంతో ముందుకు తీసుకుపోవచ్చని అంటున్నారు. దీని కోసం జపాన్‌లోని సైక అడ్వాన్స్‌డ్ టెలికమ్యూనికేషన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇంటర్నేషనల్ నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఆర్‌ఐ ఇమేజింగ్‌లను వాడుకున్నారు. తమ ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు. చూద్దాం మరి!
Comments
Please login to add a commentAdd a comment