హాలీవుడ్ చిత్రంలో..
‘లాస్ వెగాస్’, ‘బోస్టర్ లీగల్’, ‘డిస్పరేట్ హౌస్‌వైఫ్స్’ లాంటి అమెరికన్ టీవీ సిరీస్‌లలో నటించిన లక్ష్మీ ప్రసన్న ఆ తర్వాత నిర్మాతగా, నటిగా టాలీవుడ్లో బిజీ అయిపోయారు. కొంత గ్యాప్ తర్వాత ఆమె హాలీవుడ్‌కి వెళ్లారు. ‘బాస్మతి బ్లూస్’ టైటిల్‌తో రూపొందిన హాలీవుడ్ చిత్రంలో నటించారామె. ఇందులో సీత అనే అమ్మాయి పాత్ర చేశారు లక్ష్మీప్రసన్న. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకున్న బ్రీ లార్సెన్, డోనాల్డ్, స్కాట్ బకుల ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. డాన్ బ్యారెన్ దర్శకుడు. ఇండియాకు వచ్చిన ఓ సైంటిస్ట్ జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే జరుపుకుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.