brijendrareddy
-
నీకు చేతకాకపోతే రాజీనామా చేయు.. బిజెంద్రారెడ్డి ఫైర్
-
ఎందుకు అంత తొందర.. ముందుంది ముసళ్ల పండుగ
-
ఎవరు అధైర్య పడవద్దు
-
లోకేష్ కు చురకంటించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
-
YSRCP నేతలపై తప్పుడు వార్తలు రాయడమే ఏబీఎన్ పని: గంగుల బ్రిజేంద్ర రెడ్డి
-
ఆళ్లగడ్డలో MLA బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర
-
రచ్చబండ లో గంగుల బ్రిజేంద్ర రెడ్డి
-
అయ్యన్న లాంటి బఫూన్ ని పట్టించుకోనవసరం లేదు
-
‘దోచుకున్నారు కాబట్టే.. బుద్ధి చెప్పారు’
సాక్షి, కర్నూలు: వర్షాలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేని నేతలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మాట్లాడే హక్కులేదని ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ప్రజలకు సేవ చేస్తే స్వాగతిస్తాం. సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. అంతేగాని ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలని’’ ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు. (చదవండి: 100 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు...?) గత ఐదేళ్లలో ప్రజల మీద పడి దోచుకున్నారు కాబట్టే టీడీపీకి తగిన బుద్ధి చెప్పారని బిజేంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నేత ఎస్వీ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని, గత ప్రభుత్వ హయాంలో వార్డులో సీసిరోడ్లు వేసి డ్రైనేజీ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ రోజు ఇళ్లలోకి నీరు చేరి సమస్య వచ్చిందని ఆయన పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి) -
మూగబోయిన ఆలమూరు
రుద్రవరం: ‘హైదరాబాద్లో ఉద్యోగం చూసుకుంటా. మీకు ఏ లోటు లేకుండా కళ్లలో పెట్టుకుంటా’నని వెళ్లిన ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడంటే ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు నెలల క్రితం తమ కనుల పంట నదిలో గల్లంతయ్యాడని తెలిసి ఏడ్చి ఏడ్చి వారి కళ్లలో నీరింకిపోయింది. కడసారి చూపునకైనా నోచుకుంటామో లేదోననే ఆ వృద్ధ దంపతులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఎట్టకేలకు మృతదేహం లభించగా.. శనివారం అధికారులు స్వగ్రామమైన ఆలమూరుకు చేర్చారు. రెండు నెలల మౌనం వీడి ఒక్కసారిగా కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. తల్లిదండ్రులు సహా గ్రామస్తుల్లో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పెద్దనాగిశెట్టి, లక్ష్మీనర్సమ్మల కుమారుడైన ప్రహ్లాదుడు(23) గత జూన్ 3వ తేదీన చిరుద్యోగం కోసం హైదరాబాద్లోని మేన మామ వరసైన మురళి వద్దకు చేరుకున్నాడు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ఆయన విజ్ఞాన్జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్తూ ప్రహ్లాదుడిని వెంటపెట్టుకుని వెళ్లాడు. హిమాచల్ప్రదేశ్లోని దిండి జిల్లాలో ఉన్న బియాస్ నది వద్ద జూన్ 8న విద్యార్థులంతా ఫొటోలు దిగుతుండగా నదిలోకి అకస్మాత్తుగా నీరు విడుదల చేయడంతో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. వారిని అప్రమత్తం చేయబోయి ప్రహ్లాదుడు కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఘటనలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం గల్లంతవడం తెలిసిందే. విస్తృత గాలింపు అనంతరం ప్రహ్లాదుడి మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులకు నిర్వహించిన డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహం గుర్తించిన అధికారులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. శనివారం రాత్రి ప్రహ్లాదుడి మృతదేహం ఆలమూరుకు చేరుకుంది. రుద్రవరం తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్యామసుందర్రెడ్డి, టీడీపీ నేత బ్రిజేంద్రారెడ్డి మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఇదివరకే ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రహ్లాదుడి తల్లిదండ్రులకు త్వరలోనే అందిస్తామని తహశీల్దార్ తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.