Brijes tribunal
-
ఆ హక్కు బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు లేదు
పట్టిసీమ, పోలవరం వాటాల పంపిణీపై ఏపీ కొత్త వాదన వాటాలు రావాల్సిందేనంటున్న తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై ఏపీ మరో కొర్రీ పెట్టింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు లేదని.. ఆ అధికారం గోదావరి ట్రిబ్యునల్‌కే ఉందని కొత్త వాదన మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ పట్టిసీమ, పోలవరం వాటాల్ని బ్రిజేశ్ ట్రిబ్యు నలే తేల్చుతుందంటూ కేంద్ర కమిటీలు, బోర్డుల ముందు చెప్పిన ఏపీ.. ఇప్పుడు పూర్తి విరుద్ధమైన వాదన చేస్తుండడం గమనార్హం. అఫిడవిట్ దాఖలు కృష్ణా జలాల విషయంగా తామిచ్చిన తీర్పు పై అఫిడవిట్ దాఖలు చేయాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్ గత నెలలోనే తెలంగాణ, ఏపీ లను ఆదేశించింది. ఈ మేరకు ఏపీ గురు వారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ఎస్సారెస్పీ, వరద కాల్వ, దేవాదుల, సింగూరు నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా పేరుతో తెలంగాణ గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌కు తరలిస్తోందని.. కర్ణాటక, మహారాష్ట్రలు సైతం అదే తరహాలో కృష్ణా నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తున్నా యని అందులో వివరించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ జలాలపై గోదావరి ట్రిబ్యునల్ మాత్రమే పునః సమీక్ష చేయ గలదని.. బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు ఆ అధికారం లేదని పేర్కొంది. ఇక తెలంగాణ మైనర్ ఇరిగేషన్ కింద ఎక్కువ నీటిని వినియోగిం చుకుంటూ లెక్కల్లో తక్కువగా చూపుతోం దని ఆరోపించింది. ఆ లెక్కలను తేల్చి ఏపీకి కృష్ణా జలాల్లో వాటా పెంచాలని కోరింది. తెలంగాణకు వాటా పెరగాల్సిందే.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఏపీ 160 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలిస్తున్నందున.. అందులో తెలం గాణకు 73 టీఎంసీలు దక్కాలని తెలంగాణ మరోసారి స్పష్టం చేయనుంది. దీనిపై త్వరలో అఫిడవిట్ సమర్పించనుంది. -
కొత్త ట్రిబ్యునల్‌తోనే రాష్ట్రానికి న్యాయం
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకోసం ప్రభుత్వ పోరాటం బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై విచారణ పరిధిని రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిలిపి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని వివరిస్తూనే నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం- 1956 లోని సెక్షన్ 5(3) ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మొత్తం జలాలపై పునఃసమీ క్షతో న్యాయం చేయాలని పిటిషన్లో కోర నుంది. ఈ పిటిషన్‌కు తుది రూపునిచ్చేందుకు ఆదివారం ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులతో భేటీ అయ్యారు. పిటిషన్లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చలు జరిపారు. నిజానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటారుుంపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటారుుంపులు ఎలా జరపాలన్నది ట్రిబ్యునల్ నిర్ణరుుంచాల్సి ఉంటుంది. అయితే దీనిని ట్రిబ్యునల్ తీర్పు లో ప్రస్తావిస్తూ, కేంద్రం సెక్షన్ 89ను ఎం దుకు పొందుపరిచిందో అర్థం కావడం లేదు అన్న తరహాలో స్పందించింది. ప్రస్తుతం వివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం అయితే వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ట్రం లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాలి. అప్పటి వరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ కూడా ముగిసి పోతుంది. ప్రస్తుత ఏడాది అలాంటి పరిస్థితులే ఎదురై సాగర్ కింద ఆయకట్టుకు నీరివ్వలేని గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న కాస్త నీటిని తాగు అవసరాల కోసం నిత్యం గుంజులాడుకుంటున్నాయి. సరిపోని కేటారుుంపులు.. ఈ పరిస్థితులు సుప్రీంకు అర్థమయ్యేలా వివ రించాలని వీరి భేటీలో నిర్ణయం చేసినట్లుగా సమాచారం. కృష్ణా పరివాహకం తెలం గాణలో 68.5% ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటారుుంపుల్లో 35% మేర మాత్రమే ఉన్నారుు. తెలంగాణలో ఉన్న ఆయకట్టు ప్రాంతం 62.5శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని, పరివాహకం, ఆయకట్టు ను లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొనే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌ను ఈ నెల 16లోగా సుప్రీంలో దాఖలు చేసే అవకాశాలున్నాయని సమాచారం. -
నీళ్లు లేని ఏడాది.. నేల తడిచే దారేది?
ఖరీఫ్ నీటికి సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనా? సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో ఆశించిన స్థారుులో నీటి లభ్యత లేని సంవత్సరాల్లో ఆ నీటిని ఎలా పంచుకోవాలో, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కార్యాచరణ ఏమిటో ముందుగా ఖరారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేశ్ట్రిబ్యునల్ను కోరినా పట్టించుకోలేదు. భవిష్యత్తులో కృష్ణాలో నీటి లోటు ఏర్పడే సంవత్సరాల్లో దిగువకు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున దీన్ని తీవ్రంగా పరిగణించాలని, ఈ సందర్భాల్లో ఎగువ రాష్ట్రాల నుంచి నీటి విడుదల జరిగేలా చూడాలని తెలంగాణ కోరుతోంది. నిర్ణీత కేటాయింపుల మేరకు ఎగువ రాష్ట్రాలే నీటిని వినియోగిస్తూ పోతే దిగువన ఖరీఫ్ అవసరాలకు సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఆగాలని, ఇది న్యాయం కాదని చెబుతూ వచ్చింది. అందువల్ల వచ్చిన నీటిని దామాషా ప్రకారం పంచాలని కోరింది. కింది రాష్ట్రాలకు దెబ్బ ఇలా..: బచావత్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ ఆధారంగా 2,130 టీఎంసీల కృష్ణా జలాల లభ్యతను నిర్ధారించి మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీల మేర కేటారుుంచింది. ట్రిబ్యునల్ రికార్డుల ప్రకారం 2002-03 ఏడాదిలో కృష్ణాలో 1,239 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకే ఈ నీరు సరిపోరుుంది. మహారాష్ట్రకు 585 టీఎంసీలను వినియోగించుకోగా కర్ణాటక 654 టీఎంసీల మేర వినియోగించుకుంది. దిగువన ఉన్న ఏపీకి చుక్క నీరు అందలేదు. తర్వాతి ఏడాది సైతం కృష్ణాలో నీటి లభ్యత లేకపోవడంతో రాష్ట్రానికి నీరందలేదు. దీంతో ఆ రెండేళ్లు రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. తర్వాత బ్రిజేశ్ ట్రిబ్యునల్ 65% డిపెండబిలిటీతో మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు కేటారుుంచింది. భవిష్యత్తులో 1,500 నుంచి 1,600 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నా.. రెండు రాష్ట్రాలకే అవి సరిపోతారుు. దిగువన ఉన్న రాష్ట్రానికి చుక్కనీరు రాదు. గతంలో రెండేళ్లు వరుసగా నీళ్లు రాని పరిస్థితులు మున్ముందు తలెత్తవన్న నమ్మకం లేదు. అదే జరిగితే తెలంగాణకు రావాల్సిన 298 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మేర మిగులు జలాలు ఆ రెండు రాష్ట్రాలకే దక్కుతారుు. ఇలాంటి పరిస్థితుల్లో ఎగువన ఉన్న రాష్ట్రాలు ఒక నిర్దిష్ట ప్రాతిపదికతో ఉన్న నీటిలో కింది రాష్ట్రాల ఖరీఫ్ అవసరాలకు వదిలేలా నిర్ణరుుంచాల్సిన బాధ్యత ట్రిబ్యునల్‌పై ఉందని తెలంగాణ వాదిస్తూ వచ్చినా పట్టించుకోలేదు. -
పెరగనున్న ఆల్మట్టి ఎత్తు!
519.6 మీటర్ల నుంచి 524.2 మీటర్లకు పెంపు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నీటి కేటాయింపుల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపై సందిగ్ధత తొలిగిపోయింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంకు 519.6 మీటర్ల ఎత్తు వరకు అనుమతి ఉంది. సుమారు 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వినియోగానికి వీలుంది. అరుుతే బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వస్తే దాని ఎత్తు 524.25 మీటర్ల వరకు పెరగనుంది. ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగనుంది. దాంతో దిగువనున్న మన రాష్ట్రానికి నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. అలాగే ఆల్మట్టి ద్వారా కర్ణాటక నీటి వాడకం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరగనుంది. ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతివ్వడం వల్ల అదనంగా 130 టీఎంసీల నీటిని వాడుకునే వెసులుబాటు కర్ణాటకకు లభిస్తుంది. ఇప్పటికే ఆల్మట్టి నుంచి దిగువ శ్రీశైలం, సాగర్లకు నీళ్లొచ్చేందుకు సెప్టెంబర్ దాకా ఆగాల్సి వస్తోంది. ఇప్పుడు కర్ణాటక 303 టీఎంసీలు వాడుకుంటే దిగువకు నీరు రావడం కష్టంగా మారుతుంది. ఒకవేళ వచ్చినా అవన్నీ అక్టోబర్ తర్వాతే వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే సాగర్ కింది ఆయకట్టుకు నీరందించడమే గగనంగా మారే ప్రమాదం ఉంది. -
కృష్ణా జలాలపై తేలేది నేడే
-
కృష్ణా జలాలపై తేలేది నేడే
విచారణ రెండు రాష్ట్రాలకా,నాలుగు రాష్ట్రాలకా తేల్చనున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పునః పంపకం అంశంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ బుధవారం కీలక తీర్పు వెలువరించనుంది. ఈ జలాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలా? లేక కర్ణాటక, మహారాష్ట్రలను కలుపుకొని మొత్తంగా కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పంచాలా? అన్నది తేలిపోనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ట్రిబ్యునల్ కార్యాలయంలో నాలుగు రాష్ట్రాల న్యాయవాదుల సమక్షంలో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తీర్పు వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాగునీటి రంగ సలహాదారు విద్యాసాగర్‌రావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ నరసింహారావు, రాష్ట్రం తరఫు న్యాయవాదులు మంగళవారమే ఢిల్లీకి వెళ్లారు. ఎగువ రాష్ట్రాలకే కేంద్రం మద్దతు: నాలుగు రాష్ట్రాలకు కలిపి కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ట్రిబ్యునల్ ముందు, కోర్టుల ముందు తెలంగాణ రాష్ట్రం కొట్లాడుతున్నా పట్టించుకోని కేంద్రం... ట్రిబ్యునల్‌కు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకే విచారణ పరిమితం చేయాలని అఫిడవిట్ ఇచ్చింది. దీనిని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగానే తేల్చింది. కేంద్రం తీరు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రెండింటికీ తీవ్ర నష్టకరమని... దీనిపై ట్రిబ్యునల్ వెలువరించే తుది తీర్పుపైనే ఈ రాష్ట్రాల భవితవ్యం ఆధారపడి ఉందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. మరోవైపు ట్రిబ్యునల్ తుది తీర్పునకు అనుగుణంగా.. తర్వాతి న్యాయపరమైన కార్యాచరణ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ అంశమై ఇప్పటికే న్యాయవాదులు, అధికారులతో పర్యవేక్షిస్తున్నారు.