నీళ్లు లేని ఏడాది.. నేల తడిచే దారేది?
ఖరీఫ్ నీటికి సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనా?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో ఆశించిన స్థారుులో నీటి లభ్యత లేని సంవత్సరాల్లో ఆ నీటిని ఎలా పంచుకోవాలో, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కార్యాచరణ ఏమిటో ముందుగా ఖరారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేశ్‌ట్రిబ్యునల్‌ను కోరినా పట్టించుకోలేదు. భవిష్యత్తులో కృష్ణాలో నీటి లోటు ఏర్పడే సంవత్సరాల్లో దిగువకు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున దీన్ని తీవ్రంగా పరిగణించాలని, ఈ సందర్భాల్లో ఎగువ రాష్ట్రాల నుంచి నీటి విడుదల జరిగేలా చూడాలని తెలంగాణ కోరుతోంది. నిర్ణీత కేటాయింపుల మేరకు ఎగువ రాష్ట్రాలే నీటిని వినియోగిస్తూ పోతే దిగువన ఖరీఫ్ అవసరాలకు సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఆగాలని, ఇది న్యాయం కాదని చెబుతూ వచ్చింది. అందువల్ల వచ్చిన నీటిని దామాషా ప్రకారం పంచాలని కోరింది.
కింది రాష్ట్రాలకు దెబ్బ ఇలా..: బచావత్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ ఆధారంగా 2,130 టీఎంసీల కృష్ణా జలాల లభ్యతను నిర్ధారించి మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీల మేర కేటారుుంచింది. ట్రిబ్యునల్ రికార్డుల ప్రకారం 2002-03 ఏడాదిలో కృష్ణాలో 1,239 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకే ఈ నీరు సరిపోరుుంది. మహారాష్ట్రకు 585 టీఎంసీలను వినియోగించుకోగా కర్ణాటక 654 టీఎంసీల మేర వినియోగించుకుంది. దిగువన ఉన్న ఏపీకి చుక్క నీరు అందలేదు. తర్వాతి ఏడాది సైతం కృష్ణాలో నీటి లభ్యత లేకపోవడంతో రాష్ట్రానికి నీరందలేదు.
దీంతో ఆ రెండేళ్లు రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. తర్వాత బ్రిజేశ్ ట్రిబ్యునల్ 65% డిపెండబిలిటీతో మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు కేటారుుంచింది. భవిష్యత్తులో 1,500 నుంచి 1,600 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నా.. రెండు రాష్ట్రాలకే అవి సరిపోతారుు. దిగువన ఉన్న రాష్ట్రానికి చుక్కనీరు రాదు. గతంలో రెండేళ్లు వరుసగా నీళ్లు రాని పరిస్థితులు మున్ముందు తలెత్తవన్న నమ్మకం లేదు. అదే జరిగితే తెలంగాణకు రావాల్సిన 298 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మేర మిగులు జలాలు ఆ రెండు రాష్ట్రాలకే దక్కుతారుు. ఇలాంటి పరిస్థితుల్లో ఎగువన ఉన్న రాష్ట్రాలు ఒక నిర్దిష్ట ప్రాతిపదికతో ఉన్న నీటిలో కింది రాష్ట్రాల ఖరీఫ్ అవసరాలకు వదిలేలా నిర్ణరుుంచాల్సిన బాధ్యత ట్రిబ్యునల్‌పై ఉందని తెలంగాణ వాదిస్తూ వచ్చినా పట్టించుకోలేదు.