కృష్ణా నదీ జలాల పునః పంపకం అంశంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ బుధవారం కీలక తీర్పు వెలువరించనుంది. ఈ జలాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలా? లేక కర్ణాటక, మహారాష్ట్రలను కలుపుకొని మొత్తంగా కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పంచాలా? అన్నది తేలిపోనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ట్రిబ్యునల్ కార్యాలయంలో నాలుగు రాష్ట్రాల న్యాయవాదుల సమక్షంలో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తీర్పు వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాగునీటి రంగ సలహాదారు విద్యాసాగర్‌రావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ నరసింహారావు, రాష్ట్రం తరఫు న్యాయవాదులు మంగళవారమే ఢిల్లీకి వెళ్లారు.