కొత్త ట్రిబ్యునల్‌తోనే రాష్ట్రానికి న్యాయం
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకోసం ప్రభుత్వ పోరాటం
బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ దాఖలుకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై విచారణ పరిధిని రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిలిపి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్పీ) దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని వివరిస్తూనే నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం- 1956 లోని సెక్షన్ 5(3) ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మొత్తం జలాలపై పునఃసమీ క్షతో న్యాయం చేయాలని పిటిషన్‌లో కోర నుంది. ఈ పిటిషన్‌కు తుది రూపునిచ్చేందుకు ఆదివారం ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులతో భేటీ అయ్యారు.
పిటిషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చలు జరిపారు. నిజానికి రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటారుుంపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటారుుంపులు ఎలా జరపాలన్నది ట్రిబ్యునల్ నిర్ణరుుంచాల్సి ఉంటుంది. అయితే దీనిని ట్రిబ్యునల్ తీర్పు లో ప్రస్తావిస్తూ, కేంద్రం సెక్షన్ 89ను ఎం దుకు పొందుపరిచిందో అర్థం కావడం లేదు అన్న తరహాలో స్పందించింది. ప్రస్తుతం వివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం అయితే వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ట్రం లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాలి. అప్పటి వరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ కూడా ముగిసి పోతుంది. ప్రస్తుత ఏడాది అలాంటి పరిస్థితులే ఎదురై సాగర్ కింద ఆయకట్టుకు నీరివ్వలేని గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న కాస్త నీటిని తాగు అవసరాల కోసం నిత్యం గుంజులాడుకుంటున్నాయి.
సరిపోని కేటారుుంపులు..
ఈ పరిస్థితులు సుప్రీంకు అర్థమయ్యేలా వివ రించాలని వీరి భేటీలో నిర్ణయం చేసినట్లుగా సమాచారం. కృష్ణా పరివాహకం తెలం గాణలో 68.5% ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటారుుంపుల్లో 35% మేర మాత్రమే ఉన్నారుు. తెలంగాణలో ఉన్న ఆయకట్టు ప్రాంతం 62.5శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని, పరివాహకం, ఆయకట్టు ను లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొనే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌ను ఈ నెల 16లోగా సుప్రీంలో దాఖలు చేసే అవకాశాలున్నాయని సమాచారం.