మా అంచనాలే కచ్చితం: ఐఎండీ
న్యూఢిల్లీ: పై-లీన్ కారణంగా గంటకు దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అమెరికా నౌకాదళం, బ్రిటన్ వాతావరణ శాఖ అంచనా వేసి హెచ్చరించటంతో.. ఇది విలయం సృష్టిస్తుందన్న భయాందోళనలు చెలరేగాయి. అయితే.. ఈ తుపాను గాలుల వేగం 200 నుంచి 220 కిలోమీటర్ల స్థాయిలో ఉంటుందన్న తమ అంచనాలే కచ్చితమైనవిగా నిరూపణ అయిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. మిగతా ఏజెన్సీల మాదిరిగా ప్రజలను భయాందోళనలకు గురిచేయడం తమ విధానం కాదని ఐఎండీ డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ ఆదివారం తెలిపారు.
పై-లీన్ను భారత వాతావరణ శాఖ తక్కువగా అంచనా వేస్తోందని, అది అత్యంత తీవ్రమైన కేటగిరీ - 5లోకి వస్తుందని అమెరికాకు చెం దిన వాతావరణ నిపుణుడు ఎరిక్ హోల్తాస్ వ్యాఖ్యానించాడని, అయి తే, తీవ్రమైన తుపాను కేటగిరికి మాత్రమే చెందుతుందని ప్రకటించామన్నారు. చివరకు తమ అంచనానే నిజమైందని రాథోడ్ తెలిపారు