Broadcast media
-
ప్రసార మాధ్యమాలపై సుప్రీం వ్యాఖ్యలు ఆలోచించదగినవే
టీవీ ప్రసార మాద్యమాలపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆలోచించదగినవే. కచ్చితంగా టీవీ చానళ్లు బాధ్యతగా ఉండాలి. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండరాదు. ఈ సూత్రం ఒక్క టీవీ చానళ్లకే కాదు.. అన్ని వ్యవస్థలకు వర్తిస్తుంది. గౌరవ న్యాయ స్థానం ఆ విషయాన్ని గుర్తించే ఇంత ఆవేదనగా తన వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. అయితే అదే సమయంలో కొన్నిసార్లు ప్రభుత్వాలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినవారిపై , వారి ప్రసంగాలను విస్తారంగా ప్రచారం చేసిన చానళ్లపై కేసులు పెడితే న్యాయ వ్యవస్థ స్టే లు ఇవ్వడమో, లేక మరో రకంగానో వారికి రక్షణ కల్పించాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఒక్కోసారి ఒక్కో గౌరవ న్యాయమూర్తి ఒకో రకంగా స్పందించడం కాకుండా , ఇలాంటి విషయాలలో ఒకే అభిప్రాయం వ్యక్తం అయ్యేలా వ్యవస్థ వ్యవహరిస్తే అప్పుడు దేశానికి ఒక మార్గదర్శకం అవుతుందని చెప్పాలి. సందర్భం ఏదైనా సుప్రీంకోర్టు ఇప్పుడు విద్వేష సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. టీవీ చానళ్లను బలమైన దృశ్యమాద్యమంగా మారాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అది వాస్తవమే. అందులోను పాజిటివ్ సమాచారం కన్నా, నెగిటివ్ సమాచారానికే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. వాటికి టిఆర్పి రేటింగ్ ముడిపడి ఉండడంతో ఆయా చానళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. అందులో భాగంగా అశ్లీల నృత్యాలు, విద్వేషపూరిత ప్రసంగాలు, చర్చలు వంటివి ఉంటున్నాయి. కచ్చితంగా వీటిని అడ్డుకోవల్సిందే. అందుకోసం ఏమి చేయాలన్నదానిపై కొన్ని మార్గదర్శక సూత్రాలు లేకపోలేదు. కానీ వాటిని కొంతమంది పట్టించుకోవడం లేదు. దాంతోనే ఈ సమస్య వస్తోంది.దానికి మీడియా స్వేచ్చ అనే ముసుగు తగిలిస్తున్నారు.కచ్చితంగా మీడియా స్వేచ్చను కాపాడాల్సిందే. అలాగే వారు ఏదైనా విద్వేషాన్ని పెంచుతుంటే దానిని అరికట్టవలసిందే. కానీ కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ పూర్తి వివరాలలోకి వెళ్లకముందే విద్వేష వ్యాప్తి చేశారన్న ఆరోపణలు ఉన్నవారికి రక్షణ కల్పిస్తోందన్న అభిప్రాయం ఉంది. పైగా ఆ సమయాలలో కొందరు న్యాయమూర్తులు పోలీసు వ్యవస్థపైన , ప్రభుత్వాలపైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంతో అసలు సమస్య పక్కకుపోయి, ఈ తీవ్ర వ్యాఖ్యలే చర్చనీయాంశం అవుతున్నాయి. ఉదాహరణకు ఆంద్ర ప్రదేశ్ లో ఒక ఎమ్.పిగారు రోజూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తుండేవారు. కొన్ని కులాలను కించపరిచేలా మాట్లాడడం, కొన్ని మతాలను అగౌరవపరచేలా సంభాషించడం చేసేవారు. దానిని కొన్ని చానళ్లు నియంత్రించకపోగా, చాలా గొప్ప విషయం అన్నట్లుగా ప్రసారం చేసేవి.ఈ నేపధ్యంలో పోలీసులు సంబందిత రికార్డు అంతటిని తయారు చేసి కేసు పెడితే న్యాయ వ్యవస్థ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. సదరు ఎమ్.పిగారు తనను పోలీసులు కొట్టారని ఆరోపించారు. ఆయనను నిజంగా కొట్టారో, లేదో తేల్చాలని గౌరవ సుప్రింకోర్టువారు ఆర్మి ఆస్పత్రికి పంపించారు. ఆ ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులకు ఆయన చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లిపోయారు.అయినా న్యాయ వ్యవస్థ ఆయనపై చర్య తీసుకోలేదు. పోలీసులు ఆయనపై రాజద్రోహం కేసు పెడతారా అంటూ ఫైర్ అయింది. దాని సంగతి తేల్చేస్తామని చెప్పారు. అదీ జరగలేదు.గౌరవ కోర్టువారు ఎపి ప్రభుత్వ ఆస్పత్రులు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాత , ఇమేజీలను అబ్జర్వు చేసిన తర్వాత తగు నిర్ణయం చేసినట్లు అనిపించలేదు. అయినా ఫర్వాలేదు. ఒకవేళ పోలీసులు ఏమైనా తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. కాని అలా కాకుండా ఆ కేసు పక్కదారి పట్టేలా సాగితే మరి ఎవరిని తప్పు పట్టాలి. ఇప్పటికీ ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. చివరికి ఆ ఎంపీగారు ఆ రాష్ట్రానికి వెళ్లడం మానుకున్నారు. పైగా పోలీసుల విచారణకు కూడా హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దానికి తోడు ప్రతిపక్షం పోలీసులపై , ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తుంటుంది. దానికి న్యాయవ్యవస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణం. ఈ విషయాన్ని కూడా గౌరవ న్యాయమూర్తులు పరిశీలించవలసిన అవసరం ఉంది. విద్వేషపూరిత ప్రసారాల విషయంలో ముందుగా రాజద్రోహం సెక్షన్లు వర్తిస్తాయా?లేదా? ఒకవేళ వర్తించకపోతే, మరే సెక్షన్ కిందకేసు పెట్టాలి?అన్నది తేల్చిన తర్వాత సుప్రింకోర్టు ఈ విషయంలో ముందుకు వెళితే బాగుంటుందనిపిస్తుంది. ఈ ఎంపీగారి కేసులో విద్వేషపూరిత ప్రసంగాన్ని, దానిని ప్రసారం చేసిన చానళ్లను ఒక కేసు కింద, ఒకవేళ పోలీసులు ఆ ఎంపీని హింసించి ఉంటే దానిని విడిగా మరో కేసు కింద పరిగణించి విచారణ చేపట్టి ఉంటే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరిగేది. కొన్నిసార్లు కొందరు న్యాయమూర్తులు తమ సొంత అభిప్రాయాలను యధేచ్చగా వ్యక్తం చేస్తున్నారు. అవి ఒక్కోసారి రాజకీయ వ్యాఖ్యల మాదిరిగా ఉంటున్నాయి. అలాంటి స్వేచ్చ న్యాయమూర్తులకు ఉండవచ్చు.కాని వాటివల్ల కూడా రాజకీయంగా కొందరికి ప్రయోజనం కలిగేలా ఉండడం సరైనదేనా అన్నది ఆలోచించాలి. అలాకాకుండా వారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా,దానిని లిఖిత పూర్వక తీర్పులో ఉండాలన్న డిమాండ్ ను కొన్ని పక్షాలు చేస్తున్నాయి. కానీ న్యాయమూర్తులు వాటిని పట్టించుకోకుండా, తమ మానాన తాము రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని ప్రభావం కూడా సమాజంపై పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కచ్చితంగా న్యాయ వ్యవస్థ తగురీతిలో స్పందించాలి. అలాగని ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటోందన్న అబియోగానికి తావివ్వకూడదు. ఏది ఏమైనా సుప్రింకోర్టు విద్వేషవ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం చొరవ చూపడం మంచిదే. కొన్నిసార్లు భావ స్వేచ్చగాను, మరికొన్నిసార్లు విద్వేషంగాను పరిగణించకుండా, ఒక కొలమానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది.అందుకు తగ్గ ప్రమాణాలను న్యాయ వ్యవస్థ రూపొందిస్తే మంచిది. ఎన్నో కీలకమైన సంస్కరణలకు, మార్పులకు సుప్రింకోర్టు గతంలో నాందీ పలికింది. ఇప్పుడు ఈ విద్వేష వ్యాప్తిని అరికట్టడానికి వీలుగా తగు సంస్కరణలు తీసుకువస్తే సంతోషించవచ్చు. కచ్చితంగా సమాజాన్ని చీల్చి, విద్వేషాలను పెంచి లాభపడాలన్న వ్యక్తులు, రాజకీయ నేతలకు, టీవీ చానళ్లకు ముకుతాడు వేయగలిగితే ఆహ్వానించదగిన పరిణామమే అవుతుంది. -
అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్ రేడియోకు అదరిపోయే వార్త
న్యూఢిల్లీ: డిజిటల్ రేడియో టెక్నాలజీ వినియోగంతో రేడియో విభాగం ఆదాయం అయిదేళ్లలో రెండింతలై రూ.12,300 కోట్లకు చేరుకుంటుందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ), ఈవై నివేదిక వెల్లడించింది. ‘డిజిటల్ రేడియోతో ప్రసార కంపెనీలు, శ్రోతలు, ప్రకటనకర్తలు, నియంత్రణ సంస్థలకు ప్రయోజనం. అధిక ధరలతో స్లాట్స్ విక్రయించేలా ప్రకటనలు పెరుగుతాయి. డిజిటల్ రేడియో వ్యవస్థ శ్రోతల డేటాను పారదర్శకంగా అందిస్తుంది. ఎంతమంది వింటున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి ప్రసారకులు నమ్మకాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఆదాయాన్ని పెంచుకోవచ్చు. చానెళ్లూ పెరుగుతాయి. ప్రస్తుతం ఉన్న ఫ్రీక్వెన్సీలో నాలుగింతలు ఎక్కువగా చానెళ్లను ఆఫర్ చేయవచ్చు. నాణ్యత అధికం అవుతుంది. శ్రోతలకు మెరుగైన అనుభూతి కలుగుతుంది. అదనపు స్పెక్ట్రమ్ అవసరం లేకుండానే చానెళ్ల సంఖ్య ప్రస్తుతమున్న 300 నుంచి 1,100 దాటుతుంది. కొన్నేళ్లుగా ఆదాయాల ఆర్జనకు ఎఫ్ఎం రేడియో కష్టాలను ఎదురీదుతోంది’ అని నివేదిక వివరించింది. -
అమెజాన్ ప్రైమ్ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌పై రూ. 21 వేల కోట్ల పెట్టుబడి
ఇండియాలో గణనీయంగా కస్టమర్ బేస్ పెంచుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) సెగ్మెంట్లో పోటీ కంపెనీలపై పూర్తి స్థాయి ఆధిక్యం సాధించేందుకు వీలుగా పావులు కదుపుతోంది. డిసెంబరులో వేలం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ హక్కులు దక్కించుకునే ప్లాన్‌లో ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియో. సోని పిక్చర్స్‌తో కలిసి బిడ్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు డిసెంబరులో ఐపీఎల్ ప్రసార హక్కులను వేలం వేయనుంది. 21 వేల కోట్లకు పైగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి 2023 నుంచి 2017 వరకు ఐదు సీజన్లకు సంబంధించిన ప్రసార హక్కుల కోసం భారీ బిడ్‌ను ప్రైమ్ వీడియోస్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. మార్కెట్ వర్గాలు అంచనా ప్రకారం శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్రసార హక్కుల కోసం ప్రైమ్ వీడియోస్, సోని పిక్చర్స్ సంయుక్తంగా 3 నుంచి 4 బిలియన్ డాలర్ల (సుమారు 21 వేల నుంచి 28 వేల కోట్లు) వరకు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నాయి. ప్రసారాలకు పోటీ డిజిటల్ స్ట్రీమింగ్‌లో ప్రైమ్ వీడియోస్‌కి మంచి కస్టమర్ బేస్ ఉంది. దేశంలోనే నంబర్ వన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఉంది. అయితే టీవీ ప్రసారాలకు దగ్గర వీక్‌గా ఉంది. ఇక సోని నెట్వర్క్ ఇటీవల జీ నెట్‌వర్క్‌ను కూడా సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల బలమైన టీవీ నెట్వర్క్ని కలిగి ఉంది. ఇలా రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ దాఖలు చేయడం ద్వారా స్టార్‌గ్రూపుకి చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నాయి. సోనికి షాక్ ఐపీఎల్ ప్రసార హక్కులు 2012 నుంచి 2017 సోనీ గ్రూపు చేతిలో ఉండేవి. అయితే ఆ తర్వాత జరిగిన వేలంలో సోనీ గ్రూపు ఐదేళ్ల కాలపరిమితికి రూ. 11,050 కోట్లతో బిడ్ దాఖలు చేయగా స్టార్, హాట్స్టార్లు కలిసి రూ. 16,348 కోట్లు దాఖలు చేసింది. దీంతో సోని నుంచి ప్రసార హక్కులు స్టార్ గ్రూప్‌కి వెళ్లాయి. ఈసారి స్టార్ నుంచి ఎలాగైనా ప్రసార హక్కులు సొంతం చేసుకునేందుకు సోనీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌తో జత కట్టాలని నిర్ణయించింది. అయితే ఈ విషయంపై ఇటు సోనీ, అటు అమెజాన్‌ల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తగ్గేదేలే ఇక కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ నుంచి వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకునే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది బీసీసీఐ. వేలం పాటలో ఎక్కువ సంస్థలు పాల్గొనేలా చేసి ప్రసార హక్కుల రేట్లకు మరింత ధర పలికేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఐదు సీజన్ల ప్రసార హక్కుల ద్వారా ఏకంగా 5 బిలియన్ డాలర్ల సంపాదనను బీసీసీఐ ఆశిస్తోంది. చదవండి :వచ్చే ఏడాది ఐపీఎల్‌పై బీసీసీఐ బాస్ కీలక వ్యాఖ్యలు.. -
కోవిడ్ టైమ్‌లో దేశం ఏం చూసింది?
ముంబై: కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్‌లో టెలివిజన్ వీక్షణ తొమ్మిది శాతం పెరిగినట్టు టీవీ రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) వెల్లడించింది. మొత్తం టీవీ వ్యూయర్షిప్లో న్యూస్ ఛానళ్ల వ్యూయర్షిప్ 27 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పంజాబీ, గుజరాతీ, మళయాళం, తమిళ్, మరాఠీ, హిందీ న్యూస్‌ఛానళ్లకు అత్యధికంగా 10.4 శాతం వ్యూయర్షిప్ నమోదైంది. గత ఏడాది తొలి అర్థ భాగంలోకంటే ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అదే సమయంలో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వీక్షణలో మాత్రం రెండు శాతం తగ్గుదల కనిపించింది. వారంలో టీవీ వీక్షించే సమయం ఆధారంగా ఈ శాతాన్ని లెక్కించారు. భారతీయులు ఏం చూశారు? కోవిడ్ కాలంలో భారత ప్రజలు దేన్ని వీక్షించారు ‘వాట్ ఇండియా వాచ్డ్’అనే కోణంలో ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కోవిడ్‌కి ముందు, కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ అనంతరం, అలాగే 2020 ఏడాది చివర్లో భారతీయుల టీవీ వీక్షణపై ఈ అధ్యయనం చేశారు. ‘ద ఇయర్ ఆఫ్టర్ టూ థౌజండ్ అండ్ నైన్టీన్’అనే పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2020 మార్చి 25న భారత్‌లో లాక్డౌన్ విధించాక ప్రజలు తమ ఇళ్లకే పరిమితమై టీవీలకు అతుక్కుపోయి, టీవీల ద్వారా బాహ్యప్రపంచాన్ని వీక్షించేందుకు ప్రయత్నించారని ఈ సర్వే వెల్లడించింది. లాక్డౌన్ సమయంలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, న్యూస్ ఛానళ్లను ఎక్కువగా వీక్షించినట్టు సర్వే పేర్కొంది. గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే మార్చి– జూన్ కాలంలో టీవీ వీక్షణం 23 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పిల్లల కార్యక్రమాల వీక్షణ 27 శాతం పెరిగింది. 2019తో పోల్చుకుంటే కోవిడ్ కాలంలో 2020లో జనరల్ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్స్ వ్యూయర్షిప్ 9 శాతం పెరిగింది. సినిమా వీక్షణ 10 శాతం పెరిగింది. నాన్ ప్రైమ్ టైమ్ కార్యక్రమాల వీక్షణశాతం 2019లో 51 శాతం ఉంటే, లాక్డౌన్ కాలంలో (మార్చి 14 నుంచి జూలై 3 వరకు) 2020లో 53 శాతానికి పెరిగింది. టీవీ వీక్షకులు ఒక్క రోజులో టీవీల ముందు గడిపే సమయం 2019లో 3 గంటల 42 నిముషాలు ఉంటే 2020కి వచ్చేసరికి 4 గంటల 2 నిముషాలకు చేరుకుందని సర్వే వెల్లడించింది. లాక్డౌన్ ప్రధాన కారణం 2020లో కోవిడ్‌కి ముందు జనవరి 4 నుంచి మార్చి 13 వరకు టీవీ వ్యూయర్షిప్ ఆరుశాతం తగ్గినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు,లాక్డౌన్ కాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడాకార్యక్రమాలు నిలిచిపోవడంతో క్రీడాకార్యక్రమాల వీక్షణ తగ్గిపోయింది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన టీవీ వీక్షణ క్రమంగా పెరిగింది. 2020 చివరి నెలల్లో మొత్తం టెలివిజన్ వీక్షణ 6 శాతం పెరిగింది. 127 శాతం పెరిగిన ఐపీఎల్ 13 వ్యూయర్షిప్ ఐపీఎల్–13 నేపథ్యంలో క్రీడా సంబంధిత కార్యక్రమాల వీక్షణలో 127 శాతం పెరుగుదలను నమోదు చేసింది. టీవీ వీక్షకుల్లో అతిపెద్ద క్యాటగిరీ అయిన జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్(జీఈసీ) వీక్షకులు టీవీ చూసే సమయం 9 శాతం పెరిగింది. సినిమా చూసేవారిలో పదిశాతం పెరిగింది. చిన్నపిల్లల కార్యక్రమాల్లో 27 శాతం పెరుగుదల, సంగీత కార్యక్రమాల వీక్షణ 11 శాతం పెరిగింది. క్రీడల వీక్షించే సమయం –35 శాతం తగ్గినట్టు తేలింది. 2020 తొలి అర్థభాగంతో పోల్చుకుంటే 2020 ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయి. 2020లోని మొత్తం ప్రకటనల్లో టాప్ 10 అడ్వర్టైజింగ్ సెక్టార్లు 80 శాతం ప్రకటనలు ఇచ్చాయి. భారీగా పెరిగిన ప్రభుత్వ ప్రకటనలు.. 2020 పోల్చుకుంటే 2019లో ప్రభుత్వ ప్రకటనలు 184 శాతం(2.7 రెట్లు) పెరిగాయి. ఐపీఎల్–12 తో పోల్చుకుంటే ఐపీఎల్–13 వీక్షకుల శాతం 23 శాతం పెరిగింది. మొత్తం 40,000 కోట్ల నిముషాల పాటు ఐపీఎల్‌ని వీక్షించారు. ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబీలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌ని అత్యధికంగా 11.2 బిలియన్ల సమయం వీక్షించినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి రిపబ్లిక్ టీవీ సహా మరో రెండు ఛానళ్ళు టీఆర్పీ రేటింగ్‌ని తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర న్యూస్ చానళ్లకు సంబంధించిన వీక్లీ వ్యూయర్షిప్ డేటాని అక్టోబర్ మధ్య వరకు బీఏఆర్సీ వెల్లడించలేదు. మాజీ ప్రసార నిపుణులు పరితోష్ జోషి మాట్లాడుతూ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని అన్నారు. 2019లోనే వార్తా ప్రాధాన్యత కలిగిన ఘటనలు 2019లో ఇదే కాలంలో వార్తా ప్రాధాన్యత కలిగిన అనేక ఘటనలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు, పుల్వామాలో ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ నుంచి తిరిగి రాకలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పుడు వార్తా వీక్షకుల సంఖ్య పెరగడానికీ, 2020లో వార్తా ఛానళ్ళ వీక్షకుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణమై ఉండొచ్చని రిపోర్టు వెల్లడించింది. అయితే లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షకుల శాతం 2019లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం పెరిగినట్టు రిపోర్టు తేల్చింది. 2019తో పోల్చితే వార్తా వీక్షకుల సంఖ్య లాక్డౌన్ కాలంలో 90 శాతం పెరిగితే, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల వీక్షకుల సంఖ్య 8 శాతం మాత్రమే పెరిగింది. దూర్దర్శన్ ఛానళ్లలో ప్రసారం అయిన రామాయణ్, మహా భారత్ కార్యక్రమాల కారణంగా ఎంటర్టైన్మెంట్ వీక్షకులు పెరిగారు. -
అంబానీ రేడియో బిజినెస్ విక్రయానికి?
సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కాం)ఛైర్మన్ అనిల్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ (ఆర్‌బీఎన్) రేడియో బిజినెస్‌ను విక్రయించేందుకు నిర్ణయించుకున్నారంటూ తాజాగా పలు నివేదికలు మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అనిల్ ధీరుబాయి అంబానీ గ్రూప్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ లిమిటెడ్ నడుపుతున్న బిగ్ ఎఫ్ఎంను విక్రయించనుంది. హిందీ వార్తా పత్రిక దైనిక్ జాగరన్ దీనిని సొంతం చేసుకోనుంది. దైనిక్ జాగరన్ చీఫ్ ఎడిటర్, జాగరన్ ప్రకాశన్ కు చెందిన బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ రూ.1200 కోట్లకు దీన్ని దక్కించుకునేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. పూర్తి నగదు రూపంలో ఈ డీల్ ఉండబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 12 వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చే క్రమంలో అంబానీకి ఈ విక్రయం భారీ ఊరటనిస్తుందని అంచనా. అయితే దీనిపై రిలయన్స్ గ్రూపునుంచి గానీ, ఇటు జాగరన్ ప్రకాశన్ నుంచి గానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం మొదట 24 శాతం వాటాను ఎంబీఎల్ సొంతం చేసుకుంటుంది. దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మూడేళ్లు ముగియకుండా మేజర్ వాటాను విక్రయించడానికి అనుమతి లేదు. బిగ్ ఎఫ్ఎంలో 59 రేడియో స్టేషన్లు ఉన్నాయి. మార్చి 31, 2018 నాటికి బిగ్ ఎఫ్ఎం 45 స్టేషన్లకు లాక్-ఇన్ పీరియడ్ ముగిసింది, అయితే మిగిలిన 14 స్టేషన్లకు 2020 మార్చిలో గడువు ముగుస్తుంది. దీని ప్రకారం మిగిలిన 14 స్టేషన్లు, 2020 లో వారి లాక్-ఇన్ వ్యవధి ముగిసిన తర్వాత బదిలీ అవుతాయి. జాగరన్ ప్రకాశన్‌కు చెందిన మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్( ఎంబీఎల్) రేడియో సిటీ పేరుతో ఎఫ్ఎం చానల్ నిర్వహిస్తోంది. ఎంబీఎల్ రేడియో సిటీ బ్రాండ్ క్రింద 39 స్టేషన్లు ఉన్నాయి. ఈడీల్ ముగిసిన అనంతరం దేశంలోనే అదిపెద్ద ఎఫ్ఎం స్టేషన్ బ్రాండ్‌గా ఎంబీఎల్ అవతరించనుంది. కాగా ప్రభుత్వ అనుమతి లభించని కారణంగా ఈ బిజినెస్ అమ్మకానికి సంబంధించి జీ గ్రూపుతో ఒప్పందానికి గతంలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. -
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రచురించడం, ప్రసారం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనెల 12–డిసెంబరు 7 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 12 ఉదయం 7 గంటల నుంచి డిసెంబరు 7 వ తేదీ సాయంత్రం 5.30 గంటల మధ్య ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించరాదని ఈసీ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. అలాగే ఒపీనియన్ పోల్స్ సైతం పోలింగ్(విడతల వారీగా) ముగియడానికి 48 గంటల ముందు నుంచి ప్రసారం చేయరాదని ఆదేశించింది. -
పీసీఐ, ఎడిటర్స్ గిల్డ్‌పై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ: అత్యాచారాలు, లైంగిక దాడుల వార్తల రిపోర్టింగ్‌లో నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్డ్, ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ ముందు హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించాలని గతంలోనే కోర్టు పైన పేర్కొన్న మీడియా నియంత్రణ సంస్థలకు లేఖలు పంపింది. కాగా, గురువారం జరిగిన విచారణకు న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎన్బీఎస్ఏ) తరఫు లాయర్ మాత్రమే హాజరయ్యారు. లైంగిక దాడులు, రేప్ ఘటనలను రిపోర్ట్చేస్తున్న సమయంలో చట్టబద్ధ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని బెంచ్..ఎన్బీఎస్ఏ లాయర్‌ను ప్రశ్నించింది. -
సశేషం!
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ప్రస్తుతానికి ఐపీఎల్ మ్యాచ్‌ను దాటిపోయాయి! రెండో రోజు బుధవారం కూడా కొనసాగిన ఈ–వేలంలో హక్కుల కోసం పోటీ తీవ్రంగా సాగింది. ఫలితంగా వేలం ఆగిపోయే సమయానికి గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్ (జీసీఆర్) ఏకంగా రూ. 6302.5 కోట్లకు చేరుకున్నాయి. భారత్‌లో 2018–2023 మధ్య జరిగే 102 మ్యాచ్‌ల కోసం ఈ వేలం జరుగుతోంది. దీని ప్రకారం చూస్తే ఒక్కో మ్యాచ్‌కు రూ.59.16 కోట్లు చెల్లించేందుకు ఇప్పటికే ప్రసారకర్తలు సిద్ధమైపోయినట్లు. గురువారం కూడా వేలం కొనసాగనున్న నేపథ్యంలో ఈ విలువ ఎంత వరకు చేరుతుందో ఊహించలేని పరిస్థితి! ముగిసిన గత ఒప్పందంలో స్టార్ ఒక్కో మ్యాచ్‌కు రూ. 43 కోట్లు చెల్లించింది. అంటే ఇప్పటికే ఒక్కో మ్యాచ్‌కు రూ. 16.16 కోట్లు ఈ మొత్తం పెరిగిపోయింది. మొత్తం హక్కుల విలువను గతం (రూ. 3,851 కోట్లు)తో పోలిస్తే ఇప్పుడు 56.6 శాతం పెరిగిపోయింది. గత సెప్టెంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం స్టార్ సంస్థ ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు రూ. 54.5 కోట్లు చెల్లిస్తోంది. బుధవారం రూ.4,442 కోట్ల నుంచి కొనసాగిన వేలంలో మూడు సంస్థలు కూడా పోటీ పడుతూ చివరకు రూ. 6032.5 కోట్లకు చేర్చాయి. ‘భారత క్రికెట్ శక్తి ఏమిటో ఈ వేలం చూపిస్తోంది. పెను వివాదాలు వచ్చినా తట్టుకునే శక్తి మన క్రికెట్‌కు ఉంది. మన దేశంలో పెట్టుబడికి తగిన లాభం తెచ్చిపెట్టే శక్తి ఒక్క ఆటకే ఉందని బిడ్డర్లకు తెలుసు కాబట్టే అంతగా పోటీ పడుతున్నారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ఇదేం న్యాయం?
న్యూఢిల్లీ: భారత్‌లో నిర్వహించే మ్యాచ్‌ల ప్రసార హక్కుల విషయంలో బిడ్లు దాఖలు చేసిన రెండు కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మ్యాచ్‌లకు సంబంధించిన చెల్లింపులపై చివరి నిమిషంలో బీసీసీఐ మార్పులు చేయడంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఏప్రిల్ 3న బిడ్ దాఖలు చేయాల్సి ఉండగా... పోటీపడ్డ స్టార్ ఇండియా, ఎస్పీఎన్ (సోనీ కార్పోరేషన్)లు ఈ అంశంపై బీసీసీఐకి లేఖ రాశాయి. ప్రసార హక్కులు పొందిన సంస్థ... సొంత గడ్డపై నిర్వహించే అన్ని మ్యాచ్‌లకు ఒకే మొత్తంలో చెల్లించడం ఎలా సాధ్యమని అందులో పేర్కొన్నాయి. టి20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ముక్కోణపు టోర్నీల వంటి సిరీస్‌లలో భారత్ పాల్గొనే మ్యాచ్‌కు, పాల్గొనని మ్యాచ్‌కు ఒకే మొత్తం చెల్లించాల్సి రావడం ఇబ్బందికరం అని స్పష్టం చేశాయి. భారత్ బరిలో ఉంటే చూసే ప్రేక్షకుల సంఖ్యకు, లేకుంటే చూసేవారికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఇది సబబు కాదని... తక్షణమే దాన్ని సవరించాలని కోరాయి. -
ఆసక్తికరమైన సరుకు కావలసిందే కానీ...!
అవలోకనం మన ప్రసార మీడియా సంచలనం పేరుతో పసలేని కథనాల వెంటపడుతున్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యానికి గురికాలేదు. అదేమంత కొత్త విషయం కాదు. కానీ స్టాక్‌మార్కెట్ పతనం వంటి ఒక అతి పెద్ద, ఆసక్తికరమైన ముఖ్య కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వస్తున్నప్పుడు కూడా మన మీడియా అసంబద్ధ కథనాలతో పొద్దుపుచ్చడమే చాలా కొత్త విషయం. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. మీడియా ఉన్నది దేనికి? తాజా వార్తలు లేక లోతైన వార్తా కథనాలను అందించాలని కోరుకుంటున్న వాళ్ల కోసమేనా? మన మీడియా అంతటి స్థాయిలో ఉందని నేననుకోవడం లేదు. ఉదాహరణకు.. చైనా మార్కెట్లలో అనిశ్చితి, అస్థిర త్వం తర్వాత ఏం జరగనుందనే అంశంపై ఈ వారం స్టాక్ మార్కెట్లు ప్రకంపించిపోయాయి. ఆగస్టు 24 సోమవారం నాడు నేను కాస్త త్వరగా మేల్కొని, ఆసియా మార్కెట్లు ఒకదాని వెనుక ఒకటి కుప్ప కూలిపోయిన తీరుపై వార్తా కథనాలు చదివాను. అప్పుడు సమయం ఉదయం 5 గంటలయింది. స్టాక్‌మార్కెట్ పత నం నేపథ్యంలో భారత్‌లో ఏం జరగనుందో అవగతం చేసుకోవడానికి నేను అంత పొద్దుటే వేచిచూస్తుండిపో యాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. యావత్ ప్రపంచ మీడియా దాని గురించి చర్చిస్తూ ఉండేది. మార్కెట్లు ఉద యం 9 గంటలకు ప్రారంభమైనప్పుడు టీవీ చానళ్లను చూడటం ద్వారా స్టాక్ మార్కెట్ పరిణామాల గురించి ఇంకా మంచిగా అర్థం చేసుకోవచ్చని నేను భావించాను. అయితే ఆ సమయంలో మన ఇంగ్లిష్ వార్తా చానళ్లలో కింది కథనాన్ని ప్రసారం చేశారు. పంజాబ్‌లో ఒక బాలిక తన ఫేస్బుక్లో మోటార్ సైకిల్‌పై ఉన్న ఓ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేసింది. అతగాడు తనను బూతులతో సత్కరించాడని ఆమె రాసింది (అయితే ఆమె నిర్దిష్టంగా ఏం జరిగిందో వివ రించలేదు). ఈ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్న వారు చెబు తున్నట్లుగా ఆ పోస్ట్‌ను ఆన్లైన్లో విపరీతంగా చూసే శారట. మీడియా ఆ సమయంలో చర్చిస్తూ ఉండిన కథనం ఇదే. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేకుండానే చానళ్లు ఆ వ్యక్తి ఉపయోగించిన అశ్లీల పదాల గురించి చర్చిస్తూపోయాయి. ఇంగ్లిష్‌లో ఒక్క జాతీయ చానల్ కూడా స్టాక్ మార్కెట్ కల్లో లాన్ని చూపించలేదు, మార్కెట్ కుప్పకూలడంపై చర్చించ లేదు. ఇక బిజినెస్ చానల్స్ విషయానికి వస్తే.. వీటి విశ్లేషణ ఎక్కువగా మదుపుదారులపైనే సాగింది కానీ, స్టాక్ మార్కె ట్ పతనంలోని విస్తృత అంశాలపై ఆసక్తి చూపిన వారిపై ఇవేవీ దృష్టి పెట్టలేదు. మీడియాలో చాలాకాలంగా పని చేస్తున్న నాలాంటి వ్యక్తికి ఇది చాలా కొత్త పరిణామం. మన ప్రధాన స్రవంతి మీడియా.. టాబ్లాయిడ్ తర హాకు కుదించుకుపోవడం గమనించిన మీలాంటి అనేక మంది లాగే నేను కూడా, మీడియా పసలేని కథనాల వెంట పడుతున్నప్పుడు ఆశ్చర్యానికి గురికాలేదు. అది కొత్త విష యమేమీ కాదు. కానీ.. ఒక అతి పెద్ద, ఆసక్తికరమైన ముఖ్య కథనంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు కూడా మన మీడియా అసంబద్ధ కథనాలతో పొద్దుపుచ్చ డమే చాలా కొత్త విషయం. ఇలా జరుగుతుందని నేను అస్స లు ఊహించలేదు. ఆనాటి ఉదయం ఇదే నన్ను నిస్పృహకు గురిచేసింది. మన ఆర్థిక వ్యవస్థలను, అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేసే పరిణామం ఒకటి ద్రవ్య మార్కెట్లలో ఏర్ప డుతోందని ప్రపంచం మనకు తెలుపుతున్న సమయమది. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి ప్రవర్తనపై మరొక వ్యక్తి వ్యాఖ్యకు సంబంధించిన విషయంపైనే మన మీడియా ఆసక్తి చూపుతోంది. ఆ మరుసటి దినం పటేళ్ల ఆందోళన జాతీయ వార్తగా మారిపోయింది. ఇది ఒకే వార్తలోకి పలు అంశాలను తీసు కువచ్చింది: కుల రాజకీయాలు, గుజరాత్ నమూనా, రిజ ర్వేషన్ భావజాలం, అసమానాభివృద్ధి వైైగె రా వగైరా. భార త్లో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన వార్త. ఒక మేరకు ప్రపంచం దృష్టిని కూడా ఇది ఆకర్షించింది. ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్’, ‘బీబీసీ’తో సహా పలు విదేశీ మీడియా చానళ్లు ఈ విషయమై నా ఇంటర్వ్యూ తీసుకు న్నాయి. గుజరాత్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఇవి చాలా ఆసక్తి చూపాయి. గుజరాత్ పటేళ్ల ఆందోళన నన్ను ఎంతగానో ఆకట్టు కుంది. నేను కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాడిని అయినందుకు మాత్రమే కాదు. అది విస్తృతంగా జనం వీక్షించే పెద్ద, ముఖ్యమైన కథనం. కానీ బుధవారం నేను పని నుంచి తిరిగి వచ్చి టీవీ ఆన్ చేసినప్పుడు ఇంత పెద్ద కథనాన్ని కూడా సంపన్న కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలిక హత్యా వార్త మరుగున పడే సింది. నిజమే. ఫేస్బుక్లో ప్రచురించిన ఏదైనా పోస్టు కన్నా ఆ బాలిక మరణ ఘటన మరింత తీవ్రమైనదే.. కాదనను. కానీ పది మంది మరణాలకు దారితీయడమే కాకుండా, ప్రధానమంత్రి జోక్యానికి కూడా కారణమైన ఆందోళన కంటే ఈ వార్త ఎంతో ముఖ్యమా? పటేళ్ల ఆందోళన చాలా కాలం గుర్తుండిపోయే తరహా కథనం. కులం, రిజర్వేషన్‌పై చర్చను రగిల్చేంత శక్తి కలిగిన కథనం ఇది. దీని ప్రాథమిక డిమాండ్ ఏదంటే రిజర్వేషన్ల తొలగింపే. ఇది కూడా పటేళ్లు గతంలో చేసిన పాత డిమాండే. ఈ సమస్య రగులుకొన్నట్లయితే, అగ్రకులాల ప్రజ లకు ఇది అతి పెద్ద సమస్యగా మారుతుంది కూడా. రిజర్వే షన్ కాదు మెరిట్‌కు పట్టం కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్‌ను చాలాకాలంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అగ్రకు లాలు భావిస్తున్నాయి. పాతికేళ్ల క్రితం మండల్ కమిషన్ నివే దిక తరహాలో దేశ రాజకీయాలనే మార్చివేసేంత శక్తివంత మైన కథనం ఇది. ఇది ఎవరికీ తెలియని రహస్యం కాదు. కానీ మనం మాత్రం పటేళ్ల ఆందోళనపై తక్కువగానూ, ఆ బాలిక హత్యపై ఎక్కువగానూ ప్రసారమవుతున్న వార్తల పైనే దృష్టి పెట్టాం. టెలివిజన్‌కి ఆసక్తికరమైన సరుకు కావాలన్న విషయం నాకు తెలుసు. దాన్ని నేను గుర్తిస్తాను కూడా. వ్యక్తిగతంగా నాకు ఏమాత్రం ఆసక్తి లేకపోయినప్పటికీ, టీవీలు వినోద, అసందర్భ వార్తలను ప్రసారం చేస్తున్నప్పటికీ వాటితో నాకు పెద్దగా సమస్య లేదు. కానీ, అదే సమయంలో అంతకు మించిన అతి పెద్ద, ప్రముఖ వార్త సంచలనం కలిగిస్తున్న సందర్భంలో అలాంటి పరమ బాధ్యతారహిత వైఖరిని క్షమించడం నాకు కష్టమే. పటేళ్ల డిమాండ్ అనేది ఒక అపరి చిత వ్యక్తి హత్య ఘటనతో సమానమైనస్థాయి కలిగిన కథ నంకాదని దమ్మున్న జర్నలిస్టు ఎవరైనా అంచనా కట్టగలరు. ప్రధాన సమర రంగంలో పూర్తి కార్యాచరణను రిపోర్టు చేయవలసి ఉన్న తరుణంలో, అప్రధాన రంగంలోని అసం బద్ధ అంశాలను నివేదించేందుకు పరుగులు తీస్తున్న టెలివి జన్ మీడియా ప్రత్యేకించి ఇంగ్లిష్ చానళ్లు తమ శ్రోతలకు, వీక్షకులకు ద్రోహం చేస్తున్న మాట నిజం. ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)aakar.patel@icloud.com)